Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ల ఆఫర్లు ఏవిధంగా ఉన్నాయో చూడండి!!!

|

ఇండియాలోని టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా VI కొత్త బ్రాండ్ గా రూపాంతరం చెందిన తరువాత కొన్ని ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. యూజర్ల బేస్ తగ్గుతున్న క్రమంలో దానిని అరికట్టడానికి ఇటీవల కాలంలో ప్రీపెయిడ్ వినియోగదారులకు Vi కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను ప్రారంభించింది. దీనితో పాటుగా సరసమైన ధరల వద్దనే కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లను కూడా అందిస్తున్నది. ఇప్పటికే ఉన్న Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ప్రతి నెలా మంచి డేటా ప్రయోజనంతో వస్తున్నాయి. కాని కేటాయించిన పరిమితి కంటే ఎక్కువ డేటాను వినియోగించేవారి కోసం టెల్కో కొన్ని డేటా ప్యాక్‌లను కూడా అందిస్తున్నాయి. Vi అందించే డేటా ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ల ఆఫర్లు

Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ల ఆఫర్లు

వొడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం రూ.100 నుంచి డేటా ప్యాక్‌లను అందిస్తున్నాయి. ఇది ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క డేటా ప్రయోజనం కంటే 20GB డేటా అధిక ప్రయోజనాన్ని అందిస్తుంది. రెండవ పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్ యొక్క ధర 200 రూపాయలు. ఇది వినియోగదారులకు 50GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ సంస్థ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం అదే ధర వద్ద గల డేటా ప్యాక్‌లు వరుసగా 15GB మరియు 35GB డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.

 

 

Also Read: BSNL కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో జియోను మించిన ప్రయోజనాలుAlso Read: BSNL కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో జియోను మించిన ప్రయోజనాలు

Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ vs జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ డేటా ప్యాక్‌
 

Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ vs జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ డేటా ప్యాక్‌

కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం ద్వారా డేటా ప్యాక్‌లను యాక్టివేట్ చేసి డియాక్టివేట్ చేయవచ్చు. Vi యొక్క మొబైల్ యాప్ ద్వారా యాక్టివేట్ ప్రక్రియను ధృవీకరించలేరు. రిలయన్స్ జియో తన జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లతో అలాంటి డేటా ప్యాక్‌లను అందించడం లేదు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్ వినియోగదారులకు కేటాయించిన నెలవారీ డేటాను వినియోగం తరువాత కంపెనీ 1GBకి రూ.10 చొప్పున వసూలు చేయడం ప్రారంభిస్తుంది. ఇది Vi వినియోగదారులకు వర్తిస్తుంది మరియు ఉచిత డేటా వినియోగం తర్వాత కంపెనీ GB కి రూ.20 వసూలు చేయడం ప్రారంభిస్తుంది.

Vi రూ.699 RDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

Vi రూ.699 RDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థ తన వినియోగదారుల కోసం అద్భుతమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కలిగి ఉంది. వాటిలో ఒకటి రూ.699 ధర వద్ద లభించే RDX ప్లాన్. దీనిని Vi ఎంటర్టైన్మెంట్ ప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఇది అపరిమిత డేటా ప్రయోజనంతో వస్తుంది. ఇది భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా యూజర్ ఫ్రీ వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS‌లు, రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, Vi మూవీస్, టివి సబ్‌స్క్రిప్షన్, జోమాటో ఫుడ్ ఆర్డర్‌లపై రూ.200 వరకు, రూ.125 MPL క్యాష్‌ను అందిస్తుంది.

వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

వోడాఫోన్ సంస్థ రూ.109 మరియు రూ.169 ప్లాన్‌ల మధ్య రెండు రూ.129, రూ.149 ప్రీపెయిడ్ ప్యాక్‌లను తన వినియోగదారులకు అందిస్తున్నది. రూ.129 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 24 రోజుల వాలిడిటీతో 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే రూ.149 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రూ.129 రీఛార్జి ప్లాన్ అందించే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. రూ.129 మరియు రూ .149 ప్లాన్‌లు రెండూ వోడాఫోన్ ప్లే మరియు Zee5 వంటి OTT యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. వొడాఫోన్ రాబోయే రోజుల్లో రూ .109 మరియు 169 ప్లాన్‌లకు కూడా OTT యాప్ల ప్రయోజనాన్ని అందించవచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone Idea (Vi) Postpaid Data Packs Offers More Data

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X