Home
News

జియో లేదా ఐడియాలో వొడాఫోన్ ఇండియా విలీనం..?

మార్కెట్ పోటీని తట్టకోలేక తీవ్రమైన ఇబ్బందుల్లో వొడాఫోన్ ఇండియా..

By Sivanjaneyulu Bommu

కమర్షియల్ మార్కెట్లో జియో లాంచ్ తరువాత ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్ పోటీని తట్టకోలేక తీవ్రమైన నష్టాలతో వొడాఫోన్ ఇండియా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

Read More : మీ కంప్యూటర్‌లో డూప్లికేట్ ఫైల్స్‌ను ఏరిపారేయటం ఎలా..?

వీలనమయ్యే అవకాశం..

వీలనమయ్యే అవకాశం..

తాజా పరిణామాల నేపథ్యంలో ఐడియా సెల్యులార్‌ లేదా రిలయన్స్ జియోలో ఈ ఆపరేటర్ విలీనమయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాల సమాచారం.

చిన్న కంపెనీలు  విలీనం బాట..

చిన్న కంపెనీలు విలీనం బాట..

చిన్నకంపెనీలైన టెలినార్, ఎయిర్‌సెల్‌లు ఇప్పటికే విలీనం బాట పట్టిన విషయం తెలిసిందే. విలీనం కోసం టెలినార్ ఎదురుచూస్తుండగా, ఎయిర్‌సెల్ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో విలీనం కాబోతోంది.

మార్కెట్ ఇన్‌సైడర్స్ ప్రకారం...

మార్కెట్ ఇన్‌సైడర్స్ ప్రకారం...

మార్కెట్ ఇన్‌సైడర్స్ ప్రకారం వొడాఫోన్ ఇండియా ఐడియా సెల్యులార్ చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ గనుక విజయవంతమైతే భారత్‌లో 20 సంవత్సరాల చరిత్రను కలిగి నేషనల్ టెలికం ఆపరేటర్‌గా పేరుగాంచిన వొడాఫోన్ ఇండియా భవిష్యత్ వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోనుంది.

 రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌

రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌

ప్రస్తుతానికి వొడాఫోన్ ఇండియా భారత దేశపు రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా కొనసాగుతోంది. మొదటి స్ధానంలో ఎయిర్‌టెల్ కొనసాగుతోంది సెప్టంబర్ 30, 2016 నాటికి వొడాఫోన్ ఇండియా 19.12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.

మొదటి ప్లేస్‌లో ఎయిర్‌టెల్

మొదటి ప్లేస్‌లో ఎయిర్‌టెల్

ఇదే సమయంలో ఎయిర్‌టెల్ 24.76 శాతం మార్కెట్ వాటాతో మొదటి ప్లేస్‌లో ఉంది. 17.03 శాతం మార్కెట్ వాటాతో ఐడియా సెల్యులార్ మూడో స్థానంలో నిలిచింది.

వేలకోట్ల అప్పులు

వేలకోట్ల అప్పులు

వొడాఫోన్, భారత్‌లో రూ.47,700 కోట్లను పెట్టుబడులుగా పెట్టినప్పటికి అందులో ఎక్కువ మొత్తాన్ని అప్పులు తీర్చేందుకు వినియోగించినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Vodafone India could merge with Reliance Jio or Idea Cellular: Report. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X