వోడాఫోన్ కొత్త Rs.99, Rs.555 ప్రీపెయిడ్ ప్లాన్‌ల ఆఫర్లు ఎలా ఉన్నాయో చూడండి

|

కొత్త కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించే విషయానికి వస్తే రాష్ట్ర నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ బిఎస్‌ఎన్‌ఎల్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఏదేమైనా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు 2019 చివరిలో వచ్చిన డేటా టారిఫ్ పెంపు తరువాత మళ్ళి కొత్త ప్లాన్లను ప్రారంభించలేదు. కానీ ఒక కొత్త ఎత్తుగడలో వోడాఫోన్ తన చందాదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది.

వోడాఫోన్
 

వోడాఫోన్ తన చందాదారుల కోసం ప్రారంభించిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రూ.99 మరియు రూ .555 ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ రెండు ప్లాన్‌లు కొంతకాలం క్రితం రిలయన్స్ జియో ప్రారంభించిన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను పోలి ఉన్నాయి. ఈ ప్లాన్‌ల గురించి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ప్లాన్‌లు వొడాఫోన్ అందించే మునుపటి చెల్లుబాటు కాలానికి సరిపోవు. కానీ వారి ప్రీపెయిడ్ రీఛార్జిల కోసం ఎక్కువ మొత్తంను తక్కువ ఖర్చు చేయకూడదనుకునే చందాదారులకు ఇవి ఖచ్చితంగా సరిపోతాయి.

Honor 9X స్మార్ట్‌ఫోన్ రిలీజ్... సేల్స్ ఆఫర్స్ అదుర్స్....Honor 9X స్మార్ట్‌ఫోన్ రిలీజ్... సేల్స్ ఆఫర్స్ అదుర్స్....

వోడాఫోన్ రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

వోడాఫోన్ రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

వొడాఫోన్ కొత్తగా అందిస్తున్న రూ.99ల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ చందాదారులకు 18 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కస్టమర్లు ఈ మొత్తం చెల్లుబాటు వ్యవధిలో 100 SMSలను మరియు రోజుకు 1GB డేటా ప్రయోజనంను అందిస్తుంది. వీటితో పాటు చందాదారులు అపరిమిత కాలింగ్‌కు కూడా యాక్సిస్ లభిస్తుంది.

విండోస్ 7 వాడుతున్న వారికి కష్టాలు ఇక తప్పవు!!!విండోస్ 7 వాడుతున్న వారికి కష్టాలు ఇక తప్పవు!!!

ప్రయోజనాలు

ప్రయోజనాలు

అదనపు ప్రయోజనాల విషయానికొస్తే చందాదారులకు రూ.999 విలువైన ZEE5 సబ్స్క్రిప్షన్ చందాను మరియు వోడాఫోన్ ప్లే కాంప్లిమెంటరీ చందాకు కూడా ఉచిత యాక్సిస్ లభిస్తుంది. వోడాఫోన్ రూపొందించిన ఈ ప్లాన్ ప్రస్తుతం కోల్‌కతా, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, యుపి ఈస్ట్, యుపి వెస్ట్ మరియు పశ్చిమ బెంగాల్ సర్కిల్‌లలో ప్రత్యక్షంగా ఉంది.

వాట్సాప్ మెసేజ్ లను రహస్యంగా చదవడం ఎలా?వాట్సాప్ మెసేజ్ లను రహస్యంగా చదవడం ఎలా?

వొడాఫోన్ రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
 

వొడాఫోన్ రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

వొడాఫోన్ కొత్తగా ప్రవేశపెట్టిన తదుపరి ప్లాన్ రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌లా కాకుండా ఈ ప్లాన్ రోజువారీ డేటా బెనిఫిట్‌తో పాటు ఇతర ప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం 70 రోజులు. 56 రోజుల వాలిడిటీ మరియు 84 రోజుల చెల్లుబాటు మధ్య గల ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న చందాదారుల కోసం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సరిపోతుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ సంక్రాంతి ఆఫర్స్.... ప్రీపెయిడ్ ప్లాన్‌ల మీద తగ్గింపుబిఎస్‌ఎన్‌ఎల్ సంక్రాంతి ఆఫర్స్.... ప్రీపెయిడ్ ప్లాన్‌ల మీద తగ్గింపు

ప్రయోజనాలు

ప్రయోజనాలు

70 రోజుల చెల్లుబాటుతో రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ చందాదారులకు రోజుకు 1.5 జిబి డేటా మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. దీనితో పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో ZEE5 సబ్స్క్రిప్షన్ మరియు వొడాఫోన్ ప్లే చందా కూడా ఉన్నాయి. వోడాఫోన్ రూపొందించిన ఈ కొత్త ప్లాన్ ప్రస్తుతం ముంబైలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్స్... ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీగా తగ్గింపు ఆఫర్లుఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్స్... ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీగా తగ్గింపు ఆఫర్లు

కొత్త వొడాఫోన్ ప్లాన్‌ల పోలికలు

కొత్త వొడాఫోన్ ప్లాన్‌ల పోలికలు

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిశితంగా పరిశీలిస్తే రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ .149 ప్రీపెయిడ్ ప్లాన్‌కు కొద్దిగా టోన్-డౌన్ వెర్షన్ అని తెలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల మొత్తం చెల్లుబాటు కోసం 2GB డేటాను అందిస్తుంది. దీనికి విరుద్ధంగా రూ.99 ప్లాన్ 18 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1 జిబి డేటాను అందిస్తుంది.

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్

అలాగే రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ ఇతర టెల్కోస్ అందిస్తున్న రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ కు దగ్గర పోలికలు ఉన్నాయి. ఎయిర్‌టెల్ యొక్క రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో 1.5 జీబీ డైలీ డేటా బెనిఫిట్‌తో వస్తుంది. వోడాఫోన్ యొక్క రూ.555 ప్లాన్ చెల్లుబాటులో స్వల్ప తేడాలో 70 రోజులకు తగ్గిస్తుంది. డేటా టారిఫ్ పెంపు తరువాత వోడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ రెండూ అధిక ధరల ఆఫర్‌లపై ఆసక్తిని తగ్గించాయి. అటువంటి సందర్భంలో ఈ కొత్త బడ్జెట్ ఆధారిత ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆర్థికంగా ఎంపిక చేసుకోవడంలో వినియోగదారులకు సహాయపడతాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone Introduced New Rs.99, Rs.555 Prepaid Plans With More Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X