4జీ నెట్‌తో పాటు ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు, 70 రోజుల ఆఫర్

భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఇండియా సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వొడాఫోన్ రూ.445, రూ.353, రూ.145 రేంజ్‌లలో మూడు రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్ చేసినట్లు స్పష్టమవుతోంది.

Read More : WannaCry వైరస్‌ను కంప్యూటర్ నుంచి తొలగించటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.445 ప్లాన్‌ను 4జీ యూజర్లతో పాటు 3జీ యూజర్లు..

వీటిలో రూ.445 ప్లాన్‌ను 4జీ యూజర్లతో పాటు 3జీ యూజర్లు కూడా ఉపయోగించుకునే వీలుంటుంది. మిగిలిన రెండు ప్లాన్‌లు కేవలం 3జీ యూజర్లకు మాత్రమే వర్తిస్తాయని తెలుస్తోంది.

4జీ యూజర్లకు వర్తించే లాభాలు..

వొడాఫోన్ 4జీ కస్టమర్‌లు రూ.445 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా 70 రోజుల పటు రోజుకు 1జీబి 4జీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ పిరియడ్‌లో దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

రూ.445 ప్లాన్‌ను 3జీ యూజర్లు తీసుకుంటే

ఇదే ప్లాన్‌ను 3జీ కస్టమర్‌లు పొందటం ద్వారా కేవలం 2జీబి డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా 35 రోజులు వ్యాలిడిటితోనే. ఈ ప్లాన్ పిరియడ్‌లో దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

రూ.353, రూ.145 ప్లాన్‌ వివరాలు..

రూ.353 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా 28 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్లాన్ పిరియడ్‌లో 2జీబి 3జీ డేటా కూడా లభిస్తుంది. ఇక రూ.145 ప్లాన్‌ను పొందటం ద్వారా 28 రోజుల పాటు వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య కాల్స్ పూర్తిగా ఉచితం. ఈ ప్లాన్ పిరియడ్‌లో 1జీబి 3జీ డేటా కూడా లభిస్తుంది.

జియో ధన్ దనా ధన్ ఆఫర్‌కు పోటీగా..

జియో ధన్ దనా ధన్ ఆఫర్‌కు పోటీగా వొడాఫోన్ ఈ ప్లాన్‌లను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ధన్ దనా ధన్ ఆఫర్ క్రింద జియో అందిస్తోన్న ఆఫర్లను పరిశీలించినట్లయితే జియో యూజర్లు రూ.408 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 84 రోజుల పాటు రోజుకు 1జీబి డేటా లభిస్తుంది. రూ.608 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 84 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్ కూడా అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌లనే..

రిలయన్స్ జియో తరహాలోనే ఎయిర్‌టెల్ కూడా అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ 4జీ యూజర్లు రూ.449 పెట్టి రీచార్జ్ చేసుకోవటం ద్వారా 70 రోజుల పాటు రోజుకు 1జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రూ.293 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా 70 రోజుల పాటు ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ మధ్య అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు 1జీబి డేటా కూడా అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone India Introduces New FR 445 Plan Providing 1GB Data Per Day and Unlimited Voice Calls for 70 Days. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot