Just In
- 8 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 10 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 14 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Vodafone Idea(Vi) యొక్క ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలలో కొత్త చేరికలు
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలు వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియోలు తమ వినియోగదారులకు ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటుగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నాయి. వినియోగదారులకు అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అధిక ప్రయోజనాలను భారీగా లోడ్ చేయబడిన విషయంలో వోడాఫోన్ ఐడియా (Vi) కింగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. Vi టెల్కో రూ.699 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు ఎయిర్‌టెల్ మరియు జియో సంస్థలు అందించే ప్లే లతో పోలిస్తే చాలా బిన్నంగా ఉన్నాయి.

వోడాఫోన్ ఐడియా ఈ ప్యాక్‌తో నిజంగా అపరిమిత డేటాను అందిస్తుంది. మీరు vi యొక్క ప్రాథమిక వినియోగదారు అయితే కనుక మరియు రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ని ఉపయోగిస్తుంటే కనుక అదనపు డేటా వినియోగం కారణంగా ఎక్కువ బిల్లులు పొందడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. REDX ప్లాన్‌లు ఉన్నప్పటికీ జియో మరియు ఎయిర్‌టెల్ సంస్థలు తమ కస్టమర్‌లకు అందించే ప్రయోజనాల కంటే మెరుగైనవిగా ఉన్నాయి. Vi యొక్క REDX ప్లాన్‌లతో పోలిస్తే రూ.699 ధర వద్ద లభించే అల్ట్రా-ప్రీమియం ప్లాన్ చాలా సరసమైనది మాత్రమే కాకుండా మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎందుకు ఉత్తమమైనది?
వోడాఫోన్ ఐడియా (Vi) తన యొక్క వినియోగదారులకు రూ.699 ధర వద్ద అందించే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో మీరు నిజంగా అపరిమిత డేటాను పొందవచ్చు. దీనితో పాటుగా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు Vi యాప్ మరియు ZEE5 ప్రీమియం యొక్క ఆరు నెలల సబ్స్క్రిప్షన్ తో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, Vi మూవీస్ & TV మరియు హంగామా మ్యూజిక్ లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లన్నింటి సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడం కోసం వినియోగదారులు అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ ను కొనుగోలు చేయడంతో వీటిని ఉచితంగా పొందవచ్చు.

Vi రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు 100 SMSలను కూడా అందిస్తుంది. నిజం చెప్పాలంటే ఇదొక విచిత్రం. Vi ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 100 SMSలను ఆఫర్ చేయగలిగితే పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం టెల్కో ఎందుకు అలా చేయదు?

జియో మరియు ఎయిర్‌టెల్‌తో సహా ఇతర ఆపరేటర్‌లు ఎవరూ తమ కస్టమర్‌లకు ఇటువంటి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందించడం లేదు. Vi యొక్క ప్రధాన పోటీదారుల యొక్క అత్యంత ఖరీదైన ప్లాన్‌లు కూడా నిజమైన అపరిమిత డేటాను అందించడం లేదు. Vi కస్టమర్‌లు ఈ అద్భుతమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ని అందిస్తున్నప్పుడు దీనిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. Vi టెల్కో అనేక రాష్ట్రాలు/సర్కిళ్లలో తన మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరుస్తుంది. మార్చి మరియు ఏప్రిల్ 2022లో ఢిల్లీ వంటి మార్కెట్‌లలో అత్యధిక మంది సబ్‌స్క్రైబర్‌లను జోడించినట్లు నివేదించింది.

Vi టెల్కో నిజంగా అపరిమిత డేటాను అందించే ఇతర ప్లాన్‌లు కూడా ఉన్నాయి. కానీ ఆ ప్లాన్‌లన్నీ REDX కేటగిరీ విభాగం కింద లభిస్తాయి. ఈ విధంగా వినియోగదారులు రూ.1000లోపు ధర వద్ద నిజంగా అపరిమిత డేటాను పొందగలిగే సాధారణ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లలో ఇది కూడా ఒకటి. మీరు Vi మొబైల్ నెట్‌వర్క్ మెరుగ్గా ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే కనుక మీరు ఎంచుకోవడానికి ఈ ప్లాన్ ఉత్తమంగా ఉంటుంది.

Vi సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.599 ధర వద్ద అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను 70 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. అదే ప్లాన్‌ను 70 రోజులు, 77 రోజులు మరియు 84 రోజులకు అందిస్తున్నందున కంపెనీ వ్యూహం కొంచెం అస్పష్టంగా ఉంది. అయితే మీరు ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడకపోతే కనుక మరియు సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌పై ఆసక్తి ఉంటే కనుక Vi రూ.2899 ధర వద్ద అందించే సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌కు వెళ్లవచ్చు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజుల చెల్లుబాటు కాలానికి 1.5GB రోజువారీ డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

వోడాఫోన్ ఐడియా (Vi) రూ.839 ప్లాన్
వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో WFH యూజర్ల కోసం అందిస్తున్న చివరి ప్లాన్ రూ.839 ధరతో లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఇది వినియోగదారులకు రోజువారీ 2GB డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే కంపెనీ అందించే బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్ ఆఫర్‌లను ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా రోజువారీ డేటా కోటా వినియోగం తర్వాత, డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470