Vodafone Idea(Vi) యూజర్లకు బ్యాడ్ న్యూస్!! పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలు పెరిగాయి...
వొడాఫోన్ ఐడియా కస్టమర్ల కోసం సరసమైన ధరల వద్ద ప్రత్యేకమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నది. వోడాఫోన్ ఐడియా వ్యక్తిగత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఐదు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. అయితే ఫ్యామిలీ వినియోగదారుల కోసం కూడా టెల్కో నాలుగు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే Vi టెల్కో ఇప్పుడు తన యొక్క రూ.598 మరియు రూ.749 ధరల వద్ద లభించే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలను రూ.50 పెంచింది. వోడాఫోన్ ఐడియా సవరించిన మరియు ధరలను పెంచిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వొడాఫోన్ ఐడియా RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరల వివరాలు
వొడాఫోన్ ఐడియా యొక్క RED ఫ్యామిలీ ప్లాన్‌లు ఇంతకుముందు రూ.599 ధర వద్ద నుండి ప్రారంభమయ్యాయి. అయితే ధరల సవరణ తరువాత ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు 649 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. వోడాఫోన్ ఐడియా అందిస్తున్న అన్ని సర్కిల్‌లలో RED ఫ్యామిలీ ప్లాన్‌ల యొక్క ధరల పెరుగుదల ఇప్పటికే ప్రభావవంతంగా ఉంది.

వొడాఫోన్ ఐడియా రూ.649 RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వివరాలు
వొడాఫోన్ ఐడియా ఇంతకు ముందు రూ.598 ధర వద్ద అందించే RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ధర పెరిగిన తరువాత ఇప్పుడు రూ.649 ధర వద్ద లభిస్తున్నది. ఈ ఫ్యామిలీ వినియోగదారులకు 80GBడేటా బెనిఫిట్ ను అందిస్తుంది. దీనితో పాటుగా భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ఒక నెలకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ 80GB డేటా ప్రయోజనం రెండు కనెక్షన్ల మధ్య విభజించబడుతుంది. మొదటి కనెక్షన్‌కు 50GB డేటా ప్రయోజనం లభించగా రెండవ కనెక్షన్‌కు 30GB డేటా ప్రయోజనం లభిస్తుంది. రూ.649 ఫ్యామిలీ ప్లాన్ రెండు కనెక్షన్లతో వస్తుంది.

వొడాఫోన్ ఐడియా(VI) రూ.799 RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వివరాలు
వొడాఫోన్ ఐడియా ఇంతకు ముందు రూ.749 ధర వద్ద అందించే RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మీద రూ.50 ధర పెరిగిన తరువాత ఇప్పుడు రూ.799 ధర వద్ద లభిస్తున్నది. ఈ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మూడు కనెక్షన్లతో 120GB డేటా బెనిఫిట్ తో వస్తుంది. అలాగే దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు ఒక నెల వాలిడిటీలో 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. మూడు కనెక్షన్‌లతో లభించే ఈ రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క డేటా ప్రయోజనాలలో మొదటి కనెక్షన్‌కు 60GB డేటా మరియు సెకండరీ కనెక్షన్‌లకు 30GB డేటాగా విభజించబడింది.

VI RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల అదనపు OTT ప్రయోజనాలు
వొడాఫోన్ ఐడియా సంస్థ తన యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మొదటి కనెక్షన్ల కోసం అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందిస్తుంది. వీటితో పాటుగా మొదటి మరియు రెండవ కనెక్షన్ల కోసం Vi మూవీస్ & టివి సబ్స్క్రిప్షన్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రూ.1,099 ధర వద్ద గల REDX ఫ్యామిలీ ప్లాన్ Vi యొక్క వెబ్‌సైట్‌లో ఇప్పుడు జాబితా చేయబడింది. అయితే కంపెనీ ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. Vi ఇప్పటికే వ్యక్తిగత వినియోగదారుల కోసం 1,099 రూపాయల ధర వద్ద REDX ప్లాన్‌ను అందిస్తోంది.


Click it and Unblock the Notifications