వొడాఫోన్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజ్

Posted By: Super

 వొడాఫోన్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజ్

కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజ్‌ను వొడాఫోన్ ఇండియా ఆవిష్కరించింది. కొత్త ప్యాకేజ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు సంబంధించిన వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ చార్జీల్లో 60 శాతం డిస్కౌంట్‌ను వొడాఫోన్ సబ్‌స్క్రైబర్లు అందుకోవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 30 రోజుల కాలపరిమితితో కూడిన 1,499 రూపాయల వన్‌టైమ్ రెంటల్ ఫీజు ప్యాకేజ్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన భాగస్వామి నెట్‌వర్క్‌తో కలిసి 40 దేశాల్లో ఈ డిస్కౌంట్ ప్యాకేజ్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ఆయా దేశాలను బట్టి అంతర్జాతీయ కాల్స్‌కు ప్రస్తుతం వొడాఫోన్ నిమిషానికి 58 రూపాయల నుంచి 230 రూపాయల వరకు వసూలు చేస్తోంది. అంతేకాకుండా కస్టమర్లు ఎలాంటి రెంటల్స్ చెల్లించకుండా అంతర్జాతీయంగా రోమింగ్ సదుపాయాలను వినియోగించుకోవచ్చని కూడా తెలిపింది. ఈ ప్యాకేజ్ సెప్టెంబర్ 2012 వరకు అమల్లో ఉంటుందని వొడాఫోన్ ఇండియా స్పష్టం చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot