Home
News

1.5GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు..

ఇండియన్ ప్రైవేట్ టెల్కో వోడాఫోన్ ఐడియా(Vi) దాని పోటీదారులతో పోలిస్తే మొత్తం నెట్‌వర్క్ పనితీరులో కొంచెం వెనుకబడి ఉంది. అయితే కంపెనీ అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిశీలిస్తే కనుక మిగిలిన వారికి బిన్నంగా ఉండడమే కాకుండా అవి నిజంగా అసాధారణమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. Vi తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందించే అదనపు ప్రయోజనాలు దేశంలోని ఏ ఇతర టెలికాం ఆపరేటర్ కూడా అందించలేదు. కంపెనీ అందించే అన్ని రకాల ప్లాన్‌లలో అధిక మంది దృష్టి సారించే 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi రూ.299 ప్లాన్

Vi రూ.299 ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.299 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా వీకెండ్ డేటా రోల్‌ఓవర్, బింగే ఆల్ నైట్ మరియు డేటా డిలైట్ వంటి Vi హీరో యొక్క అన్‌లిమిటెడ్ ప్రయోజనాలకు కూడా వినియోగదారులు అదనంగా యాక్సెస్ ను పొందుతారు. ఈ ప్లాన్‌తో అదనంగా Vi మూవీస్ & TV క్లాసిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Vi రూ 479 ప్లాన్

Vi రూ 479 ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ. 299 ప్లాన్‌కు సమానంగా అందించే మరొక ప్లాన్ రూ.479 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. రెండు ప్లాన్‌ల మధ్య అదనపు ప్రయోజనాలు పూర్తిగా ఒకేలా ఉంటాయి. అలాగే రూ.666 ధర వద్ద లభించే ప్లాన్ అదే ప్రయోజనాలతో 77 రోజుల చెల్లుబాటు కాలానికి అందుబాటులో ఉంటుంది. జియో టెల్కో తన 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌ను 84 రోజుల పాటు అందిస్తుంది. మీరు Vi నుండి 1.5GB రోజువారీ డేటాతో 84 రోజుల ప్లాన్‌ను పొందాలనుకుంటే మీరు రూ.719 చెల్లించాలి. అన్ని ప్లాన్‌ల మాదిరిగానే Vi యొక్క రూ. 666 మరియు రూ.719 ప్లాన్‌లు కూడా రూ.219 ప్లాన్ అందించే అదే అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.

Vi సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌

Vi సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.599 ధర వద్ద అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను 70 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. అదే ప్లాన్‌ను 70 రోజులు, 77 రోజులు మరియు 84 రోజులకు అందిస్తున్నందున కంపెనీ వ్యూహం కొంచెం అస్పష్టంగా ఉంది. అయితే మీరు ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడకపోతే కనుక మరియు సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌పై ఆసక్తి ఉంటే కనుక Vi రూ.2899 ధర వద్ద అందించే సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌కు వెళ్లవచ్చు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజుల చెల్లుబాటు కాలానికి 1.5GB రోజువారీ డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.839 ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.839 ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో WFH యూజర్ల కోసం అందిస్తున్న చివరి ప్లాన్ రూ.839 ధరతో లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఇది వినియోగదారులకు రోజువారీ 2GB డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే కంపెనీ అందించే బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్ ఆఫర్‌లను ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా రోజువారీ డేటా కోటా వినియోగం తర్వాత, డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Provide 1.5GB Daily Data Prepaid Plans: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X