గేమింగ్ ప్రియులకు శుభవార్త!! Vi గేమ్‌లను ప్రారంభించిన ప్రైవేట్ టెల్కో...

|

ఇండియాలోని టెలికాం రంగంలో గల ప్రైవేట్ టెల్కోలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) తన యొక్క యూజర్ బేస్ ను మరింత పెంచుకోవడం కోసం అనేక కొత్త ప్లాన్లను విడుదల చేయడంతో పాటుగా మరిన్ని ప్రయత్నాలను కూడా చేస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ నేడు భారతదేశంలో Vi గేమ్స్ గా పిలువబడే కొత్త గేమింగ్ సర్వీసును ప్రారంభించింది. Vi గేమ్స్ ను భారతదేశానికి చెందిన గేమింగ్ కంపెనీ అయిన నజారా టెక్నాలజీస్(Nazara Technologies) భాగస్వామ్యంతో ప్రారంభించబడింది. కొత్తగా ప్రారంభించబడిన వోడాఫోన్ ఐడియా యొక్క గేమింగ్ సర్వీస్ 1,200 కంటే ఎక్కువ మొబైల్ గేమ్‌లతో వినియోగదారులకు Vi యాప్‌లో యాక్సెస్‌ చేయడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Vi గేమింగ్ సర్వీస్

Vi గేమింగ్ సర్వీస్

వోడాఫోన్ ఐడియా వినియోగదారులు Vi యాప్‌లోని గేమ్‌ల ట్యాబ్ విభాగం ద్వారా గేమింగ్ సర్వీస్ కు యాక్సిస్ ను పొందవచ్చు. ఇది హోమ్ మరియు లైవ్ టీవీ ట్యాబ్‌ల పక్కనే అందుబాటులో ఉంటుంది. Vi యాప్‌లోని Vi గేమ్‌లలో యాక్షన్, అడ్వెంచర్, ఆర్కేడ్, క్యాజువల్, ఎడ్యుకేషన్, ఫన్, పజిల్, రేసింగ్, స్పోర్ట్స్ మరియు స్ట్రాటజీ వంటి 10 ప్రముఖ జానర్‌లలో ఆండ్రాయిడ్ మరియు HTML5 ఆధారిత మొబైల్ గేమ్‌ల లీనమయ్యే గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయని కంపెనీ తెలిపింది.

Vi గేమ్స్

వోడాఫోన్ ఐడియా టెలికాం దిగ్గజం యొక్క Vi గేమ్స్ మొదట్లో సాధారణ గేమింగ్ కంటెంట్‌ను కలిగి ఉంటుందని మరియు భవిష్యత్తులో క్రమంగా సామాజిక గేమింగ్ మరియు eస్పోర్ట్స్ ఈవెంట్‌లను హోస్ట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని టెలికాం దిగ్గజం తెలిపింది. లభ్యత విషయానికి వస్తే Vi Gamesలోని కంటెంట్ మూడు విభాగాలలో భాగంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో ఉచిత గేమ్‌లు, ప్లాటినం గేమ్స్ మరియు గోల్డ్ గేమ్‌లు వంటివి మరిన్ని ఉన్నాయి.

Vi గేమ్‌స్
 

- Vi గేమ్‌స్ ఎటువంటి ఛార్జీలు లేదా గేమ్‌లో కొనుగోళ్లు లేకుండానే 250కి పైగా ఉచిత గేమ్‌లను హోస్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

- ప్లాటినం గేమ్‌లు పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు రూ.25 మరియు ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.26 చెల్లించే ప్లాటినం పాస్ ద్వారా పే-పర్-డౌన్‌లోడ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి.

- చివరగా గోల్డ్ గేమ్‌లు గోల్డ్ పాస్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది పోస్ట్‌పెయిడ్ చందాదారులకు రూ.50 ధరకు మరియు ప్రీపెయిడ్ చందాదారులకు రూ.56 ధరతో 30 గోల్డ్ గేమ్‌లను అందజేస్తుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో రానుంది.

- అదనంగా రూ.499 మరియు అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌ను ఎంచుకున్న పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రతి నెలా ఐదు ఉచిత గోల్డ్ గేమ్‌లను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

 

Vi - నజారా టెక్నాలజీస్‌ భాగస్వామ్యం

Vi - నజారా టెక్నాలజీస్‌ భాగస్వామ్యం

"మేము మా డిజిటల్ కంటెంట్ వ్యూహంలో గేమింగ్‌ను ప్రధానంగా ఫోకస్ చేసే ప్రాంతంగా మార్చాలని చూస్తున్నాము. సాధారణ మరియు తీవ్రమైన గేమ్ లను ఇష్టపడే గేమర్‌లను దృష్టిలో ఉంచుకొని వారు అందరు కూడా Viని ఇష్టపడే గమ్యస్థానంగా స్థాపించే లక్ష్యంతో గేమింగ్‌లోని చాలా కోణాలను కలుపుకొని సమగ్రమైన గేమ్ ను రూపొందించాలని మేము భావిస్తున్నాము. నజారా టెక్నాలజీస్‌తో మా భాగస్వామ్యం మా వినియోగదారుల కోసం Vi యాప్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన గేమ్‌ల యొక్క విస్తృతమైన సౌజన్యం ద్వారా మా వినియోగదారులకు అందించే గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది" అని వోడాఫోన్ ఐడియా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అవనీష్ ఖోస్లా Vi గేమ్‌లను ప్రకటిస్తూ చెప్పారు.

వోడాఫోన్ ఐడియా(Vi) డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు

వోడాఫోన్ ఐడియా(Vi) డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు చౌకైన ధరలో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనాన్ని ఉచితంగా అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రూ.601 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 3GB రోజువారీ డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్ 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంటుంది. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్‌తో Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలలో బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో పాటు వినియోగదారులు Vi మూవీస్ & TV VIPకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ మరియు 16GB బోనస్ డేటా వంటి అధిక ప్రయోజనాలు కూడా పొందుతారు. వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.901 ధర వద్ద అందించే మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌తో కూడా తన యొక్క వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 3GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభిస్తుంది. ఈ ప్లాన్‌ 70 రోజుల సర్వీస్ వాలిడిటీతో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనంగా ఈ ప్లాన్ కు టెల్కో యొక్క అన్ని Vi హీరో ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఈ ప్లాన్ 48GB బోనస్ డేటాతో పాటు Vi Movies & TV VIP యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Telco Launches Vi Games For Gaming Enthusiasts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X