వోడాఫోన్ ఐడియా(Vi) సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్‌ల పూర్తి వివరాలు...

|

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా కొన్ని సంవత్సరాల క్రితం కనీస రీఛార్జ్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రతి ప్రీపెయిడ్ వినియోగదారుడు తమ యొక్క అకౌంటును యాక్టీవ్ లో ఉంచడానికి ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ కనీస రీఛార్జ్ సౌకర్యం ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క ప్రీపెయిడ్ వినియోగదారులందరికీ కూడా వర్తిస్తుంది. టెల్కోస్ యొక్క అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్లు రూ.100 పైన ప్రారంభమవుతాయి. అయితే ప్రతి యూజర్ ప్రతి నెలా రూ.100 కంటే ఎక్కువగా ఖర్చును చేయడానికి ఆసక్తిని చూపరు. టెల్కోలు సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టడానికి కారణం మీ అకౌంట్ యొక్క సర్వీస్ వాలిడిటీని మరొక 56 రోజులపాటుగా పొడిగించడానికి. వోడాఫోన్ ఐడియా(Vi) ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన ప్రీపెయిడ్ వినియోగదారులకు కొన్ని 'సర్వీస్ వాలిడిటీ రీఛార్జ్ ప్యాక్‌లను' అందిస్తోంది. ఈ ప్యాక్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా రూ.39 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్‌ వివరాలు

వోడాఫోన్ ఐడియా రూ.39 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్‌ వివరాలు

వోడాఫోన్ ఐడియా(Vi) సంస్థ తన యొక్క సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రస్తుతం రూ.39 నుండి ప్రారంభమై రూ.95 వరకు అందిస్తుంది. రూ.39 సర్వీస్ వాలిడిటీ ప్యాక్ రూ.30 టాక్‌టైమ్, 100MB డేటాను అందిస్తుంది. ఇది అన్ని స్థానిక / జాతీయ వాయిస్ కాల్‌లకు సెకనుకు 2.5 పైసలు ఛార్జ్ చేస్తుంది. ఈ రూ.39 ప్యాక్ చెల్లుబాటు 14 రోజులు మాత్రమే.

 

Also Read: Airtel, Jio, Vi 3నెలల వాలిడిటీతో 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు!!! రూ.400 లోపు మాత్రమేAlso Read: Airtel, Jio, Vi 3నెలల వాలిడిటీతో 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు!!! రూ.400 లోపు మాత్రమే

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.49 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.49 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.49 ధర వద్ద మరొక సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్ ను కూడా అందిస్తున్నది. ఇది ప్రతి యూజర్ వారి అకౌంటును చురుకుగా ఉంచడానికి ఎంచుకునే ప్లాన్. ఈ ప్లాన్ రూ.38 టాక్ టైమ్, 100MB డేటాతో వస్తుంది. ఇది సెకనుకు 2.5 పైసల చొప్పున కాల్స్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ప్రచార ఆఫర్‌లో భాగంగా కంపెనీ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసే Vi వినియోగదారులు అదనంగా మరొక 200MB డేటాను పొందడానికి కూడా అర్హులు అవుతారు. అంటే ఇది మొత్తంగా 300MB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలాన్ని కలిగి ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.79 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.79 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు

వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క జాబితాలో తదుపరిది రూ.79 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్. ఇది రూ.64 టాక్ టైమ్, 200MB డేటాను అందిస్తుంది. ఇది వాయిస్ కాల్స్ కోసం సెకనుకు ఒక పైస చొప్పున వసూలు చేయబడుతుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 28 రోజులు. అలాగే పరిమిత కాలానికి అందుబాటులో గల ప్రచార ఆఫర్‌లో భాగంగా కంపెనీ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసే Vi వినియోగదారులు అదనంగా మరో 400MB డేటా ప్రయోజనం లభిస్తుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.95 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.95 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు

వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క జాబితాలో చివరిది రూ.95 సర్వీస్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్యాక్. ఇది రూ.74 పరిమిత టాక్ టైమ్ మరియు 200MB డేటా ప్రయోజనంను అందిస్తుంది. ఇది అన్ని స్థానిక మరియు జాతీయ వాయిస్ కాల్‌లకు సెకనుకు 2.5 పైసలు వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 56 రోజులు.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Provide Service Validity Prepaid Packs Under Rs.100

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X