Home
News

అపరిమిత డేటా ప్రయోజనంతో లభించే Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు వాటి వివరాలు

భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) తన యొక్క వినియోగదారులకు మొబైల్ డేటా వినియోగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా అన్లిమిటెడ్ డేటా ప్రయోజనంతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. Vi యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు పరిశ్రమలో అత్యుత్తమమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఇతర ఆపరేటర్‌లు ఎవరూ అందించని ప్రయోజనాలను వోడాఫోన్ ఐడియా టెల్కో తమ యొక్క వినియోగదారులకు అందిస్తుంది. Vi కంపెనీ నుండి లభించే అటువంటి పోస్ట్‌పెయిడ్ ప్లాన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ప్లాన్‌లతో వినియోగదారులు నిజంగా అపరిమిత డేటాను పొందుతారు. అంతేకాకుండా ఇది మీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కంటే ఖరీదైనది కాకపోవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అపరిమిత డేటాను అందించే Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

అపరిమిత డేటాను అందించే Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు అపరిమిత డేటా ప్రయోజనంతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ కొన్ని ప్లాన్‌లు పరిమిత డేటా ప్రయోజనంతో కూడా లభిస్తాయి. వీటిలో మొదటగా చాలా సరసమైన ధరలో లభించే వాటి యొక్క ప్రయోజనాలను పరిశీలిద్దాం. రూ.699 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ వినియోగదారులకు రెండు కనెక్షన్ లతో 80GB డేటాతో పాటు 200GB రోల్ ఓవర్ ఉపయోగంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారులు డేటాను వినియోగించకుండా నిర్దిష్ట పరిమితి వరకు పరిమితం చేసే డేటాపై ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) లేదు. ఈ ప్లాన్‌తో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే ఇది నెలకు 100 SMSలను అందిస్తుంది. ఇది చాలా మందికి సరిపోదు.

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌

అమెజాన్ ప్రైమ్ యొక్క ఒక-సంవత్సరం సభ్యత్వం మరియు రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ వంటి కొన్ని ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను ఉచితంగా అందించే Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలు రూ.999 నుండి ప్రారంభమవుతాయి. ఇంకా Vi సంస్థ యొక్క తన స్వంత OTT ప్లాట్‌ఫారమ్‌ని Vi Movies & TVని వినియోగదారుల కోసం బండిల్ చేయబడి వస్తాయి. అయితే రూ.999 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు మూడు కనెక్షన్ లతో 220GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది.

Vi REDX

వినియోగదారులకు నిజంగా అపరిమిత డేటా ప్రయోజనంతో లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు REDX వర్గంలోకి వస్తాయి. అయితే ఇందుకోసం వినియోగదారులు కనీసం నెలకు రూ.1,000 కంటే ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే Vodafone Idea నుండి REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఉపయోగించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. REDX ప్లాన్‌లతో వినియోగదారులు పొందే ప్రయోజనాల సంఖ్య దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. రూ.1299 ధర వద్ద లభించే ప్లాన్ మూడు కనెక్షన్ లతో 300GB డేటాను అందించగా రూ.1699 RDX ప్లాన్ మూడు కనెక్షన్ లతో అపరిమిత డేటాను మరియు రూ.2299 ధర వద్ద లభించే RDX ప్లాన్ 5 కనెక్షన్ లతో అపరిమిత డేటా మరియు వాయిస్ కాల్స్ ప్రయోజనాలతో లభిస్తాయి. ఇవి అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మరియు Vi Movies & TV వంటి సబ్‌స్క్రిప్షన్‌లతో లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Postpaid Plans Available With The Benefits of Unlimited Data and Free OTT Subscription: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X