Home
News

Vi యూజర్లకు మరొక బంపర్ ఆఫర్!! రూ.60 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం

ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) తన యొక్క ప్రీపెయిడ్ చందాదారులను నిలుపుకోవటానికి మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇప్పటికే డబుల్ డేటా, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు నైట్ అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌లను విడుదల చేసింది. అయితే Vi ఇప్పుడు రూ.199 కంటే ఎక్కువ ధర గల అన్ లిమిటెడ్ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

Vi క్యాష్‌బ్యాక్

Vi అందించే క్యాష్‌బ్యాక్ మొత్తం అపరిమిత ప్యాక్ ధరతో మారుతు ఉంటుంది. రూ.400 కంటే తక్కువ ధర గల ప్రీపెయిడ్ రీఛార్జీలు కేవలం రూ.20 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుండగా రూ.400 నుంచి రూ.2,595 మధ్య గల Vi యొక్క ప్రీపెయిడ్ రీఛార్జీల మీద రూ.60 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. Vi అందించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వోడాఫోన్ ఐడియా అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్‌పై క్యాష్‌బ్యాక్ పొందే విధానం

వోడాఫోన్ ఐడియా అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్‌పై క్యాష్‌బ్యాక్ పొందే విధానం

వోడాఫోన్ ఐడియా(Vi) అందించే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌కు అర్హత పొందడానికి ప్రీపెయిడ్ చందాదారులు మార్చి 31 లోగా అపరిమిత ప్యాక్ తో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. టెల్కో ఈ ఆఫర్‌ను 'మార్చి ఫ్లాష్ సేల్' అని కూడా పిలుస్తోంది. మీరు అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ లలో రూ.199 మరియు రూ.405 ధరల మధ్య గల కాంబో ప్లాన్ (రూ.199, రూ.219, రూ.249, రూ.299, రూ.301, రూ.398, రూ.401, రూ.405) లతో రీఛార్జ్ చేస్తే వారికి రూ.20 క్యాష్‌బ్యాక్ కూపన్‌ను పొందవచ్చు. అలాగే రీఛార్జ్ ప్లాన్ లలో రూ.399 మరియు రూ.558 ల మధ్య గల రూ.399, రూ.449, రూ.499, రూ.555, రూ.558, రూ.595 మరియు రూ.601 ఎంచుకున్న వారికి Vi టెల్కో రూ.40 క్యాష్‌బ్యాక్ కూపన్‌ను అందిస్తుంది. చివరగా రీఛార్జ్ ప్లాన్ రూ.2,595 వరకు పెరిగితే అప్పుడు యూజర్లకు రూ.60 విలువైన క్యాష్‌బ్యాక్ ను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా(Vi)

మరోక మాటలో చెప్పాలంటే వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో 28 రోజుల వాలిడిటీ ప్లాన్‌లతో రూ.20 క్యాష్‌బ్యాక్ ను, 56 రోజుల వాలిడిటీ ప్లాన్‌లతో రూ.40 క్యాష్‌బ్యాక్ ను మరియు 84 రోజుల వాలిడిటీ మరియు ఆ పైన గల ప్లాన్‌లు రూ.60 క్యాష్‌బ్యాక్‌తో వస్తాయి. ప్రస్తుత సమయంలో Vi రీఛార్జ్ విజయవంతం చేసిన వారికి లభించే క్యాష్‌బ్యాక్ కూపన్ ఏప్రిల్ 10, 2021 లోపు జమ అవుతుందని Vi అధికారిక నిబంధనలు మరియు షరతుల పేజీ పేర్కొంది. రూ.20 క్యాష్‌బ్యాక్ కూపన్ క్రెడిట్ తేదీ నుండి 30 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. అలాగే రూ.40 మరియు రూ.60 కూపన్లు వరుసగా 60 మరియు 90 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి .

క్యాష్‌బ్యాక్ కూపన్ రీడీమ్ ‌

క్యాష్‌బ్యాక్ కూపన్‌లను Vi యాప్ ద్వారా రీడీమ్ చేయవచ్చు. చివరగా రూ.20 క్యాష్‌బ్యాక్ కూపన్‌లను ప్రారంభ రూ.249 ధర గల రీఛార్జిల కోసం ఉపయోగించవచ్చు. రూ.40 క్యాష్‌బ్యాక్ కూపన్ వాడకం విషయంలో రీఛార్జ్ విలువ కనీసం రూ.399 ఉండాలి. చివరిగా రూ.60 కూపన్ వాడకం విషయంలో రూ.599 కనీస రీఛార్జ్ అవసరం ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Unlimited Prepaid Recharge Plans Provide Cashback Coupons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X