Home
News

వొడాఫోన్ ఐడియా(Vi) నెట్‌ఫ్లిక్స్ ఉచిత ఆఫర్ గురించి మీకు తెలియని విషయాలు

ఒక సాధారణ జీవితం గడుపుతున్న మీరు మీ యొక్క నెలవారీ మొబైల్, కరెంట్ లేదా ఇతర బిల్లుల చెల్లింపుల మీద నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను పొందితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వినడానికి ఇది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది కదూ? నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ చౌకగా లేనందున మీరు దీనిని కొనుగోలు చేయలేకపోవడంతో నిరుత్సాహపడవచ్చు. అయితే మీరు నెలవారీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ చందాదారులైతే వొడాఫోన్ ఐడియా మీకు ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా నెట్‌ఫ్లిక్స్ అందించడానికి ఒక మార్గం అందిస్తున్నది. వోడాఫోన్ ఐడియా నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ కంపెనీ నుండి REDX ప్లాన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులందరికీ వర్తిస్తుంది. REDX ప్లాన్‌లు అనేవి కంపెనీ యొక్క ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు. ఇవి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఎలా ఉచితంగా అందిస్తుందో వంటి మరిన్ని వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వొడాఫోన్ ఐడియా యూజర్లకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ OTT యాప్ లు

వొడాఫోన్ ఐడియా యూజర్లకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ OTT యాప్ లు

REDX ప్లాన్‌లను ఎంచుకుంటున్న Vi వినియోగదారులు బహుళ ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను పొందడానికి అర్హులు. రూ. 1099, రూ .1699, మరియు రూ. 2299 ధరల వద్ద మూడు REDX ప్లాన్‌లు Vi వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు ప్లాన్‌లు వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు Vi మూవీస్ & టీవీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. ఈ మూడు ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ మరియు వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ ప్రీమియర్ సర్వీస్‌ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తాయి. రూ.1099 ప్లాన్ ఒక సభ్యునికి మాత్రమే లభిస్తుంది. అయితే రూ.1699 మరియు రూ.2299 ప్లాన్‌లు వరుసగా 3 మరియు 5 మంది సభ్యులకు అన్ని రకాల సర్వీసులతో వస్తాయి. REDX ప్లాన్‌లలో ఏవైనా అందించే అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ విలువ రూ.2999 మరియు ప్రతి సంవత్సరం ఏడు రోజులు వర్తిస్తుంది.

REDX ప్లాన్

వొడాఫోన్ ఐడియా యొక్క రూ.1099 REDX ప్లాన్ నెలకు 100 SMS లను మాత్రమే అందిస్తుందని గమనించండి. అయితే రూ.1699 మరియు రూ. 2299 ప్లాన్‌లు ప్రతి నెలా 3000 SMS అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లతో టెల్కో వినియోగదారులకు నిజంగా అపరిమిత డేటాను అందుకుంటారు. దీని అర్థం ఒక వినియోగదారుడు ఒక రోజు, వారం లేదా నెలలో ఎంత వినియోగించవచ్చనే దానిపై డేటా పరిమితులు లేవు.

ఫ్యామిలీ REDX ప్లాన్‌

Vi ఫ్యామిలీ REDX ప్లాన్‌ల కోసం కంపెనీ నుండి సేవలను వినియోగించే మొత్తం ఐదుగురు వ్యక్తులకు వినియోగదారులు ఒకే బిల్లును పొందుతారు. ఇంట్లో అనేక మంది వ్యక్తుల కోసం అనేక బిల్లులు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. యూజర్లు తమ కుటుంబ సభ్యులకు సరిపోయే మొబైల్ నంబర్లను పొందే అవకాశాన్ని కూడా పొందుతారు కావున వారు దానిని ఎప్పటికీ మర్చిపోకుండా చూసుకోవచ్చు.

VIP యాక్సెస్‌

అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ రెండూ వినియోగదారులకు 1 సంవత్సరం చెల్లుబాటుతో లభిస్తాయి. ఇంకా కంపెనీ Vi మూవీస్ & టీవీ అప్లికేషన్‌కు VIP యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది వినియోగదారులకు లైవ్ స్పోర్ట్స్ లను ప్రసారం చేయడానికి, వివిధ OTT అప్లికేషన్‌ల నుండి కంటెంట్‌ను ప్లే చేయడానికి మరియు మరిన్నింటిని మొబైల్ యాప్‌లో అనుమతిస్తుంది. ఇవన్నీ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది.

2GB బోనస్ డేటా

వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క పోర్టుపోలియోలో రూ.219 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ ఇప్పుడు వినియోగదారులకు కొత్తగా 2GB బోనస్ డేటాను అందిస్తోంది. యూజర్ నేరుగా వెబ్‌సైట్ లేదా కంపెనీ మొబైల్ అప్లికేషన్ ద్వారా రీఛార్జ్ చేస్తే మాత్రమే ఈ ప్లాన్ బోనస్ డేటాను అందిస్తుందని గమనించండి. వినియోగదారులు థర్డ్-పార్టీ కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ నుండి రీఛార్జ్ కోసం వెళితే వారికి బోనస్ డేటా అందించబడదు. వొడాఫోన్ ఐడియా ఈ ఆఫర్‌ను "యాప్/వెబ్ ఎక్స్‌క్లూజివ్" గా పేర్కొంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక వినియోగదారుల కోసం కాదు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 1GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు.ఈ ప్లాన్ అందించే మొత్తం డేటా 28GB వెబ్/యాప్ ప్రత్యేకమైన ఆఫర్ లేకుండా ఉంటుంది. 2GB బోనస్ డేటాతో కలుపుకొని వినియోగదారులు మొత్తంగా 30GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ తో ఉచితంగా లభించే ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాల విషయానికి వస్తే Vi మూవీస్ & టీవీ ఉన్నాయి. Vi మూవీస్ & టివి యాప్ ఇప్పుడు నేరుగా Vi మొబైల్ ఫోన్‌లో నేరుగా టీవీ, వార్తలు, సినిమాలు మరియు ఒరిజినల్ షోలను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Postpaid Plans Offers Netflix Free Subscription: You Should to Know Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X