Vi రీఛార్జ్ ధరలు పెరగనున్నాయి!! ఎయిర్‌టెల్ బాటలో టారిఫ్‌ల పెంపు...

|

ఇండియాలోని ప్రైవేట్ టెల్కోలలో వినియోగదారుల బేస్ పరంగా ఆఖరి స్థానంలో కొనసాగుతున్న వోడాఫోన్ ఐడియా(Vi) ఎల్లవేళలా టారిఫ్‌ల పరంగా ఎయిర్‌టెల్ సంస్థని అనుసరిస్తోంది. ఎయిర్‌టెల్ కంటే విపరీతమైన టారిఫ్ పెంపుదలని Vi కోరుకుంది. అయినప్పటికీ ఎయిర్‌టెల్ మరియు జియో నుండి పోటీని ఎదురుకోవడానికి నగదు కొరత ఉన్నప్పటికి టెల్కో తన యొక్క ప్లాన్ల ధరల పెంపుదలకు సంబందించిన ప్రకటనలను చేయలేకపోతుంది. గతంతో పోలిస్తే Vi తన సబ్‌స్క్రైబర్ మార్కెట్ వాటాను అధిక మొత్తంలో కోల్పోయింది. ఇది ఇప్పటికే ప్రైవేట్ టెల్కోస్‌లో అత్యల్పంగా ఉంది. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ ఇప్పటికే టారిఫ్ పెంపుతో ముందుకు సాగినందున వోడాఫోన్ ఐడియా(Vi) నుండి అదే కదలికను మనం చూడవచ్చు. అయితే ఏ మేర ధరలను పెంచనున్నదో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

వోడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

వోడాఫోన్ ఐడియా ఇంతకుముందు కూడా టారిఫ్‌ల ధరలను పెంచడంలో ఎయిర్‌టెల్‌ను అనుసరించింది. ఎయిర్‌టెల్ ఇంతకు ముందు ధరలను పెంచినప్పుడు వోడాఫోన్ ఐడియా రూ.49 ధర వద్ద లభించే తన బేస్ ప్లాన్‌ను ఆఫర్ నుండి తొలగించింది. రెండు టెల్కోలు వినియోగదారులకు రూ.79 ధర వద్ద అదే బేస్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్‌లలో ఒక్కో వినియోగదారుకు Vi యొక్క సగటు ఆదాయం (ARPU) అత్యల్పంగా ఉందని గమనించండి. కాబట్టి Vi త్వరలో టారిఫ్ పెంపునకు వెళ్లవచ్చు. అది ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న దాని కంటే కొంచెం తక్కువ ధరలో దాని ప్లాన్‌లను ఉంచవచ్చు. అదే సమయంలో తన ARPUని పెంచుకుంటూ Airtel కస్టమర్‌లను దూకుడుగా ఆకర్షించడానికి Vi కి ఇది సరైన మార్గం.

ఎయిర్‌టెల్

మీరు భారతీ ఎయిర్‌టెల్ నుండి కొత్త ప్రీపెయిడ్ టారిఫ్‌లను తనిఖీ చేయవచ్చు. ఊహించిన టారిఫ్ పెంపుదల మరియు ARPU పెరుగుదల కారణంగా Vodafone Idea షేర్లు ఇప్పటికే పెరిగాయి. Vi దాని ARPU త్వరగా మెరుగుపడాలని కోరుకుంటున్నందున ఎక్కువ సమయం వేచి ఉండకూడదు. Vodafone Idea ఇప్పటికే మార్కెట్లో కొన్ని అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. 10% నుండి 15% వరకు టారిఫ్ పెంపుదల అంటే మధ్యస్థం నుండి దీర్ఘకాలంలో ఎయిర్‌టెల్ కంటే ఎక్కువ ధరను తీసుకోవచ్చు. ప్రస్తుతానికి జియో టారిఫ్‌లను ఎప్పుడు పెంచుతుందో చెప్పలేము. జియో విషయానికి వస్తే జియో తన సబ్‌స్క్రైబర్ మార్కెట్ వాటాను మరింత మెరుగుపరుచుకోవాలనుకునే కారణంగా వెంటనే టారిఫ్‌ల పెంపుదలకు వెళ్లదు అనేది న్యాయమైన ఊహ.

అపరిమిత వాయిస్ కాల్స్

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క ఎంట్రీ-లెవల్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌ల ధరలను 25 శాతం పెంచుతుండగా, అపరిమిత వాయిస్ కాల్స్ బండిల్స్ ప్లాన్‌ల యొక్క ధరల మీద దాదాపు 20 శాతం వరకు పెంచుతున్నట్లు సమాచారం. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఇప్పుడు వోడాఫోన్-ఐడియా మరియు రిలయన్స్ జియో సంస్థల యొక్క ప్లాన్‌లతో పోలిస్తే అధిక ధరలను కలిగి ఉన్నాయి. ఈ ధరల పెంపుతో టెల్కోకు ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయాన్ని (ARPU) రూ.200కి చేరుకోవడానికి సహాయపడుతుంది. భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క ప్లాన్‌ల ధరలను పెంచడంతో రాబోయే రోజుల్లో రిలయన్స్ జియో మరియు వొడాఫోన్-ఐడియా వంటి పోటీదారులు కూడా తమ యొక్క ప్లాన్ ధరలను కూడా త్వరలోనే పెంచుతారని ఆశించవచ్చు. ఎయిర్‌టెల్ ధరల పెంపు తర్వాత ఇప్పుడు రూ.79 ధర వద్ద లభించే బేస్ ప్లాన్ తరువాత రూ.99 నుండి ప్రారంభమవుతుంది. అలాగే అత్యంత ఖరీదైన రూ.2498 ప్లాన్ ధర రూ.2999కి పెరిగే అవకాశం ఎంతగానో ఉంది.

Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు:

Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు:

** రూ.79 ప్లాన్ రూ.99కి పెంపు: రూ.99 విలువైన టాక్‌టైమ్ మరియు 200MB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

** రూ.149 ప్లాన్ రూ.179కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.219 ప్లాన్ రూ.265కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1GB డేటాను అందిస్తుంది.

** రూ.249 ప్లాన్ రూ.299కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.298 ప్లాన్ రూ.359కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.399 ప్లాన్ రూ.479కి పెంపు: 56 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.449 ప్లాన్ రూ.549కి పెంపు: 56 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.379 ప్లాన్ రూ.455కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 6GB డేటాను అందిస్తుంది.

** రూ.598 ప్లాన్ రూ.719కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.698 ప్లాన్ రూ.839కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.1498 ప్లాన్ రూ.1799కి పెంపు: 365 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 24GB డేటాను అందిస్తుంది.

** రూ.2498 ప్లాన్ రూ.2999కి పెంపు: 365 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

 

Airtel డేటా టాప్-అప్‌ల కొత్త ధరల వివరాలు

రూ.48 ప్లాన్ రూ.58కి పెంపు: 3GB డేటాను ఆఫర్ చేస్తుంది.

రూ.98 ప్లాన్ రూ.118కి పెంపు: 12GB డేటాను ఆఫర్ చేస్తుంది.

రూ.251 ప్లాన్ రూ.301కి పెరిగింది: 50GB డేటాను ఆఫర్ చేస్తుంది.

 

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Plan to Hike Recharge Prices! Might be Working on Increase in Tariffs on Airtel Route

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X