3GB డైలీ డేటా & OTT ప్రయోజనాలతో లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో వెనుకంజలో ఉన్న వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తమ కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అధిక డేటా ప్రయోజనాలకు అనుగుణంగా నిరంతరం తన యొక్క ప్లాన్‌లలో మార్పులను చేయడమే కాకుండా కొత్త ప్లాన్ లను అందజేస్తూనే ఉంది. 4G డేటా స్పీడ్‌ను అందించే విషయంలో తాజా TRAI నివేదికల ప్రకారం Reliance Jioతో పోటీగా ఎటువంటి అంతరాలు లేకుండా అందిస్తున్నది. అలాగే ఇంటర్నెట్ వేగం విషయానికి వస్తే అత్యంత మెరుగైన సర్వీసుగా మారింది. వోడాఫోన్ ఐడియా దాని డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. ఈ టెలికాం కంపెనీ తన కస్టమర్ల కోసం వివిధ అద్భుతమైన ఆఫర్‌లు మరియు ప్లాన్‌లను అందించినప్పటికీ ఇప్పుడు OTT ప్రయోజనాలతో లభించే 3GB రోజువారీ డేటా ప్లాన్‌ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా(Vi) రోజువారి 3GB డేటా ప్లాన్‌లు
వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అందించే చౌకైన అపరిమిత ప్లాన్ రూ.501 ధర వద్ద వస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటును మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ వినియోగదారులకు అదనంగా 16GB డేటా అదనంగా అందిస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో వస్తుంది. ఇది Vi Movies మరియు TV మరియు కొన్ని ఇతర అప్లికేషన్‌లతో పాటు ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్లలో డిస్నీ+ హాట్‌స్టార్‌కు కూడా కస్టమర్‌లు 1-సంవత్సరం యాక్సెస్‌ను పొందుతారు.

వోడాఫోన్ ఐడియా(Vi) నుండి 3GB రోజువారీ డేటాతో వచ్చే రెండవ ప్లాన్ రూ.701 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క సర్వీస్ వాలిడిటీ 56 రోజులు. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో వస్తుంది. అలాగే ఈ ప్లాన్ వినియోగదారులకు అదనంగా 32GB డేటా అదనంగా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు Vi Movies మరియు TVతో పాటు OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్‌కి 1-సంవత్సరం యాక్సెస్ పొందుతారు. అదనంగా ఈ ప్లాన్ 'బింగే ఆల్ నైట్' ఆఫర్‌ను అందిస్తుంది. దీని కింద వినియోగదారులు ఎటువంటి ప్యాక్ మినహాయింపు లేకుండా అర్ధరాత్రి 12 మరియు ఉదయం 6 గంటల మధ్య ఇంటర్నెట్‌లో ప్రసారం చేయవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు సోమవారం నుండి శుక్రవారం మధ్య ఉపయోగించని డేటాను శనివారం మరియు ఆదివారం వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఫార్వార్డ్ చేయవచ్చు.

డైలీ 3GB డేటా జాబితాలో లభించే వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క చివరి ప్లాన్ రూ.901 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క సర్వీస్ వాలిడిటీ 84 రోజులు. ఇతర ప్లాన్‌ల మాదిరిగానే వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనంతో లభిస్తుంది. పరిశ్రమ అగ్రగామి రిలయన్స్ జియో అందించే ప్లాన్ కంటే ఈ ప్లాన్ కొంచెం సరసమైనది. రిలయన్స్ జియో అదే ప్లాన్‌ని రూ.999కి ధర వద్ద అందిస్తోంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అదనంగా 48GB డేటా అదనంగా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఇతరుల మాదిరిగానే Vi Movies మరియు TVతో పాటు OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్‌కు 1-సంవత్సరం యాక్సెస్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌తో ఉన్న వినియోగదారులు ‘బింగే ఆల్ నైట్' ఆఫర్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు, దీని కింద వినియోగదారులు ఎటువంటి సాధారణ డేటా తగ్గింపు లేకుండా అర్ధరాత్రి 12 మరియు ఉదయం 6 గంటల మధ్య ఇంటర్నెట్‌లో ప్రసారం చేయవచ్చు.

2GB బోనస్ డేటాను అందించే వొడాఫోన్ ఐడియా(Vi) సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క పోర్టుపోలియోలో రూ.219 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు వినియోగదారులకు కొత్తగా 2GB బోనస్ డేటాను అందిస్తోంది. యూజర్ నేరుగా వెబ్‌సైట్ లేదా కంపెనీ మొబైల్ అప్లికేషన్ ద్వారా రీఛార్జ్ చేస్తే మాత్రమే ఈ ప్లాన్ బోనస్ డేటాను అందిస్తుందని గమనించండి. వినియోగదారులు థర్డ్-పార్టీ కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ నుండి రీఛార్జ్ కోసం వెళితే వారికి బోనస్ డేటా అందించబడదు.వొడాఫోన్ ఐడియా ఈ ఆఫర్‌ను "యాప్/వెబ్ ఎక్స్‌క్లూజివ్" గా పేర్కొంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక వినియోగదారుల కోసం కాదు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 1GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు.ఈ ప్లాన్ అందించే మొత్తం డేటా 28GB వెబ్/యాప్ ప్రత్యేకమైన ఆఫర్ లేకుండా ఉంటుంది. 2GB బోనస్ డేటాతో కలుపుకొని వినియోగదారులు మొత్తంగా 30GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ తో ఉచితంగా లభించే ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాల విషయానికి వస్తే Vi మూవీస్ & టీవీ ఉన్నాయి. Vi మూవీస్ & టివి యాప్ ఇప్పుడు నేరుగా Vi మొబైల్ ఫోన్‌లో నేరుగా టీవీ, వార్తలు, సినిమాలు మరియు ఒరిజినల్ షోలను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

వోడాఫోన్ ఐడియా ఎంటర్ప్రైజ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్
Vi సంస్థ నుండి వచ్చిన అన్ని కొత్త ఎంటర్ప్రైజ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లు నిజంగా అపరిమిత వాయిస్ కాలింగ్, నెలకు 3000 SMS లలో రోజుకు 100 SMS మరియు మొబైల్ సెక్యూరిటీ, Vi మూవీస్ & టివి, Vi కాలర్ ట్యూన్స్ వంటి బిజినెస్ ప్లస్ బెనిఫిట్లతో వస్తాయి. రూ.499 ధర వద్ద లభించే ప్లాన్ రూ.399 విలువ గల సంవత్సర చెల్లుబాటు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంతో వస్తుంది. భారతి ఎయిర్‌టెల్ కూడా ఇటీవల ఎంటర్‌ప్రైజ్ మరియు రిటైల్ కస్టమర్ల కోసం వినియోగదారుకు సగటు ఆదాయాన్ని (ARPU) లక్ష్యంగా కొత్త పోస్ట్‌పెయిడ్ ప్రణాళికలను ప్రకటించింది. టెల్కో నుండి ఈ కొత్త ప్రణాళికలు టెల్కో కస్టమర్లు ఎలా గ్రహించారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications