Airtel,Jio,Vodafone అందిస్తున్న రోజువారి 2GB డేటా ప్లాన్‌లు ఇవే!

|

ఇండియాలోని టెలికామ్ సంస్థలలో ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్ ఐడియా వంటివి అధికంగా ప్రజల దృష్టిని ఆకట్టుకున్నాయి. ఈ సంస్థలు తమ వినియోగదారుల కోసం వివిధ రకాల ధరల వద్ద మొబైల్ డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుత సమయంలో అన్ని టెలికామ్ సంస్థలు అందిస్తున్న 2GB రోజువారి డేటా ప్లాన్‌లను ఎక్కువ మంది వాడుతున్నారు.

Vodafone Idea vs Jio vs Airtel డైలీ డేటా ప్లాన్స్

Vodafone Idea vs Jio vs Airtel డైలీ డేటా ప్లాన్స్

ఇండియాలోని ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎవ్వరూ కూడా మునుపటిలాగా బయట స్వేచ్ఛగా ప్రయాణించలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రతిఒక్కరు కూడా కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అవ్వడంతో అన్ని రకాల అవసరాల కోసం ఎక్కువగా ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు మిస్ అవుతున్న కొన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంస్థలు వాటికి ప్రత్యాన్మాయాలను విడుదల చేసారు. వాటిని ఉపయోగించడానికి కూడా డేటా అవసరం ఉంటుంది. వినియోగదారులు తాము వాడుతున్న మొబైల్ సిమ్ ఆపరేటర్ అందిస్తున్న వివిధ రకాల డేటా ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Also Read :Friendsతో కలిసి సినిమాలను చూడడాన్ని మిస్ అవుతున్నారా?? ఇలా చేయండి...Also Read :Friendsతో కలిసి సినిమాలను చూడడాన్ని మిస్ అవుతున్నారా?? ఇలా చేయండి...

ఎయిర్‌టెల్ 2GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు

ఎయిర్‌టెల్ 2GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు

ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారులకు అన్‌లిమిటెడ్ విభాగంలో రోజువారి 2GB డేటాను రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తున్నది.  రూ.298 ధర వద్ద 28 రోజుల వాలిడిటీతో మరియు రూ.698 ధర వద్ద 84 రోజుల వాలిడిటీతో లభిస్తున్న ఈ రెండు ప్లాన్‌లు తమ  వినియోగదారులకు రోజుకు 2GB 3G/4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రెండు ప్లాన్‌లు అందిస్తున్న అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్, ఒక సంవత్సరం షా అకాడమీ ఉచిత కోర్స్ లకు ప్రవేశం వంటి ప్రోత్సాహకాలతో కూడిన ప్రయోజనాలను అందిస్తుంది. దానితో పాటు ఎయిర్‌టెల్ 2GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌తో తన ప్లాన్‌లతో అందిస్తోంది. ఇతర ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, హెలోట్యూన్స్ మరియు ఫాస్టాగ్ లావాదేవీపై రూ.150 క్యాష్-బ్యాక్‌ చందాలు కూడా ఉచితంగా లభిస్తాయి.

జియో  2GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు

జియో  2GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు

అధికంగా వినియోగదారులను కలిగిన జియో సంస్థ కూడా తమ యూజర్లకు రోజువారి 2GB డేటాను వివిధ రకాల ప్లాన్ ల వద్ద అందిస్తుంది. కాకపోతే ఇది ఫోన్ కాల్స్ విషయంలో FUP నిమిషాల పరిమితో వస్తుంది. Jio యొక్క ప్లాన్‌ల ధరల వివరాల విషయానికి వస్తే రూ.249,రూ.444, రూ.599, రూ.2399 మరియు రూ.2599 ధరల వద్ద 28, 56, 84, 365 మరియు 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తాయి. ఈ ప్లాన్‌లు అన్ని కూడా రోజువారి 2GB డేటాతో పాటుగా జియో టూ జియో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఇవి నాన్-జియో కాల్స్ కోసం పరిమిత FUP నిమిషాలను కలిగి ఉంటాయి. ఈ ప్లాన్‌లు అన్ని కూడా జియో యొక్క అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి. రూ.2599 ప్లాన్ అదనంగా డిస్నీ+హాట్స్టార్ కు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా 2GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు

వోడాఫోన్ ఐడియా 2GB డైలీ డేటా ప్లాన్స్ వివరాలు

వొడాఫోన్ ఐడియా సంస్థ కూడా తమ వినియోగదారుల కోసం 2GB డైలీ డేటా ప్లాన్ లను అందిస్తున్నది. కాకపోతే మిగిలిన వారికి బిన్నంగా మరికొంత మందిని ఆకట్టుకోవడానికి ప్రస్తుతం దీని మీద డబుల్ డేటా ప్రయోజనాన్ని అదనంగా అందిస్తున్నది. అంటే వినియోగదారులు ఈ మూడు ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే కనుక వారికి ప్రస్తుతం మొత్తంగా రోజుకు 4GB డేటాను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా 4GB రోజువారి డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా 4GB రోజువారి డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా సంస్థ ప్రస్తుతం మూడు ప్లాన్లతో రోజుకు 4GB డేటాను అందిస్తున్నది. రూ.299, రూ.499 మరియు రూ.699 ధర గల మూడు ప్లాన్‌లు సాధారణంగా రోజువారీ 2GB డేటాను 28 రోజులు, 56 రోజులు మరియు 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు రోజుకు 2GB డేటాను పొందడంతో పాటుగా అదనంగా మరొక 2GB డేటాను కూడా పొందవచ్చు. అంటే మొత్తంగా రోజుకు 4GB డేటాను పొందవచ్చు. పరిమిత-సమయం వరకు మాత్రమే ఈ డబుల్ డేటా ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లు అన్ని అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు  100sms ప్రయోజనాలను అందిస్తాయి . ఈ ప్లాన్‌లు వొడాఫోన్ / ఐడియా వీడియో ప్లాట్‌ఫామ్‌లతో పాటు ZEE5 సబ్స్క్రిప్షన్ కి ఉచిత యాక్సిస్ ను ఇస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Vodafone Idea vs Jio vs Airtel: 2GB Daily Data Plans Details Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X