అమెజాన్ ప్రైమ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వాలిడిటీని తగ్గిస్తున్న Vi టెల్కో...

|

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు అనేక రకాల ప్లాన్‌లను అందిస్తున్నది. ఇందులో ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. యూజర్లను ఆకట్టుకోవడానికి Vi టెల్కో తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో అమెజాన్ ప్రైమ్ యొక్క సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ యొక్క చెల్లుబాటును టెల్కో తగ్గించింది. ఏప్రిల్ 18న తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో అందించే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ చెల్లుబాటులో భారతీ ఎయిర్‌టెల్ మార్పులు చేసింది. దానిని అనుసరించి వోడాఫోన్ ఐడియా కూడా తన యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో అందించే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ వాలిడిటీలో మార్పులను తీసుకొనివచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Vi

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో వినియోగదారులు ఎంచుకునే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఇకపై 1-సంవత్సరం చెల్లుబాటుతో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ని పొందలేరు. అయితే దీనికి బదులుగా వారు ఇప్పుడు ఆరు నెలల వాలిడిటీతో సబ్‌స్క్రిప్షన్ ను పొందుతారు. ఈ మార్పు ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని టెల్కో వెబ్‌సైట్ చెబుతోంది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు అందించే ఇతర ప్రయోజనాల యొక్క వాలిడిటీని కంపెనీ మార్చలేదు. Vi యొక్క వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు, ఫ్యామిలీ ప్లాన్‌లు లేదా REDX ప్లాన్‌లు అన్ని కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ యొక్క చెల్లుబాటును ఆరు నెలలకు తగ్గించబడింది.

Realme Narzo 50A Prime స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ లో రూ.1500 వరకు డిస్కౌంట్ ఆఫర్లు...Realme Narzo 50A Prime స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ లో రూ.1500 వరకు డిస్కౌంట్ ఆఫర్లు...

ఎయిర్‌టెల్

వోడాఫోన్ ఐడియా(Vi) మరియు భారతీ ఎయిర్‌టెల్ రెండూ కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అమెజాన్ ప్రైమ్ యొక్క చెల్లుబాటు ప్రయోజనాన్ని తగ్గించి ఉండవచ్చు. విచిత్రమేమిటంటే వోడాఫోన్ ఐడియా(Vi) యూజర్లు అత్యంత ప్రీమియం ఆఫర్‌గా భావిస్తున్న REDX ప్లాన్ కూడా అమెజాన్ ప్రైమ్‌ను కేవలం ఆరు నెలల చెల్లుబాటుకే అందిస్తోంది.

రిలయన్స్ జియో అమెజాన్ ప్రైమ్‌ వాలిడిటీ ఆఫర్
 

రిలయన్స్ జియో అమెజాన్ ప్రైమ్‌ వాలిడిటీ ఆఫర్

ఇండియాలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను తన ప్లాన్‌లతో ఒక సంవత్సరం వాలిడిటీతో అందిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా తీసుకున్న కొత్త నిర్ణయాల తరువాత జియో కూడా త్వరలో మార్పు చేసే అవకాశం ఉంది. అన్ని కంపెనీలు ఇప్పటికీ తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో బహుళ ఓవర్-ది-టాప్ (OTT) సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తున్నాయి. వాటిని వివరాలను తనిఖీ చేయడానికి సంబంధిత వెబ్‌సైట్‌లను సందర్శించండి.

Xiaomi స్మార్ట్‌టీవీ 5A & OLED విజన్ టీవీలు లాంచ్ అయ్యాయి!! అందుబాటు ధరలో అద్భుతమైన ఫీచర్లు...Xiaomi స్మార్ట్‌టీవీ 5A & OLED విజన్ టీవీలు లాంచ్ అయ్యాయి!! అందుబాటు ధరలో అద్భుతమైన ఫీచర్లు...

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ టారిఫ్‌ల పెంపు

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ టారిఫ్‌ల పెంపు

అమెజాన్ సంస్థ తన యొక్క ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ టారిఫ్‌ ధరను రెండు నెలల క్రితమే పెంచింది. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్‌ సబ్‌స్క్రిప్షన్ ను ఒక సంవత్సరం చెల్లుబాటుతో పొందాలనుకునే వారు రూ.999 ధరకు బదులుగా రూ.1,499 చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ను పొందిన వినియోగదారులు ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ వీడియో వంటి మరిన్ని అనేక యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Telco Reduces Amazon Prime Free Subscription Validity With It's Postpaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X