Home
News

గతంలో తొలగించిన ప్రీపెయిడ్ ప్లాన్‌ని తిరిగి ప్రవేశపెట్టిన Vi !! అధిక ప్రయోజనాలతో

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో గతంలో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లను తొలగించింది. అయితే ఇందులోని రూ.601 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఇప్పుడు మళ్లీ ప్రవేశపెట్టింది. ఇంతకుముందు Vi యొక్క రూ.601 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 75GB డేటాను 56 రోజుల చెల్లుబాటుతో అందించేది. అంతేకాకుండా ఇది 75GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టిన రూ.601 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తక్కువ వ్యాలిడిటీతో వస్తుంది కానీ మెరుగైన ప్రయోజనాలతో లభిస్తుంది. కొత్త ప్రయోజనాల వివరాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.601 ప్లాన్ కొత్త ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.601 ప్లాన్ కొత్త ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం తిరిగి ప్రవేశపెట్టబడిన రూ.601 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ఇది మొత్తం వాలిడిటీలో 84GB డేటాను అందిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం వోడాఫోన్ ఐడియా ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 16GB అదనపు డేటాను కూడా జాబితా చేసింది. అంటే ఈ ప్లాన్‌కు సభ్యత్వం పొందిన Vi ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు 28 రోజుల వ్యవధిలో మొత్తం 100GB డేటాను పొందుతారు.

భారీ డేటా

భారీ డేటా ప్రయోజనాలతో పాటు రూ.601 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, Vi TV మరియు మూవీస్ యాప్‌లోని కంటెంట్‌కి ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది. దీనితో పాటుగా ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటా మరియు వారాంతపు డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తుంది. దానితో పాటుగా రూ.601 ప్లాన్ ని పొందిన అందరు సబ్‌స్క్రైబర్‌లకు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ని కూడా అందిస్తుంది. లభ్యత విషయానికొస్తే Vi యొక్క రూ. 601 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అన్ని ఛానెల్‌ల ద్వారా అందుబాటులో ఉంది. అయితే Vi's యాప్‌ని ఉపయోగించి రీఛార్జ్ చేసుకునే సబ్‌స్క్రైబర్‌లు రూ.100 వరకు తగ్గింపును పొందుతారు.

వోడాఫోన్ ఐడియా(Vi) నిలిపివేసిన ఇతర ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) నిలిపివేసిన ఇతర ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో గత నెలలో నిలిపివేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.601 మాత్రమే కాదని గమనించాలి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తన రూ.701 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను కూడా నిలిపివేసింది. మరోవైపు ఈ ప్లాన్ 56 రోజుల వ్యవధిలో 3GB రోజువారీ డేటాను అందించింది. మొత్తం మీద ఈ ప్లాన్ సుమారు రెండు నెలల వ్యవధిలో మొత్తం 168GB డేటాను అందించింది. దీనితో పాటు ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ కోసం వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలను కూడా అందించింది. ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఇదే విధమైన చర్యను అనుసరించారు. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ దాని రూ. 398, రూ. 499 మరియు రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను నిలిపివేసింది. అలాగే జియో తన 499, రూ. 666, రూ. 888 మరియు రూ. 2,499 ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Reintroduces Previously Deleted Rs.601 Prepaid Plan With more Data Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X