SMS ప్రయోజనాలు లేని వొడాఫోన్ ఐడియా(Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు
ఇండియాలోని టెలికాం రంగంలోని మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా (Vi) తన యొక్క వినియోగదారులకు అన్ని రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో ఏదైనా సమాచారాన్ని SMS రూపంలో పంపుతూ ఉంటారు. వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్ లలో మెసేజ్ లను పంపడం కంటే ముందు అందరు SMS విధానాలను అనుసరించేవారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు వినియోగదారులకు ఉచిత SMS సేవలను అందిస్తున్నాయి. ఈ ప్లాన్ల సాయంతో ముఖ్యంగా తమ యొక్క బిజినెస్ యొక్క సమాచారాన్ని ప్రమోట్ చేసే యూజర్లు SMS ల ద్వారా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అయితే Vi టెల్కో ఎటువంటి SMS ప్రయోజనాలను అందించకుండా కొన్ని ప్లాన్లను అందిస్తున్నది. మీరు ఉపయోగిస్తున్న SIM లలోని మొదటి కనెక్షన్ వోడాఫోన్ ఐడియా అయితే కనుక UPI లేదా బ్యాంక్ ధృవీకరణ వంటి ముఖ్యమైన SMSలను పంపే విషయంలో మీకు ఈ ప్లాన్‌లు ఉత్తమమైనవి కావు. ఎలాంటి SMS ప్రయోజనాలను అందించని Vi ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

SMS ప్రయోజనాలు లేని Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు
వొడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో SMS ప్రయోజనాలను అందించదు. ఈ ప్లాన్‌లు వరుసగా రూ.109, రూ.129 మరియు రూ.149 ధరల వద్ద లభిస్తాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ ధరలో లభిస్తుండడంతో మీకు SMS ప్రయోజనాలు కావాలంటే కనుక ఇవి ఉపయోగకరంగా ఉండవు. ఇందులో రూ.109 ధర వద్ద లభించే మొదటి ప్లాన్ ప్రీపెయిడ్ కేటగిరీలో Vi నుండి లభించే అత్యంత సరసమైన ఎంపిక. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 200MB డేటాను పొందుతారు. FUP డేటా వినియోగం తర్వాత వినియోగదారులు 1MBకి 50 పైసలు చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్లాన్ ఎటువంటి SMS ప్రయోజనాలను అందించనప్పటికీ వినియోగదారులు ఇప్పటికీ స్టాండర్డ్ SMS టారిఫ్‌ల వద్ద 1900కి పోర్ట్ అవుట్ మెసేజ్లను పంపవచ్చు. ఈ ప్లాన్ 15 రోజుల వాలిడిటీతో లభిస్తుంది.

జాబితాలోని రెండవ ప్లాన్ రూ.129 ధరతో లభిస్తుంది. వినియోగదారులు రూ.109 ప్లాన్ మాదిరిగానే 200MB డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు కానీ ఇది 18 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. FUP డేటా వినియోగించిన తర్వాత వినియోగదారులు ఒక్కో MBకి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. జాబితాలోని రూ.149 ప్లాన్‌తో వినియోగదారులు 21 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటుగా 1GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో కూడా SMS ప్రయోజనాలు లేవు. FUP డేటా వినియోగం తర్వాత వినియోగదారులు MBకి 50 పైసలు వసూలు చేస్తారు.

వొడాఫోన్ ఐడియా(Vi) వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటుగా SMS ప్రయోజనాలను పొందే బేస్ ప్లాన్ రూ.155 ధర వద్ద లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో Vi వినియోగదారులు పరిమిత 300 SMSలను మాత్రమే పొందగలుగుతారు. ఒకవేళ మీ Vi సిమ్ మీ ప్రాథమిక కనెక్షన్ అయితే కనుక మీరు మీ నంబర్ ద్వారా SMSలు పంపాలనుకుంటే కనీసం రూ.155 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడం మంచి ఎంపిక.

ఇండియాలోని టెలికాం రంగంలో గల ప్రైవేట్ టెల్కోలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) తన యొక్క యూజర్ బేస్ ను మరింత పెంచుకోవడం కోసం అనేక కొత్త ప్లాన్లను విడుదల చేయడంతో పాటుగా మరిన్ని ప్రయత్నాలను కూడా చేస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ నేడు భారతదేశంలో Vi గేమ్స్ గా పిలువబడే కొత్త గేమింగ్ సర్వీసును ప్రారంభించింది. Vi గేమ్స్ ను భారతదేశానికి చెందిన గేమింగ్ కంపెనీ అయిన నజారా టెక్నాలజీస్(Nazara Technologies) భాగస్వామ్యంతో ప్రారంభించబడింది. కొత్తగా ప్రారంభించబడిన వోడాఫోన్ ఐడియా యొక్క గేమింగ్ సర్వీస్ 1,200 కంటే ఎక్కువ మొబైల్ గేమ్‌లతో వినియోగదారులకు Vi యాప్‌లో యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.


Click it and Unblock the Notifications








