జరిమానాగా కస్టమర్‌కు రూ.27.5 లక్షలను చెల్లించిన Vi!! ఎందుకో తెలుసా??

|

ఇండియాలో మూడవ అతి పెద్ద ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వోడాఫోన్ ఐడియా(Vi) కంపెనీ కస్టమర్‌కు రూ.27.5 లక్షలు జరిమానా చెల్లించాలని రాజస్థాన్ ఐటీ శాఖ ఇటీవల ఆదేశించింది. ఈ జరిమానా విధించడానికి గల కారణం విషయానికి వస్తే ఒక వ్యక్తి ఎలాంటి ధృవీకరణ లేకుండా మరొక కస్టమర్ యొక్క డూప్లికేట్ సిమ్‌ను క్లెయిమ్ చేశారు. కంపెనీ పొరపాటు కారణంగా సిమ్ కార్డును అందుకున్న కస్టమర్ తన ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంతో సిమ్ కార్డ్ లింక్ చేయబడి ఉన్నందున మొదటి కస్టమర్ అకౌంట్ నుండి 68 లక్షల రూపాయలు విత్‌డ్రా చేయగలిగాడు.

నకిలీ SIM కార్డు

ప్రత్యేకించి Vi ద్వారా జారీ చేయబడిన నకిలీ సెల్‌ఫోన్ సిమ్ కార్డ్ సహాయంతో అతని అకౌంట్ నుండి నిధులు చట్టవిరుద్ధంగా బదిలీ చేయబడ్డాయి. సాధారణంగా నకిలీ SIM కార్డుల జారీకి అనేక ధృవీకరణలు అవసరం అయితే ఈ సందర్భంలో కస్టమర్ యొక్క ID ప్రూఫ్‌ల యొక్క ధృవీకరణ కూడా సరిగా లేకపోవడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నకిలీ సిమ్ కార్డును తప్పుడు కస్టమర్‌లకు జారీచేసిన Vi

నకిలీ సిమ్ కార్డును తప్పుడు కస్టమర్‌లకు జారీచేసిన Vi

కొన్ని నివేదికల ప్రకారం Vi యొక్క నకిలీ సిమ్ కార్డు కేసు భాను ప్రతాప్‌ అనే వ్యక్తికి సంబంధించినది. అతనికి మరొక కస్టమర్‌కు చెందిన డూప్లికేట్ సిమ్ కార్డు ఇవ్వబడింది. దీని యొక్క సాయంతో అతని ఐడిబిఐ బ్యాంక్ అకౌంట్ నుండి రూ.68.5 లక్షలు తన అకౌంటులకు బదిలీ చేసుకున్నాడు.

కృష్ణ లాల్ నైన్

నివేదిక ప్రకారం కృష్ణ లాల్ నైన్ అనే వ్యక్తి యొక్క Vi మొబైల్ నంబర్ మే 2017 లో పనిచేయడం మానేసింది. అతను హనుమాన్‌గఢ్‌లోని Vi స్టోర్‌ను సందర్శించి ఫిర్యాదు చేశాడు. తరువాత అతను కొత్త నంబర్‌ను అందుకున్నాడు. కానీ అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అది నిష్క్రియంగా ఉంది. అతను జైపూర్ స్టోర్‌ను సందర్శించినప్పుడు మరియు సిమ్‌ను యాక్టివేట్ చేయడానికి ఫిర్యాదును సమర్పించినప్పుడు జరిగిన సంఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు యాక్టివేట్ చేయబడే సమయానికి నిందితుడు డూప్లికేట్ సిమ్ పొందాడు మరియు OTP లను ఉపయోగించి అతని అకౌంటులోని మొత్తాన్ని చట్టవిరుద్ధంగా బదిలీ చేశాడు.

కొత్త SIM కార్డ్ యాక్టివేషన్

నివేదిక ప్రకారం బాధితుడు తన సిమ్ కార్డును అందుకున్న ఐదు రోజుల తర్వాత దాన్ని యాక్సెస్ చేయగలిగాడు. అది యాక్టివేట్ అయిన తర్వాత అతని అకౌంట్ నుండి డబ్బు డ్రా అయినట్లు అతనికి మెసేజ్‌లు వచ్చాయి. ఈ సంఘటనపై కస్టమర్ ఫిర్యాదు చేసినప్పుడు మరియు ఐటి చట్టం కింద అతనికి పరిహారం అందించాలని Vi కి సూచించింది. కస్టమర్ డేటా యొక్క సరికాని ధృవీకరణ మరియు కొత్త SIM కార్డ్ యాక్టివేషన్ ఆలస్యం అయినందుకు Vi కి ఇక్కడ జరిమానా విధించబడింది.

పోలీసుల కేసు

పోలీసులు కేసును నమోదు చేసుకోవడమే కాకుండా డబ్బును బదిలీ చేసిన నిందితుడిని అరెస్టు చేశారు. రూ.68 లక్షలలో అతను రూ.44 లక్షలు కస్టమర్‌కు తిరిగి ఇచ్చాడు. అయితే మిగిలిన మొత్తం పెండింగ్‌లో ఉంది మరియు ఐటి చట్టం కింద కస్టమర్ దీని గురించి మరొక ఫిర్యాదు చేశారు.

Best Mobiles in India

English summary
Vodafone Idea (Vi) Will Paid Rs 27.5 Lakh Fine to Customer!! Do You Know Why?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X