Home
News

OTT ప్రయోజనాలతో లభించే వొడాఫోన్ ఐడియా (Vi) ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన యొక్క వృద్ధిని పెంచుకోవడం కోసం వినియోగదారులకు అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడంలో బాగా ప్రసిద్ధి చెందింది. బింగే ఆల్ నైట్ మరియు వీకెండ్ డేటా రోల్‌ఓవర్ వంటి రెండు ప్రత్యేకమైన ఆఫర్‌లను కూడా టెల్కో అందిస్తుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో సహా ఇతర కంపెనీలు ఏవీ కూడా తమ వినియోగదారులకు అలాంటి అద్భుతమైన ఆఫర్‌లను అందించవు. అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌లతో ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను కూడా అదనంగా పొందుతారు. వోడాఫోన్ ఐడియా నుండి లభించే అటువంటి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OTT ప్రయోజనాలతో వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

OTT ప్రయోజనాలతో వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులకు OTT ప్రయోజనాలతో బహుళ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్రత్యేక ప్లాన్‌లు వరుసగా రూ.501, రూ .601, రూ.901, రూ.701 మరియు రూ .2595 ధరల వద్ద లభిస్తున్నాయి. ఈ ప్లాన్‌లన్నీ కూడా డిస్నీ+ హాట్‌స్టార్ యొక్క మెయిన్ OTT ప్రయోజనంతో వస్తాయి. ఈ ప్లాన్‌లలో ఎక్కువ భాగం Vi మూవీస్ & టీవీ ప్రయోజనాలతో కూడా వస్తాయి. Vi మూవీస్ & టివి అనేది వోడాఫోన్ ఐడియా స్వయంగా అభివృద్ధి చేసిన OTT సమర్పణ.

స్వల్ప వ్యాలిడిటీ ప్లాన్

రూ.601 ధర వద్ద లభించే ప్లాన్ మినహా అన్ని ప్లాన్‌లతో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. అయితే రూ.601 ప్లాన్ 75GB డేటాను మాత్రమే 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 4G డేటా వోచర్ మరియు ఇతర ప్రయోజనాలను అందించదు. రూ.501 ధర వద్ద లభించే ప్లాన్ కేవలం 28 రోజుల సర్వీసు వాలిడిటీతో వస్తుంది. కావున స్వల్ప వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులు రూ.501 ప్లాన్‌తో 3GB రోజువారీ డేటాను పొందుతారు. రూ.701 మరియు రూ.901 ప్లాన్‌లు రెండూ కూడా వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అందిస్తాయి. ఇందులో రూ.701 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో లబిస్తుంటే రూ.901 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. చివరిగా రూ.2595 ప్లాన్ విషయానికొస్తే వినియోగదారులు 365 రోజుల కాలంలో 1.5GB రోజువారీ డేటాను పొందుతారు.

వీకెండ్ డేటా రోల్‌ఓవర్

రూ.601 ధర వద్ద లభించే ప్లాన్‌ మినహా మిగిలిన ఈ ప్లాన్‌లన్నీ 'బింగే ఆల్ నైట్' మరియు 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్‌తో వస్తాయి. బింగే ఆల్ నైట్ ఆఫర్‌తో వినియోగదారులు మొత్తం చెల్లుబాటులో ప్రతిరోజూ 12 AM మరియు 6 AM మధ్య అపరిమిత హై-స్పీడ్ 4G డేటాను పొందుతారు. ఈ రాత్రి సమయంలో ఉపయోగించిన డేటా పగటి ప్రణాళిక యొక్క ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను ప్రభావితం చేయదు.

వీకెండ్ డేటా రోల్‌ఓవర్

మరోవైపు వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్‌తో వినియోగదారులు వారాంతాల్లో వారం రోజుల నుండి మిగిలిపోయిన FUP డేటాను పొందుతారు. ఈ ఆఫర్ కింద వారం రోజులు సోమవారం నుండి శుక్రవారం వరకు మరియు వారాంతాలు శని-ఆదివారాలుగా వర్గీకరించబడతాయి. మిగిలిపోయిన డేటాను వారాంతంలో వినియోగించకపోతే అది వచ్చే వారంలో అందుబాటులో ఉండదు. ఇతర ఆపరేటర్లు ఎవరూ తమ వినియోగదారులకు అంత మంచి ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Provide Mind-Blowing Special Prepaid Plans With OTT Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X