Just In
- 22 min ago
Dell నుంచి కొత్త Laptop లాంచ్ అయింది ! ధర & స్పెసిఫికేషన్లు చూడండి.
- 1 hr ago
Moto Tab G62 టాబ్లెట్ విడుదలైంది!! ధరల మీద ఓ లుక్ వేయండి...
- 2 hrs ago
Vivo V25 Pro 5G కలర్ మారే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
- 3 hrs ago
Airtel ముందస్తు స్పెక్ట్రమ్ చెల్లింపుగా DoTకి ఎంత చెల్లించిందో తెలుసా?
Don't Miss
- Automobiles
త్వరలో విడుదలకానున్న 'హోండా యాక్టివా 6జి ప్రీమియం ఎడిషన్': ఫోటోలు
- Lifestyle
Health Benefits of Ragi : ఈ ఒక్క పదార్ధం కలిగిన ఆహారాలు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి!
- Sports
SA vs Eng 1st Test Playing 11 : బాజ్‌బాల్ అంతుచూడ్డానికి ప్రోటీస్ సై..! ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా తుది టీంలు!
- News
ఉచితాలపై సుప్రీం కీలక ప్రశ్నలు-రాజకీయ పార్టీల్ని ఆపలేం- ఏది సంక్షేమమో తేల్చాల్సిందే..
- Travel
నైనిటాల్ పర్యటనలో ఈ ప్రదేశాలు అస్సలు మిస్సవ్వొద్దు
- Movies
Guppedantha Manasu రిషి పెళ్లి ఆగిపోతే స్వీట్లు పంచుకొంటారా? జగతికి దేవయాని షాక్
- Finance
Gold: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గోల్డ్ ట్రేడర్.. ఎలా కుప్పకూలింది..? ఆ మోసంతో..
వోడాఫోన్ ఐడియా(Vi) యొక్క అత్యంత ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్లు!!వాటి వివరాలు
భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా(Vi) ప్రస్తుతం టెలికాం పరిశ్రమలోని చందాదారుల విషయంలో మెరుగ్గా లేకపోయినప్పటికీ కూడా అది తన యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. వోడాఫోన్ మరియు ఐడియా సంస్థలు రెండు కలిసి మంచి మంచి ఆఫర్లను అందిస్తూ యూజర్ బేస్ ని పెంచుకుంటూ నష్టాల నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. టెల్కో యొక్క నెట్వర్క్ దేశం మొత్తం మీద ఒకే విధంగా లేనప్పటికీ టెల్కో అందించే అన్ని ప్లాన్లు వినియోగదారులకు అద్భుతమైన అదనపు ప్రయోజనాలతో లోడ్ చేయబడి వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వోడాఫోన్ ఐడియా ఈ విబాగంలో అందించే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆకర్షణీయమైన ప్రయోజనాలతో లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్లు
వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం సంస్థ మరింత మంది యూజర్లను ఆకట్టుకోవడానికి రూ.299 మరియు అంతకంటే ఎక్కువ ధరతో లభించే ప్రీపెయిడ్ ప్యాక్‌లతో వినియోగదారులకు హీరో అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది. మారుమూల ప్రాంతాలలో నెట్వర్క్ ఉండకపోవచ్చు కానీ పెద్ద మరియు పట్టణాలలో నెట్వర్క్ బాగానే ఉంటుంది. మరి ముఖ్యంగా అధిక మంది జనాభా నివసించే స్మార్ట్ నగరాలలో అన్ని టెల్కోల యొక్క నెట్వర్క్ లు బాగానే ఉంటాయి. Vi యొక్క నెట్వర్క్ బాగా ఉన్న ప్రాంతాలలో మీరు నివసిస్తుంటే కనుక మిగిలిన టెల్కోల కంటే మెరుగైన ప్రయోజనాలతో కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తున్నాయి. ఇక్కడ మేము డేటా యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్‌ల గురించి మాట్లాడటం లేదని గమనించండి.

మీరు Viని ప్రైమరీ కనెక్షన్‌గా ఉపయోగించాలని చూస్తున్నట్లయితే కనుక రూ.299 ధర వద్ద లభించే మరియు దాని కంటే అధిక ధర వద్ద లభించే అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను పొందడం అనేది చాలా మంచి ఎంపిక. దురదృష్టం ఏమిటంటే Vi ఇంతకు ముందు తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్లతో అందించే డబుల్ డేటా బండిల్ ఆఫర్ ని ప్రస్తుతం అందించదు. ఈ ఆఫర్ ఇప్పటికి అందిస్తుంటే కనుక ఈ టెల్కో అందించే ఆఫర్లు మరొకటి అందించేది కాదు. రోజువారీ FUP (న్యాయమైన-వినియోగం-విధానం) పరిమితి ఆధారంగా Vi యొక్క ప్లాన్ లతో మీరు గరిష్టంగా 3GB వరకు డేటాను పొందుతారు. టెల్కో అందించే లంప్సమ్ డేటా ప్లాన్లు కూడా ఉన్నాయి.

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కోని ప్రైమరీ కనెక్షన్‌గా ఉపయోగిస్తూ తక్కువ చెల్లుబాటు కాలానికి ఎంచుకునే వారు రూ.299, రూ.359, రూ. 399, రూ.499, రూ.475, రూ.319 మరియు రూ.409 ధరల వద్ద లభించే ప్లాన్లను ఎంచుకోవడం ఉత్తమం. ఇవన్నీ కూడా హీరో అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తాయి. హీరో అన్లిమిటెడ్ ప్రయోజనాల విషయానికి వస్తే అవి వీకెండ్ డేటా రోల్ఓవర్, బింగే ఆల్ నైట్ మరియు డేటా డిలైట్స్‌తో కూడిన వివిధ అదనపు ప్రయోజనాల బండిల్ లను కలిగి ఉంటాయి. మీరు అధిక ప్రయోజనాలతో కూడిన స్వల్పకాలిక చెల్లుబాటు ప్లాన్ కోసం వెళ్లాలని చూస్తున్నట్లయితే కనుక ఈ ప్లాన్లు విలువైనవి. వీటిలో కొన్ని డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ మరియు బోనస్ డేటాతో కూడా వస్తాయి.

అదేవిధంగా వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు మధ్యకాలిక నుండి దీర్ఘకాలిక ప్లాన్ లను కూడా అందిస్తున్నాయి. 2GB రోజువారీ డేటా ప్రయోజనాలతో 56 రోజుల చెల్లుబాటు కాలంతో రూ.539 ధర వద్ద ఒక గణనీయమైన ప్లానా లభిస్తుంది. ఇది అధిక మొత్తంలో డేటాను వినియోగించాలనుకునే మరియు ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే వినియోగదారులకు అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. దాదాపు రూ.500 కంటే ఎక్కువ ఖర్చు చేస్తూ మిగిలిన టెల్కోల కంటే మెరుగైన డేటాను Vi అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) వినియోగదారులు 84 రోజులు మరియు 365 రోజుల మధ్య వాలిడిటీతో లభించే ప్లాన్లను కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లన్నీ Vi Movies & TV యాక్సెస్‌తో కూడా వస్తాయి. ఇది వొడాఫోన్ ఐడియా యొక్క అంతర్గత OTT (ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫారమ్. మరిన్ని ప్లాన్లను తనిఖీ చేయడానికి మీరు టెల్కో వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ని సందర్శించవచ్చు.

Vi సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.599 ధర వద్ద అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను 70 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. అదే ప్లాన్‌ను 70 రోజులు, 77 రోజులు మరియు 84 రోజులకు అందిస్తున్నందున కంపెనీ వ్యూహం కొంచెం అస్పష్టంగా ఉంది. అయితే మీరు ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడకపోతే కనుక మరియు సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌పై ఆసక్తి ఉంటే కనుక Vi రూ.2899 ధర వద్ద అందించే సూపర్-లాంగ్-టర్మ్ ప్లాన్‌కు వెళ్లవచ్చు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజుల చెల్లుబాటు కాలానికి 1.5GB రోజువారీ డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో WFH యూజర్ల కోసం అందిస్తున్న చివరి ప్లాన్ రూ.839 ధరతో లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఇది వినియోగదారులకు రోజువారీ 2GB డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాల్లు మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే కంపెనీ అందించే బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్ మరియు డేటా డిలైట్ ఆఫర్లను ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా రోజువారీ డేటా కోటా వినియోగం తర్వాత, డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086