రూ.144కే నెలంతా ఉచిత కాల్స్, ఇంటర్నెట్

హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో జియో తన ఉచిత సేవలను మార్చి 31, 2017 వరకు పొడిగించిన నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు పోటాపోటీగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. వొడాఫోన్ తన 2జీ, 3జీ, 4జీ ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేట్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది.

Read More : 12జీబి ర్యామ్, 10,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో కేక పుట్టిసోన్స కొత్త ఫోన్స్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి ప్లాన్..

మొదటి ప్లాన్ విలువ సర్కిల్‌ను బట్టి రూ.144 - రూ.149 రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వొడాఫోన్ - వొడాఫోన్ మధ్య 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు, ఇన్‌కమింగ్ కాల్స్ పూర్తిగా ఉచితం. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయస్ కాల్స్‌తో పాటు 300 ఎంబి 4జీ డేటాను కూడా వొడాఫోన్ అందిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండవ ప్లాన్...

2016లో ఊరించి ఉసూరుమనిపించిన 5 స్మార్ట్‌ఫోన్‌లు

వొడాఫోన్ లాంచ్ చేసిన రెండవ ప్లాన్ విలువ సర్కిల్‌ను బట్టి రూ.344 - రూ.349 రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ల్యాండ్‌లైన్ కాల్స్ కూడా పూర్తిగా ఉచితం. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 1జీబి 4జీ డేటాను కూడా వొడాఫోన్ యూజర్లు పొందవచ్చు.

సూపర్‌నెట్ 4జీ..

వొడాఫోన్ తన సూపర్‌నెట్ 4జీ సేవలను కొన్న నెలల క్రితం భారత్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆధునిక సాంకేతిక హంగులతో వచ్చిన తమ కొత్త నెట్‌వర్క్ కాల్ డ్రాప్‌లను తగ్గించటంతో పాటు క్లారిటీతో కూడిన వాయిస్ కాల్స్ ఇంకా నాణ్యమైన డేటా స్పీడ్స్‌ను యూజర్‌కు చేరువచేస్తుందని వొడాఫోన్ చెబుతోంది.

 

 

అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌..

ఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్, 5 లాభాలు

ప్రపంచలోనే అతిపెద్ద 4జీ నెట్‌వర్క్‌గా వొడాఫోన్ గుర్తింపు తెచ్చుకుంది. 20కు పైగా దేశాల్లో వొడాఫోన్ 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో తన 4జీ సేవలను 1800 MHz బ్యాండ్ విడ్త్‌లో వొడాఫోన్ ఆఫర్ చేస్తుంది.

 

 

ప్రపంచవ్యాప్తంగా 194 మిలియన్ల పై చిలుకు కస్టమర్లు..

తమ వినియోగదారులను నాణ్యమైన నెట్‌వర్క్‌ను అందించే క్రమంలో పలు ఆధునిక టెక్నాలజీలను వొడాఫోన్ ఉపయోగిస్తోంది. ఈ ఆపరేటర్‌కు 194 మిలియన్ల పై చిలుకు కస్టమర్లు ఉన్నారు.

 

 

5జీకు రెడీ..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

14 మార్కెట్లలో ఇంటర్నెషనల్ రోమింగ్‌ను అందిస్తోన్ననెట్‌వర్క్‌గా వొడాఫోన్ గుర్తింపు తెచ్చుకుంది. తన రేడియో నెట్‌వర్క్‌‍ను ఐపీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేసుకున్న వొడాఫోన్ 5జీకు రెడీ అవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone introduces free calls, data and roaming packs. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot