Work @ Home యూజర్లకు Vi టెల్కో అందించే ఉత్తమమైన డేటా వోచర్‌లు

|

భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థ తన వినియోగదారులకు ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్లు మరియు డేటా వోచర్‌లను అందిస్తుంది. ఇంటి వద్ద నుండి పనిచేసే వారి యొక్క ఇంటర్నెట్ అవసరాలను తీర్చడానికి టెల్కో ఉత్తమంగా 4 డేటా వోచర్‌లను అందిస్తుంది. Vi అందించే అన్ని డేటా వోచర్‌లు జియో మాదిరిగా కాకుండా స్వతంత్ర యాక్సిస్ తో వస్తాయని గమనించండి. Vi యొక్క 4G డేటా వోచర్‌లలో చాలావరకు యూజర్ యొక్క బేస్ ప్లాన్ మాదిరిగానే చెల్లుతుంది. వోడాఫోన్ ఐడియా (Vi) అందించే ఉత్తమ డేటా వోచర్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డేటా వోచర్లు

Vi నుండి వచ్చిన ఉత్తమమైన నాలుగు డేటా వోచర్లు రూ.251, రూ .351, రూ .355 మరియు రూ.501 ధరల వద్ద లభిస్తాయి. ఈ నాలుగింటిలో రూ.355 మరియు రూ.501 ధరల వద్ద లభించే వోచర్లు అధిక ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలతో వస్తాయి.

రూ.251 డేటా వోచర్

రూ.251 ధర వద్ద లభించే మొదటి వోచర్ వినియోగదారులకు 50GB డేటాను 28 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఇంటి వద్ద నుండి పనిచేసే వినియోగదారులకు తక్కువ ధరలో సహాయపడటానికి సంస్థ దీనిని మంచి సమర్పణగా ప్రారంభించింది. అయితే ఈ వోచర్‌తో ఎటువంటి ఇతర ప్రయోజనాలు లేవు. రెండవది రూ.351 ధర వద్ద లభించే డేటా వోచర్ 56 రోజుల వాలిడిటీ కాలానికి 100GB డేటాతో లభిస్తుంది. యూజర్లు ఈ వోచర్‌తో కూడా ఇతర ప్రయోజనాలను పొందలేరు.

Vi టెల్కో

Vi టెల్కో తమ యూజర్లకు అందించే మూడవ డేటా వోచర్ రూ.355 ధర వద్ద అందిస్తుంది. ఈ డేటా వోచర్‌ 28 రోజుల చెల్లుబాటు కాలానికి 50GB డేటాను అందిస్తుంది. ఈ వోచర్ ఒక సంవత్సరం చెల్లుబాటుతో ZEE5 ప్రీమియం యొక్క OTT ప్రయోజనంతో వస్తుంది. చివరగా రూ.501 ధర వద్ద లభించే డేటా వోచర్‌ వినియోగదారులకు 56 రోజుల వాలిడిటీలో 75GB డేటాను పొందుతారు. ఈ వోచర్ ఒక సంవత్సరం వాలిడిటీకి డిస్నీ + హాట్‌స్టార్ VIP OTT ప్రయోజనంను అందిస్తుంది.

నాలుగు వోచర్లు

కంపెనీ అందించే ఈ మొదటి నాలుగు వోచర్లు ఏవీ కూడా వినియోగదారులకు వాయిస్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలను అందించవు. ఆఫర్‌లో అనేక ఇతర వోచర్‌లు కూడా ఉన్నాయి. ఇవి వారి అపరిమిత ప్యాక్‌లలో తక్కువ మొత్తంలో డేటాను పెంచాలని చూస్తున్న వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి. కంపెనీ అందించే చౌకైన వోచర్ రూ.16 ధర వద్ద వస్తుంది. ఇది వినియోగదారులకు 1GB డేటాను 1 రోజుకు అందిస్తుంది. Vi టెల్కో వోచర్ అందించే డేటా అత్యధికంగా రూ.351 ప్లాన్‌తో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Telco Offers Best 4G Data Vouchers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X