కారోనా సమయంలో ఉచిత ప్యాక్‌లను ప్రకటించింన వోడాఫోన్ ఐడియా(Vi)
వోడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు Vi గా రూపాంతరం చెందిన తరువాత తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఆఫర్లను విడుదల చేస్తున్నది. అందులో బాగంగానే కోవిడ్ యొక్క 2 వ వేవ్ సమయంలో అన్ని సమయాల్లో కనెక్ట్ అయ్యేందుకు సహాయపడటానికి సుమారు 60 మిలియన్ల తక్కువ-ఆదాయ కస్టమర్ల కోసం ప్రత్యేక కోవిడ్ -19 రిలీఫ్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ సంస్థ తన తక్కువ ఆదాయ వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ఇలాంటి ప్లాన్లను ఇటీవల ప్రకటించింది. Vi ప్రకటించిన ఉచిత ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi COVID-19 సమయంలో అందించే ఉచిత ప్యాక్‌లు
COVID-19 యొక్క రెండవ వేవ్ ఉధృతి అవుతున్న సమయంలో లాక్ డౌన్ విధించడంతో ఈ ప్రత్యేక సమయంలో తన యొక్క వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ఆఫర్‌లలో భాగంగా కంపెనీ తన 60 మిలియన్ + తక్కువ ఆదాయ వినియోగదారులకు ఉచితంగా 49 రూపాయల ప్యాక్‌ను అందించనుంది. ఈ ప్యాక్ రూ.38 టాక్ టైం మరియు 100MB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ప్రస్తుత కఠినమైన సమయాల్లో తన కస్టమర్లు ఇంటి వద్దనే ఉంటూ తమకు నచ్చిన వారితో కనెక్ట్ అయ్యేలా ఉండడానికి వీలుగా ఉండేలా Vi భావిస్తోంది.

Vi డబుల్ కాంబో వోచర్
COVID-19 సమయంలో Vi టెల్కో మరొక ఆఫర్ ను కూడా ప్రకటించింది. Vi సంస్థ RC79 అనే కొత్త కాంబో వోచర్‌ను కూడా విడుదల చేసింది. ఇది భారతదేశ జనాభాలో పెద్ద స్థావరాలకు భారీ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ స్పెషల్ రీఛార్జ్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి డబుల్ టాక్‌టైమ్ రూ.128 (రూ. 64 + 64) మరియు 200MB డేటాతో వస్తుంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే అని గమనించండి.

ఎయిర్‌టెల్ రూ .49, రూ.79 ప్లాన్ ఫ్రీ బెనిఫిట్స్
భారతి ఎయిర్‌టెల్ COVID-19 రెండవ వేవ్ సమయంలో కొన్ని ఉచిత ప్యాక్ లను అందిస్తుంది. వీటిలో రూ.49 ప్యాక్‌లో రూ.38 విలువైన టాక్‌టైమ్, 100MB డేటా ప్రయోజనాలు 28 రోజుల వాలిడిటీ కాలానికి లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్యాక్ ఎటువంటి ఛార్జీలు లేకుండా వినియోగదారులకు ఉచితంగా అందించబడుతుంది. భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం రూ.79 ధర వద్ద లభించే ప్లాన్ యొక్క ప్రయోజనాలను కంపెనీ రెట్టింపు చేస్తుంది. రూ.79 రీఛార్జ్ ప్లాన్‌లో ప్రస్తుతం రూ.128 విలువైన టాక్‌టైమ్, 200MB డేటా వంటి ప్రయోజనాలు 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది.

రిలయన్స్ జియో COVID-19 ఉచిత ఆఫర్
రిలయన్స్ టెలికాం సంస్థ కూడా తన యొక్క జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు 10 నిమిషాల టాక్‌టైమ్‌ను ఉచితంగా పొందవచ్చు. అలాగే వినియోగదారు కొనుగోలు చేసే ప్లాన్‌పై బయ్-వన్-గెట్-వన్ ఆఫర్‌ను పొందుతారు. అంటే మీరు ఒక నిర్దిష్ట ప్లాన్‌ను కొనుగోలు చేస్తే కనుక మీరు అదే ప్లాన్ ను ఉచితంగా పొందుతారు. ఇది మొదటి ప్యాక్ ముగింపులో ఉపయోగం కోసం క్యూలో ఉంటుంది.


Click it and Unblock the Notifications








