Home
News

2019 అక్టోబర్ తరువాత మొదటిసారి నెట్ యూజర్లను వృద్ధిని అందుకున్న Vi

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవలే ఫిబ్రవరి 2021 కోసం తన నెలవారీ నివేదికను విడుదల చేసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క పనితీరు వివరాలను విడుదల చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన సంఘటనల విషయానికి వస్తే తరచూ ఎప్పుడు చందాదారులు కోల్పోయే వోడాఫోన్ ఐడియా (Vi) ఎట్టకేలకు చివరకు నెలాఖరులో నెట్ చందాదారులను చేర్చుకున్నది. అంతేకాకుండా భారతీ ఎయిర్‌టెల్ రిలయన్స్ జియో కంటే ఎక్కువ మంది సభ్యులను చేర్చే ర్యాలీని కూడా కోల్పోయింది. అన్ని ఆపరేటర్లలో జియో సంస్థ ఈ నెలలో అత్యధిక సంఖ్యలో చందాదారులను చేర్చింది. ఫిబ్రవరి నెల యొక్క చందాదారుల సంఖ్యల గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫిబ్రవరిలో చేర్చుకున్న చందాదారుల సంఖ్య

ఫిబ్రవరిలో చేర్చుకున్న చందాదారుల సంఖ్య

ఫిబ్రవరి నెల నాటికి ఎయిర్టెల్ 3.7 (37,37,645) మిలియన్ చందాదారులను చేర్చుకోగలిగింది. అయితే రిలయన్స్ జియో ఈ నెలలో నికరంగా 4.2 మిలియన్ (42,66,819) చందాదారులను చేర్చుకున్నది. తరచూ వినియోగదారులను కోల్పోయే వోడాఫోన్ ఐడియా(Vi) ఈ నెలలో వినూత్నంగా 0.65 మిలియన్ (6,52,625) మంది చందాదారులను చేర్చగలిగింది. 2019 అక్టోబర్ తరువాత Vi టెల్కోకు నెట్ చందాదారులను చేర్చుకోవడం ఇదే మొదటిసారి. తరువాత ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ల విషయానికొస్తే బిఎస్ఎన్ఎల్ 0.35 మిలియన్ (3,59,157) చందాదారులను, MTNL 5,261 మంది సభ్యులను కోల్పోయింది.

వైర్‌లెస్ చందాదారుల సంఖ్య

బీహార్ మరియు హిమాచల్ ప్రదేశ్ మినహా ప్రతి రాష్ట్రంలో వైర్‌లెస్ చందాదారుల సంఖ్య పెరుగుదలను చూసింది. ముంబైలో వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 4.83% వరకు పెరిగింది. ఇది ఈ నెలలో ఒక సర్కిల్‌కు చెందిన అతిపెద్ద వృద్ధి. వైర్‌లెస్ చందాదారులలో 1.95% రెండవ అత్యధిక వృద్ధి రేటుతో పంజాబ్ తరువాతి స్థానంలో ఉంది.

వైర్‌లెస్ చందాదారుల

భారతదేశంలో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వైర్‌లెస్ చందాదారులను చేర్చడం అనేది ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో బడ్జెట్లు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అలాగే లెగసీ నెట్‌వర్క్ వినియోగదారులను వారి 4G సేవలకు మార్చడానికి టెలికం ఆపరేటర్లు ముందుకు వస్తున్నారు. ఇంకా ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వారి సంఖ్య అధికంగానే కొనసాగుతున్నది. వీరి యొక్క డేటా మరియు వాయిస్ కాలింగ్ అవసరాలకు ఎక్కువ మంది వైర్‌లెస్ కనెక్షన్‌లను కొనుగోలు చేయడం మీద దృష్టి సారిస్తున్నారు.

ఫిబ్రవరి మార్కెట్ వాటా

ఫిబ్రవరి నెల యొక్క చందాదారుల మార్కెట్ వాటా విషయానికొస్తే రిలయన్స్ జియో 35.54% వాటాతో మళ్లీ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో భారతి ఎయిర్‌టెల్ 29.83% వాటాతో, వోడాఫోన్ ఐడియా 24.20% వాటాతో , బిఎస్‌ఎన్‌ఎల్ 10.15% వాటాతో చివరిగా ఎమ్‌టిఎన్ఎల్ 0.28% వాటాతో కొనసాగుతున్నాయి. ప్రతి త్రైమాసికం మరియు నెలలో బిఎస్ఎన్ఎల్ చందాదారుల మార్కెట్ వాటా తగ్గుతుండడం అనేది విచారకరం. ఫిబ్రవరి చివరలో జియోఫోన్ 2021 ఆఫర్‌ను ప్రారంభించినందున జియో సంఖ్యలలో చిన్న సానుకూల ప్రభావాన్ని చూసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Telco Received The Growth of Net Users Subscribers For The First Time Since October 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X