రూ.6తో రాత్రంతా 4జీ ఇంటర్నెట్...
*444*4#కు డయల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..
వొడాఫోన్ ఇండియా తన ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం సరికొత్త స్కీమ్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. వొడాఫోన్ సూపర్ నైట్ పేరుతో లాంచ్ అయిన ఈ స్కీమ్‌లో భాగంగా రూ.29 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 5 గంటల పాటు అపరిమితంగా 3G/4G డేటాను ఉపయోగించుకోవచ్చు. గంటకు రూ.6 చొప్పున ఛార్జ్ చేస్తారు.

రీఛార్జ్ ఎప్పుడు చేసుకున్నప్పటికి ప్లాన్ మాత్రం రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ఈ సూపర్ నైట్ ప్యాక్ ను యాక్టివేట్ చేసుకోవాలనుకునే వారు *444*4#కు డయల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాక్ లను డిజిటల్ ఛానల్స్ అలానే రిటైల్ టచ్ పాయింట్స్ ద్వారా కొనుగోలు చేసే అవకాశాన్ని వొడాఫోన్ కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications