Home
News

మెరుగైన గ్రూప్ వీడియో కాలింగ్ కోసం వోడాఫోన్ ఐడియా(Vi) ఉత్తమమైనది...

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో నెట్‌వర్క్ కవరేజ్ విభాగంలో పాయింట్లు లేనప్పటికీ వినియోగదారులకు అద్భుతమైన డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని అందించడం అందరికంటే ముందున్నది. ఈ టెలికాం ఆపరేటర్ తన వినియోగదారుల డేటా అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు తన 4G నెట్‌వర్క్‌లను మెరుగుపరచడానికి భారీగా పెట్టుబడులు పెడుతోంది. గ్రూప్ వీడియో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై ఓపెన్‌సిగ్నల్ నివేదిక ప్రకారం Vi భారతదేశంలోని వినియోగదారులకు ఉత్తమ గ్రూప్ వీడియో కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఉత్తమ గ్రూప్ వీడియో కాలింగ్ అనుభవాన్ని అందించడంలో వోడాఫోన్ ఐడియా రిలయన్స్ జియో మరియు బిఎస్ఎన్ఎల్ కంటే చాలా ముందుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా అప్‌లోడ్ స్పీడ్

ఇండియాలో మొబైల్ నెట్‌వర్క్ అనుభవంపై మార్చి 2021 న విడుదలైన ఓపెన్‌సిగ్నల్ నివేదిక ప్రకారం ఉత్తమమైన అప్‌లోడ్ వేగాన్ని అందించడంలో Vi మిగిలిన ఆపరేటర్ల కంటే ముందుంది. Vi యొక్క నెట్‌వర్క్‌లు వినియోగదారులకు ఉత్తమ గ్రూప్ వీడియో కాలింగ్ అనుభవాన్ని అందించడానికి ఇది స్పష్టమైన కారణం. ఇది మాత్రమే కాకుండా Vi గత మూడు త్రైమాసికాలలో భారతదేశం అంతటా ఉత్తమ డౌన్‌లోడ్ వేగాన్ని అందించింది.

4G

ఇవన్నీ భారతదేశం అంతటా 4G సేవలకు ఉపయోగించాల్సిన 3G స్పెక్ట్రం యొక్క రీఫార్మింగ్ యొక్క ఫలితం. ఓపెన్‌సిగ్నల్ ప్రకారం ఉత్తమ గ్రూప్ వీడియో కాలింగ్ అనుభవాన్ని అందించడానికి భారతదేశం యొక్క టెలికాం ఆపరేటర్ల యొక్క పాయింట్ల రేట్ ను విడుదల చేసారు. వీటిలో వోడాఫోన్ ఐడియా అధిక పాయింట్లతో ముందువరుసలో ఉంది. వొడాఫోన్ ఐడియా - 59.2, భారతి ఎయిర్‌టెల్ - 55.1, రిలయన్స్ జియో - 41.4, చివరిగా బిఎస్‌ఎన్‌ఎల్ - 22.5 పాయింట్లతో వరుసగా ఉన్నాయి.

ఓపెన్సిగ్నల్

ఓపెన్సిగ్నల్ విడుదల చేసిన నివేదిక అధికంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఎంపిక చేసిన 21 మార్కెట్లలో, వినియోగదారులకు ఉత్తమ గ్రూప్ వీడియో కాలింగ్ అనుభవాన్ని అందించడంలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. అదే జాబితాలో జపాన్ మొదటి స్థానంలో మరియు సింగపూర్ రెండవ స్థానాల్లో ఉన్నాయి.

గ్రూప్ వీడియో కాల్‌

గ్రూప్ వీడియో కాల్‌లో ఒక యూజర్ యొక్క అనుభవం చెదిరిపోతే కనుక అది కాల్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ పేలవమైన అనుభవాన్ని ఇస్తుందని నివేదిక హైలైట్ చేసింది. ఇతర రెండు ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే పరీక్షలో జియో స్కోరు గణనీయంగా తక్కువగా ఉంది, ఇది రాబోయే రోజుల్లో టెల్కో పరిగణించాల్సిన విషయం. జియో భారతదేశం అంతటా ఇటీవల జరిగిన వేలంలో కొనుగోలు చేసిన అదనపు స్పెక్ట్రంను అమలు చేస్తోంది. ఇది రాబోయే రోజుల్లో వినియోగదారులకు డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. Vi కూడా తన యొక్క నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరచగలిగితే కనుక అది అజేయంగా మారుతుంది. వినియోగదారులకు ఉత్తమ నెట్‌వర్క్ అనుభవాన్ని అందించడంలో జియో మరియు ఎయిర్‌టెల్ విజయవంతమవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea (Vi) Surpasses Other Telcos in Providing Better Group Video Calling
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X