Vi టెల్కో జియో కంటే నిజంగా మెరుగ్గా ఉందా?? ఓ లుక్ వేయండి
వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో తన యొక్క అభివృద్ధి కోసం ఇప్పుడు ఇతర ఆపరేటర్ల కంటే మెరుగైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది అని అనడంలో ఎటువంటి సంకోచం లేదు. Vi అందించే అదనపు ఆఫర్‌లలో 'బింగ్ ఆల్ నైట్' మరియు 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' అందించే ప్రయోజనాలు రిలయన్స్ జియో కంటే Vi యొక్క ప్రీపెయిడ్ సమర్పణలు మెరుగ్గా ఉన్నాయి అని సూచిస్తున్నాయి. రూ.555 ధర విభాగంలో లభించే రెండు కంపెనీల ప్రీపెయిడ్ ప్లాన్‌లు దాదాపు ఒకేరకమైన ప్రయోజనాలతో అందిస్తున్నాయి. అయితే రెండు ప్లాన్‌ల మధ్య వ్యత్యాసాన్ని కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో మీకు ఏ ప్రీపెయిడ్ ప్లాన్ అధిక ప్రయోజనాలను అందిస్తుందో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా రూ 555 ప్రీపెయిడ్ ప్లాన్
వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో రూ.555 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 77 రోజుల చెల్లుబాటు కాలంతో 1.5GB రోజువారి డేటాతో వస్తుంది. వీటితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS / day ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ అదనంగా Vi మూవీస్ & టీవీ వంటి ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు కూడా అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌తో ‘బింగే ఆల్ నైట్' మరియు ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్‌లను కూడా పొందుతారు.

రిలయన్స్ జియో రూ 555 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో టెల్కో రూ.555 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజువారీ 1.5GB డేటాను అందిస్తుంది. అయితే జియో దీన్ని 84 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వంటివి ఉన్నాయి. ఇది JioTV, JioCinema, JioSecurity, JioNews మరియు JioCloud వంటి ఇతర ప్రయోజనాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

రిలయన్స్ జియో vs వొడాఫోన్ ఐడియా (Vi)
రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా (Vi) యొక్క ఈ ప్లాన్ల మధ్య చాలా చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. కానీ ఈ తేడాల కారణంగా వినియోగదారులు ఎందుకు వాటిని కొనాలి అనేదానికి కారణమవుతాయి. మీరు ఎక్కువ వాలిడిటీ ప్లాన్ ను కోరుకునే వారైతే రిలయన్స్ జియో ప్లాన్ ను ఎంచుకోవడంలో అర్థం ఉంది. అయితే మీరు ఈ ప్లాన్‌లలో మరింత డేటాను కోరుకుంటే కనుక Vi యొక్క ఆఫర్ మంచి ఎంపిక అవుతుంది. రిలయన్స్ జియో నుండి వచ్చిన ప్లాన్ కంటే vi యొక్క ప్లాన్ ఎలా ఎక్కువ డేటాతో వస్తుందో మీలో అర్థం కానివారికి ‘వీకెండ్ డేటా రోల్ఓవర్' మరియు ‘బింగే ఆల్ నైట్' ఆఫర్‌ను అర్థం చేసుకోవాలి.

vi సంస్థ తన యొక్క వినియోగదారులకు అందించే వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్ విషయానికి వస్తే వారం రోజులలో మిగిలిపోయిన ఫెయిర్-యూజ్-పాలసీ (ఎఫ్‌యుపి) డేటాను వారాంతపు రోజులలో వినియోగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంతేకాకుండా సంస్థ నుండి వచ్చిన ‘బింగే ఆల్ నైట్' ఆఫర్ వినియోగదారుని యొక్క రోజువారి FUP డేటాను ప్రభావితం చేయకుండా ప్రతిరోజూ 12 AM మరియు 6 AM మధ్య అతను / ఆమె కోరుకున్నంత డేటాను ప్రసారం చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి, ప్రాథమికంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. కాబట్టి సంస్థ నుండి వచ్చిన ‘బింగే ఆల్ నైట్' ఆఫర్ ప్రాథమికంగా ఒక నిర్దిష్ట సమయ క్షేత్రం మధ్య ఎటువంటి FUP పరిమితి లేకుండా వినియోగదారులకు అందించే ఉచిత డేటా.

కవరేజ్ పరంగా మరియు ఓపెన్‌సిగ్నల్ ప్రకారం చూసుకుంటే కనుక జియో నెట్‌వర్క్ మెరుగ్గా ఉంది. అలాగే స్పీడ్ పరంగా చూసుకున్నా కూడా ఓక్లా ప్రకారం వోడాఫోన్ ఐడియా యొక్క నెట్‌వర్క్ మిగతా అన్ని ఆపరేటర్ల కంటే మెరుగ్గా ఉంది. మీరు ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకునే ముందు మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఇది. కాబట్టి వొడాఫోన్ ఐడియా (Vi) యొక్క ప్లాన్ జియో కంటే మెరుగ్గా ఉంది.


Click it and Unblock the Notifications








