అక్టోబర్ నెలలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేసే యూజర్లకు ఉపయోగకరమైన Vi 4G డేటా వోచర్‌లు

|

భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా(Vi) కరోనా మొదలైనప్పటి నుంచి ఇంటి వద్ద నుండి పనిచేసే తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక రకాల ప్రీపెయిడ్ 4G డేటా వోచర్లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ 4G వోచర్‌లు రోజుకి చిన్న మొత్తంలో డేటా బూస్ట్ ను కోరుకునే ఇద్దరికీ సరిపోతాయి ఇందుకు కారణం వారు తమ ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను వినియోగించిన కూడా పూర్తిగా అయిపోదు. ఇంటి నుండి పని చేయాలనుకునే వ్యక్తులకు కూడా ఈ అధిక డేటా ప్రయోజనం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. Vi టెల్కో ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు మొత్తంగా 6 4G డేటా వోచర్‌లను కొనుగోలు చేయడానికి అందుబాటులోకి ఉంచింది. రూ.16, రూ.48, రూ.98, రూ.251, రూ.351 మరియు రూ.601 ధరల వద్ద లభించే ఈ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా 4G డేటా వోచర్‌లు

వోడాఫోన్ ఐడియా 4G డేటా వోచర్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) నుండి వినియోగదారులు కొనుగోలు చేయడానికి మొత్తంగా 6 4G డేటా వోచర్‌లు ఉన్నాయి. రూ.16 ధర వద్ద లభించే బేస్ వోచర్ 1GB డేటాతో వస్తుంది. ఇది 24 గంటల్లో లేదా 1 రోజులో గడువు వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. రూ.48 ధర వద్ద కొనుగోలు చేయడానికి మరొక వోచర్‌ అందుబాటులో ఉంది. దీనిని కొనుగోలు చేసిన వారు 28 రోజుల వాలిడిటీ కాలానికి 3GB డేటాను పొందుతారు. టెల్కో నుండి 28 రోజుల అపరిమిత ప్లాన్‌లో ప్రజలకు ఇది మంచి వోచర్. అలాగే రూ.98 ధర వద్ద లభించే వోచర్‌తో వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటు కాలానికి 12GB డేటాను పొందుతారు. ఇంతకుముందు టెల్కో అదే మొత్తానికి 6GB డేటాను మాత్రమే అందిస్తుండటం గమనార్హం. కానీ ఇప్పుడు 12GB తో రావడం అనేది చాలా గొప్ప విషయం.

నోకియా XR20 స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానున్నది!! అక్టోబర్ 20 నుంచి ప్రీ-బుకింగ్నోకియా XR20 స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానున్నది!! అక్టోబర్ 20 నుంచి ప్రీ-బుకింగ్

వర్క్ ఫ్రమ్ హోమ్

'వర్క్ ఫ్రమ్ హోమ్' విభాగంలో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రెండు డేటా వోచర్‌లను టెల్కో అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇందులో మొదటిది రూ.251 4G ప్లాన్. ఇది 50GB డేటా ప్రయోజనంతో 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మీరు మరింత అధిక డేటా మరియు ఎక్కువ వాలిడిటీ కోసం చూస్తున్నట్లయితే మీరు రూ.100 ఎక్కువ చెల్లించి రూ.351 వోచర్‌కి వెళ్లవచ్చు.

Vi

రూ.351 వోచర్‌తో వినియోగదారులు 100GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. వోడాఫోన్ ఐడియా నుండి లభించే అత్యంత ఖరీదైన 4G డేటా వోచర్ రూ.601 ధర వద్ద వస్తుంది. ఈ వోచర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంతో వస్తుంది. వినియోగదారులు 56 రోజుల చెల్లుబాటు కాలానికి 75GB డేటాతో పాటుగా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తుంది.

అపరిమిత ప్లాన్‌

మీరు ప్రస్తుత మీ యొక్క అపరిమిత ప్లాన్‌లో డేటాను పెంచాలనుకుంటే కనుక వోడాఫోన్ ఐడియా నుండి మీరు కొనుగోలు చేయగల 4G డేటా వోచర్‌లు ఇవన్నీ. వొడాఫోన్ ఐడియా రూ.200 లోపు మరియు వివిధ చెల్లుబాటుతో మరిన్ని డేటా వోచర్‌లను అందిస్తే బాగుండేది. ఖచ్చితంగా 2GB డేటా వోచర్‌కి కూడా ప్రత్యేక స్థానం ఉంది. టెల్కో యొక్క 1GB డేటా వోచర్ రూ.16 వద్ద చాలా ఖరీదైనది. కాబట్టి వోడాఫోన్ ఐడియా (Vi) నుండి రూ .24 లేదా 25 కి 2GB డేటా వోచర్ చాలా మెరుగైన డీల్ అవుతుంది.

వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఉత్తమమైనది రూ.1,197 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 180 రోజులు అంటే 6 నెలల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్ మరియు Vi మూవీస్ & టీవీ యొక్క OTT ప్రయోజనంతో వస్తుంది. అయితే రెండవ ఉత్తమమైన ప్లాన్ రూ.1,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 365 రోజులు (1-సంవత్సరం) చెల్లుబాటుతో వస్తుంది. ఇది Vi మూవీస్ & టీవీకి ఉచిత చందాతో పాటు 24GB డేటాను మాత్రమే అందిస్తుంది. వోడాఫోన్ నుండి లభించే ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2,399 ధర వద్ద లభిస్తుంది. ఇది రీఛార్జ్ చేసిన తేదీ నుండి 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దానితో పాటు మీరు ప్రతిరోజూ 1.5GB డేటా ప్రయోజనంను కూడా పొందుతారు. ఇది అర్ధరాత్రి రీసెట్ అవుతుంది. ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది మీకు 499 రూపాయల విలువ గల వోడాఫోన్ ప్లే మరియు 999 రూపాయల విలువైన ZEE5 చందాను ఉచితంగా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Useful 4G Data Vouchers For Who Work From Home in October 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X