Home
News

Vi టెల్కో యొక్క యు బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్ డేటా ప్రయోజనాలు ఇవే..

ఎయిర్టెల్ మరియు జియో సంస్థలు తన యొక్క వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నట్లుగా వొడాఫోన్ ఐడియా(Vi) కూడా 'యు బ్రాడ్‌బ్యాండ్' పేరుతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నది. యు బ్రాడ్‌బ్యాండ్ నుండి వచ్చే ప్లాన్ల యొక్క ప్రయోజనాలు ఇతర ఆపరేటర్లు లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP లు) తమ వినియోగదారులకు అందించే వాటి ప్రయోజనాల కంటే కొద్దిగా వెనుకబడి ఉన్నాయి. Vi యొక్క ఆదాయాన్ని పెంచడానికి బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలు టెల్కోకు సహాయపడతాయి. 'యు బ్రాడ్‌బ్యాండ్' ద్వారా టెల్కో అందించే 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ అందించే ప్రయోజనాలు విషయానికి వస్తే ఇవి మెరుగ్గా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

యు బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్

యు బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్

యు బ్రాడ్బ్యాండ్ తన 100 Mbps ప్లాన్‌ను 30 రోజులు (1 నెల), 90 రోజులు (3 నెలలు), 180 రోజులు (6 నెలలు) మరియు 360 రోజులు (1 సంవత్సరం) చెల్లుబాటుతో నాలుగు వేర్వేరు కాన్ఫిగరేషన్లలో అందిస్తుంది. ఈ ప్లాన్‌ను ఒక నెల పాటు పొందడానికి వినియోగదారులు 1,326 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలానికి 350GB ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) డేటాను పొందవచ్చు. FUP డేటా వినియోగం తరువాత డేటా యొక్క స్పీడ్ 5 Mbps కి పడిపోతుంది.

జియోఫైబర్

జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నుండి లభించే 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పోల్చినప్పుడు వోడాఫోన్ ఐడియా యొక్క బ్రాడ్‌బ్యాండ్ ఆర్మ్ నుండి లభించే ఈ ప్లాన్ చాలా తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఇది చాలా ఖరీదైనది మాత్రమే కాదు తక్కువ మొత్తంలో ప్రయోజనాలను అందిస్తుంది. వాస్తవానికి ఎక్సైటెల్ వంటి ఇతర ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల నుండి 100 Mbps ప్లాన్ ఈ ప్లాన్ కంటే మంచి ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

యు బ్రాడ్‌బ్యాండ్

ఏదేమైనా యు బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్ 90 రోజులు (3 నెలల) కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వినియోగదారులకు రూ.3,962 ధర వద్ద మొత్తం చెల్లుబాటు కాలానికి 1125GB డేటాను అందిస్తుంది. అలాగే 6 నెలల మరియు 12 నెలల చెల్లుబాటు కాలానికి లభించే ప్లాన్లు వరుసగా రూ.7,905 మరియు రూ.15,761 ధర వద్ద లభిస్తాయి. ఇవి వరుసగా 2,400GB మరియు 5,100GB డేటాను అందిస్తాయి.FUP డేటా వినియోగం తరువాత ఈ ప్లాన్ల యొక్క డేటా స్పీడ్ 5 Mbps కి పడిపోతుంది. వోడాఫోన్ ఐడియా యు బ్రాడ్‌బ్యాండ్ యొక్క 100 Mbps ప్లాన్ అపరిమిత డేటాను అందించదు.

FUP డేటా

దాదాపు ప్రతి ఇతర ప్రైవేట్ ISP 100 Mbps ప్లాన్‌లు అపరిమిత డేటా లేదా 1,000GB కంటే ఎక్కువ FUP డేటాతో లభిస్తాయి. కాబట్టి తెలివిగల వినియోగదారుడు యు బ్రాడ్‌బ్యాండ్ యొక్క 100 Mbps పరిమిత డేటా ప్లాన్‌ను పొందడానికి చాలా ఉత్సాహంగా ఉండరు. అలాగే ఈ కంపెనీ తన ప్లాన్ లతో ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను అందించదు. ఇతర సర్వీసు ప్రొవైడర్లు తన యొక్క యూజర్లకు కనీసం కొన్ని OTT ప్రయోజనాలను అందిస్తారు. అయితే యు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఈ ప్లాన్ తో రౌటర్‌ను ఉచితంగా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) You Broadband 100 Mbps Plan Data Benefits Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X