వోడాఫోన్ ఐడియా(Vi) REDX ప్లాన్‌లలో సరికొత్త ప్రయోజనాల మార్పులు....
భారతదేశంలోని ప్రవైట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన వోడాఫోన్ ఐడియా టెల్కో వినియోగదారులకు Vi REDX అనే ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. REDX ప్లాన్‌లు వినియోగదారుల అవసరాన్ని బట్టి వ్యక్తులు లేదా చిన్న కుటుంబం ఇద్దరికీ యాక్టివేట్ చేయబడతాయి. Vi అందించే REDX ప్లాన్ దానితో వచ్చే అద్భుతమైన ప్రయోజనాల కారణంగా టన్నుల కొద్దీ వినియోగదారులను ఆకర్షిస్తుంది. REDX విభాగంలో అందించే ఫ్యామిలీ ప్లాన్‌లు ఒకే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద కుటుంబంలోని బహుళ మొబైల్ నంబర్‌లను ఒకచోట చేర్చడానికి వినియోగదారులకు సహాయపడడమే కాకుండా ఒకే బిల్లు పేమెంట్ సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. Vi యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా Vi యాప్ నుండి వినియోగదారులు REDX కనెక్షన్‌ని పొందవచ్చు. Vi ద్వారా అందించే REDX ప్లాన్‌లు మరియు టెల్కో యొక్క ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

REDX ప్లాన్‌ల ధరలు & ఇతర వివరాలు
వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో దాని REDX ప్లాన్‌ల విభాగంలో వినియోగదారులకు మూడు విభిన్న రకాల ప్లాన్‌లను అందిస్తుంది. ఇందులో మొదటి ప్లాన్ వ్యక్తిగత వినియోగదారులకు అందుబాటులో ఉండి నెలకు రూ.1,099 ధర ట్యాగ్‌తో లభిస్తుంది. అలాగే Vi అందించే రెండవ REDX ప్లాన్ ముగ్గురు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలను ముగ్గురు కుటుంబ సభ్యులు ఒకే ధర ట్యాగ్ కింద ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.1,699. జాబితాలో చివరిది రూ.2,299 ధర వద్ద లభించే REDX ప్లాన్. ఇది ఐదుగురు కుటుంబ సభ్యులను ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కనెక్ట్ చేయడానికి కొనుగోలు చేయవచ్చు.

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో యొక్క REDX ప్లాన్‌లలో అత్యంత ఆకర్షణీయమైన అంశం అయిన వాటి ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్‌లు నిజంగా అపరిమిత హై-స్పీడ్ డేటాతో వస్తాయి. అంతేకాకుండా REDX ప్లాన్ యాక్టివేట్ అయ్యే వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబడవు. అంతేకాకుండా REDX ప్లాన్ యాక్టివేట్ చేయబడిన కాలంలో ప్లాన్‌లు అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తాయి. REDX తన వినియోగదారులకు US & కెనడా @50p/min, చైనా & HK @Rs.2/min, UK & బంగ్లాదేశ్ @ రూ.3/నిమి, ఆస్ట్రేలియా/ భూటాన్/ జర్మనీ/ కువైట్//పాకిస్తాన్/సింగపూర్/థాయిలాండ్ @ రూ.5/నిమి మరియు మలేషియాతో సహా 14 దేశాలకు ప్రత్యేక కాలింగ్ రేట్లను అందిస్తుంది.

Vi REDX ప్లాన్‌ల అదనపు ప్రయోజనాలు
వోడాఫోన్ ఐడియా(Vi) REDX విభాగంలో అందించే మూడు ప్లాన్‌లు OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌తో సహా అదనపు ప్రయోజనాలతో వస్తాయి. వినియోగదారులు ఈ ప్లాన్‌లతో ప్రతి సంవత్సరం రూ.5,988 విలువైన టీవీ మరియు మొబైల్‌లో నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ పొందవచ్చు, అయితే ఇద్దరు ఫ్యామిలీ ప్లాన్‌ల కింద నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ ప్రాథమిక వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా వినియోగదారులు రూ.1,499 విలువైన అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క 1-సంవత్సర సభ్యత్వానికి కూడా ఉచిత యాక్సిస్ ను పొందుతారు. కుటుంబ ప్లాన్‌ల కోసం ప్రాథమిక సభ్యుని వద్ద మాత్రమే యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా ఒక సంవత్సరం మొబైల్ డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్‌ను కూడా పొందుతారు. REDX ప్లాన్‌లు Vi Movies మరియు TVకి VIP యాక్సెస్‌ని కూడా అందిస్తాయి. వినియోగదారులు వారి Vi Movies మరియు TV యాప్‌లో ప్రీమియం ఒరిజినల్‌లు, సినిమాలు, లైవ్ టీవీ మరియు మరిన్నింటిని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది.

కుటుంబ యాక్సెస్‌తో లభించే అమెజాన్ ప్రైమ్ మరియు Disney+ హాట్‌స్టార్ ప్రయోజనాలు ఏ ఇతర పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో పొందకపోతే మాత్రమే వర్తిస్తాయని గమనించాలి. మూడు ప్లాన్‌లు కూడా విమానాశ్రయ లాంజ్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తాయి. అంతేకాకుండా REDX కింద కుటుంబ ప్లాన్‌లు ఆరు నెలల పాటు లాక్-ఇన్‌తో వస్తాయి. అంటే REDXని యాక్టివేట్ చేసిన మొదటి ఆరు నెలల్లో వినియోగదారులు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ని మార్చాలని లేదా ప్రీపెయిడ్ కనెక్షన్‌కి మారాలని నిర్ణయించుకుంటే కనుక వన్-టైమ్ ఎగ్జిట్ ఫీజులో భాగంగా రూ.3000 మొత్తం ఛార్జ్ చేయబడుతుంది. అలాగే iPhone వినియోగదారులు వారి మొదటి REDX బిల్లుపై 100% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.


Click it and Unblock the Notifications








