Home
News

Amazon Prime సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఇండియాలోని టెలికాం పరిశ్రమలో మిగిలిన సంస్థలతో పోలిస్తే ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే ఇటీవల ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని జియో సంస్థ కొత్తగా పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లను సరసమైన ధరల వద్ద OTT చందాలతో మరియు ఇతర ప్రయోజనాలతో ప్రారంభించడంతో అందరి దృష్టి దాని మీదకు మళ్లింది. Vi సంస్థ ఇప్పుడు వ్యక్తిగత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూ .399, రూ .499, రూ .699 మరియు రూ .1,099 ధరల వద్ద నాలుగు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. వ్యక్తిగత వినియోగదారులను దృషిలో ఉంచుకొని లభించే రూ.699 Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రస్తుతం అత్యుత్తమమైన ఆఫర్‌లను అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకొవడానికి ముందుకు చదవండి.

Vi రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాలు?

Vi రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాలు?

వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం సంస్థ రూ.699 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రాథమిక ప్రయోజనాల విషయానికి వస్తే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS‌లు మరియు అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అపరిమిత డేటా బెనిఫిట్ ప్రత్యేకమైన ఆఫర్. టెల్కో నెలవారీ డేటాను 150GB వద్ద క్యాప్ చేస్తున్నప్పటికీ ఈ ధర పరిధిలో ఏ టెల్కో కూడా అందించని అత్యధిక డేటా ఆఫర్ ను ఇది అందిస్తున్నది.

 

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే సంవత్సరానికి రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందిస్తుంది. దీనితో పాటుగా రూ.125 MPL బోనస్ నగదు, జోమాటో ఫుడ్ ఆర్డర్‌లపై రూ .200 తగ్గింపు మరియు Vi మూవీస్ & టివి చందాకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

VI పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు

VI పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు

టెల్కోలు అందిస్తున్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను పక్కన పెడితే రూ.699 ధర వద్ద లభించే Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ డేటా ప్రయోజనాల విషయంలో మిగిలిన వారి కంటే ఎక్కువగా అందిస్తున్నది. టెల్కోలో అపరిమిత డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMSలు, సంవత్సరానికి రూ.5,988 విలువైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం, అదనపు ఖర్చు లేకుండా అంతర్జాతీయ & దేశీయ విమానాశ్రయ లాంజ్లకు ప్రవేశం కలిగిన రూ.1,099 RDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఇది రూ.2,999 విలువైన ఏడు రోజుల అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ కూడా ఉచితంగా అందిస్తుంది.

Vi vs జియో vs ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు

Vi vs జియో vs ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు

వోడాఫోన్ ఐడియా(Vi) అందిస్తున్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో పోల్చితే రూ.599 ధర వద్ద లభించే జియోపోస్ట్‌పెయిడ్ ప్లాన్ 100GB డేటాతో 200GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో వస్తుంది. అయితే రూ.799 జియోపోస్ట్‌పెయిడ్ ప్లాన్ 150GB డేటాను అందిస్తుంది. మరోవైపు రూ.799 ధర వద్ద ఎయిర్‌టెల్ ఇన్ఫినిటీ ప్లాన్‌లో 125GB డేటా బెనిఫిట్‌తో పాటు 200GB డేటా రోల్‌ఓవర్ సౌకర్యం ఉంది. 150GB డేటా ప్రయోజనంతో Vi యొక్క రూ.699 ప్లాన్‌ అందరి కంటే అధిక డేటాను అందిస్తున్నది. అయితే ఇందులో డేటా రోల్‌ఓవర్ సౌకర్యం లేదు. Vi ఈ ప్రణాళికను ‘ఎంటర్టైన్మెంట్ ప్లస్' అని పిలుస్తోంది. జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్లు నెలకు రూ.199 విలువైన నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్, ఒక సంవత్సరానికి రూ.399 విలువైన డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ మరియు రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ చందా వంటి అదనపు OTT సభ్యత్వాలను అందిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Postpaid Plan Offers Free Amazon Prime Subscription worth Rs 999 per year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X