150GB అదనపు డేటా ప్రయోజనంతో Vi రూ.399 ఎంటర్టైన్మెంట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్..
ఇండియాలో ప్రస్తుతం రూ.299 ధర వద్ద పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (Vi) మాత్రమే. అయినప్పటికి ఇతరులతో పోటీపడే పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లు రూ.399 ధర నుండి ప్రారంభమవుతాయి. Vi యొక్క పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేకమైన ఆఫర్ కింద REDX Rs.1,099 ప్లాన్ ను అందిస్తున్నది. భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో మాదిరిగా కాకుండా వోడాఫోన్ ఐడియా సంస్థ ఫ్యామిలీ వినియోగదారుల కోసం పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వేరు చేస్తుంది.

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు
Vi టెల్కో వ్యక్తిగత వినియోగదారుల కోసం రూ.299, రూ.399, రూ.499, రూ.699 మరియు రూ.1,099 ధర వద్ద పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కొన్ని సర్కిల్‌లలో రూ.598 వద్ద మరియు మరికొన్ని సర్కిల్‌లలో రూ.649 ధర వద్ద నుండి ప్రారంభమవుతాయి. చెన్నై, తమిళనాడు మరియు మహారాష్ట్ర & గోవా వంటి ఎంపిక చేసిన సర్కిళ్లలో రూ .598 మరియు రూ.699 ఫ్యామిలీ ప్లాన్ ల పెంపు గురించి ఇప్పటికే నివేదించాము. అధికంగా డేటా అవసరం ఉన్న యూజర్లు రూ.1,099 ధర వద్ద లభించే RDX వ్యక్తిగత ప్లాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బేసిక్ వినియోగదారులకు రూ.399 ధర వద్ద పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లభిస్తుంది. దీనిని ‘Vi ఎంటర్టైన్మెంట్' పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రస్తుతం మొదటి ఆరు నెలలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 150GB అదనపు డేటాను అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi రూ.399 ఎంటర్టైన్మెంట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
Vi టెల్కో రూ.399 ధర వద్ద అందించే ఎంటర్టైన్మెంట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు మంచి ఎంపికగా ఉంటుంది. దీని యొక్క ఆఫర్లో సరసమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సాధారణంగా 40GB డేటాతో లభిస్తుంది. అయితే పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు myvi.in వెబ్‌సైట్ ద్వారా ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 150GB డేటాను పొందవచ్చు. ఈ అదనపు డేటా ప్లాన్ ఎంచుకున్న తేదీ నుండి ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారులకు 200GB డేటా రోల్-ఓవర్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. కాని 150GB ప్రయోజనం డేటా రోల్‌ఓవర్ సదుపాయంలో భాగం కాదు.

Vi ఎంటర్టైన్మెంట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు
Vi రూ.399 ఎంటర్టైన్మెంట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు ఒక నెలకు 100SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ Vi మూవీస్ & టీవీ యాప్ సబ్స్క్రిప్షన్ మినహా ఇతర ఈ OTT సభ్యత్వాలతోనూ రాదు. ISD కాల్స్ నిమిషానికి 50 పైసల చొప్పున వసూలు చేయబడుతుందని Vi తెలిపింది.


Click it and Unblock the Notifications








