అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ ఇప్పుడు Vi యాప్‌లో!! మిస్ అవ్వకండి

|

దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా (Vi) స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారుల కోసం Vi యాప్‌ను అందిస్తున్న విషయం అందరికి తెలిసినదే. ఇప్పుడు ఈ Vi యాప్‌లో తన యొక్క వినియోగదారుల కోసం అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ని తీసుకువచ్చింది. భారత సాయుధ దళాలకు చెందిన అగ్నివీర్ల మొదటి రిక్రూట్‌మెంట్ ఇటీవల ప్రారంభమైంది.

అగ్నివీర్వాయు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్వాయు పరీక్షను జూలై 24, 2022న నిర్వహించనున్నది. అంతేకాకుండా 2800 ఇండియన్ నేవీ అగ్నివీర్ (SSR) ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆన్‌లైన్ పద్దతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో చేరాలని ఆసక్తి ఉన్న వారు www.joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూలై 15 నుండి జూలై 22 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు సన్నధం అవ్వడానికి కావలసిన మెటీరియల్‌ ఇప్పుడు Vi యాప్‌లో అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ వోడాఫోన్ ఐడియా(Vi)యాప్‌లో

అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ వోడాఫోన్ ఐడియా(Vi)యాప్‌లో

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన మొబైల్ యాప్‌లో కొన్ని నెలల క్రితం కొత్తగా జాబ్ పోర్టల్‌ను ప్రకటించింది. Vi యాప్‌లోని Vi జాబ్స్ & ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ విభాగం అనేది భారతదేశంలో ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు సహాయపడటానికి రూపొందించబడింది. ఇప్పుడు ఈ యాప్‌లోని జాబ్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారుల కోసం అగ్నివీర్ కోర్సు మెటీరియల్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అగ్నివీర్ టెస్ట్ సిరీస్‌ను నిర్వహించడానికి డెహ్రాడూన్‌కు చెందిన క్యాడెట్స్ డిఫెన్స్ అకాడమీ నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు.

Vi

వోడాఫోన్ ఐడియా (Vi) యాప్‌లో గల మెటీరియల్‌ విషయానికి వస్తే అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ X గ్రూప్, అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ Y గ్రూప్, అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ X & Y గ్రూప్, అగ్నివీర్ నేవీ MR మరియు అగ్నివీర్ నేవీ SSR కోసం ఒక్కొక్కటి 15 టెస్ట్‌లతో కూడిన మొత్తం ఐదు టెస్ట్ సిరీస్‌లు ఉన్నాయి. ఆర్మీ టెస్టు సిరీస్‌ను ఈ నెలాఖరులోగా చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది.

Vi మొబైల్ యాప్

ఈ టెస్ట్ మెటీరియల్‌ని వినియోగదారులు Vi మొబైల్ యాప్ ద్వారా ఒక నెల పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. అంతేకాకుండా అనేక ఇతర ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు. ట్రయల్ వ్యవధి తర్వాత ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా కోర్స్ ని నేర్చుకోవడం కొనసాగించడానికి వినియోగదారులు సంవత్సరానికి రూ.249 చెల్లించాలి. వినియోగదారులు పొందడానికి అపరిమిత మాక్ టెస్ట్‌లు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌లో 150+ కంటే ఎక్కువ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌లు ఉన్నాయి. Vi జాబ్స్ & ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి మీ రిజిస్టర్డ్ నంబర్ ద్వారా Vi మొబైల్ యాప్‌లో లాగిన్ చేయండి.

ఆకర్షణీయమైన ప్రయోజనాలతో Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఆకర్షణీయమైన ప్రయోజనాలతో Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం సంస్థ మరింత మంది యూజర్లను ఆకట్టుకోవడానికి రూ.299 మరియు అంతకంటే ఎక్కువ ధరతో లభించే ప్రీపెయిడ్ ప్యాక్‌లతో వినియోగదారులకు హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది. మారుమూల ప్రాంతాలలో నెట్‌వర్క్ ఉండకపోవచ్చు కానీ పెద్ద మరియు పట్టణాలలో నెట్‌వర్క్ బాగానే ఉంటుంది. మరి ముఖ్యంగా అధిక మంది జనాభా నివసించే స్మార్ట్ నగరాలలో అన్ని టెల్కోల యొక్క నెట్‌వర్క్ లు బాగానే ఉంటాయి. Vi యొక్క నెట్‌వర్క్ బాగా ఉన్న ప్రాంతాలలో మీరు నివసిస్తుంటే కనుక మిగిలిన టెల్కోల కంటే మెరుగైన ప్రయోజనాలతో కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తున్నాయి. ఇక్కడ మేము డేటా యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్‌ల గురించి మాట్లాడటం లేదని గమనించండి. మీరు Viని ప్రైమరీ కనెక్షన్‌గా ఉపయోగించాలని చూస్తున్నట్లయితే కనుక రూ.299 ధర వద్ద లభించే మరియు దాని కంటే అధిక ధర వద్ద లభించే అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందడం అనేది చాలా మంచి ఎంపిక. దురదృష్టం ఏమిటంటే Vi ఇంతకు ముందు తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందించే డబుల్ డేటా బండిల్ ఆఫర్ ని ప్రస్తుతం అందించదు. ఈ ఆఫర్ ఇప్పటికి అందిస్తుంటే కనుక ఈ టెల్కో అందించే ఆఫర్లు మరొకటి అందించేది కాదు. రోజువారీ FUP (న్యాయమైన-వినియోగం-విధానం) పరిమితి ఆధారంగా Vi యొక్క ప్లాన్ లతో మీరు గరిష్టంగా 3GB వరకు డేటాను పొందుతారు. టెల్కో అందించే లంప్సమ్ డేటా ప్లాన్‌లు కూడా ఉన్నాయి.

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.839 ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.839 ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో WFH యూజర్ల కోసం అందిస్తున్న చివరి ప్లాన్ రూ.839 ధరతో లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఇది వినియోగదారులకు రోజువారీ 2GB డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే కంపెనీ అందించే బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్ ఆఫర్‌లను ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా రోజువారీ డేటా కోటా వినియోగం తర్వాత, డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Provide Agniveer Course Material on Vi App: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X