రూ.19తో రోజంతా మాట్లాడుకోండి

వొడాఫోన్ ఇండియా సరికొత్త ఆఫర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. కొద్ది నెలల క్రితం 'SuperHour' పేరుతో కొత్త స్కీమ్‌ను తెరపైకి తీసుకువచ్చిన వొడాఫోన్ తాజాగా 'SuperDay', 'SuperWeek' స్కీమ్ లను మార్కెట్లో లాంచ్ చేసింది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.19 సూపర్ డే ప్లాన్‌

వొడాఫోన్ లాంచ్ చేసిన సూపర్ డే ప్లాన్‌లో వొడాఫోన్ 4జీ యూజర్లు రూ.19 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 100ఎంబి డేటాతో పాటు రోజు మొత్తం వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

రూ.49 సూపర్ వీక్ ప్లాన్‌

వొడాఫోన్ లాంచ్ చేసిన సూపర్ వీక్ ప్లాన్‌లో భాగంగా రూ.49 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 250ఎంబి డేటాతో పాటు వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 7 రోజులు.

రూ.89 సూపర్ వీక్ ప్లాన్‌

వొడాఫోన్ లాంచ్ చేసిన మరో సూపర్ వీక్ ప్లాన్‌లో భాగంగా రూ.89 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 250ఎంబి డేటాతో పాటు వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్‌తో పాటు వొడాఫోన్ నుంచి ఇతర నెట్‌వర్క్‌ల మధ్య 100 నిమిషాల లోకల్ + ఎస్టీడీ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 7 రోజులు.

గతంలోనే వొడాఫోన్ ఇండియా సూపర్ అవర్ స్కీమ్ ఆఫర్లు.

రిలయన్స్ జియోకు పోటీగా గతంలోనే వొడాఫోన్ ఇండియా సూపర్ అవర్ స్కీమ్ ఆఫర్లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. సూపర్ అవర్ స్కీమ్ పేరుతో అనౌన్స్ కాబడిన ఈ ప్లాన్స్‌లో భాగంగా రూ.16 చెల్లించి గంట పాటు అపరిమితంగా 3జీ/4జీ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. మరో ప్లాన్‌లో భాగంగా రూ.5 చెల్లించి గంట పాటు అపరిమితంగా 2జీ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone India Unveils SuperDay and SuperWeek Plans Offering Unlimited Calls Starting from Rs.19. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot