వోడాఫోన్ దూకుడు : మరో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు లాంచ్
టెలికాం సంస్థ వోడాఫోన్ రీచార్జ్ ప్లాన్‌లో పరిచయడం చేయడంలో దూకుడుగా ఉంది. ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ మరో రెండు రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.
టెలికాం సంస్థ వోడాఫోన్ రీచార్జ్ ప్లాన్‌లో పరిచయడం చేయడంలో దూకుడుగా ఉంది. ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ మరో రెండు రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎక్కువ రోజుల వాలిడిటీతో అధిక డేటా ఇవ్వాలనే ఉద్దేశం తో రూ. 511,రూ. 569 ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.

రూ.511 ప్రీపెయిడ్ ప్లాన్
రూ.511 రీఛార్జి చేయించుకుంటే ప్రిపెయిడ్ వినియోగదారులకు రోజూ 2జీబీ డేటాను 84 రోజుల సమయానికి అందించనున్నట్లు వొడాఫోన్ ఆధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దీనికింద అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 సందేశాలు పంపుకొనే సదుపాయం కూడా ఉంది.

రూ.569 ప్రీపెయిడ్ ప్లాన్
రూ.569 రీఛార్జి చేయించుకుంటే ప్రిపెయిడ్ వినియోగదారులకు రోజూ 3జీబీ డేటాను 84 రోజుల సమయానికి అందించనున్నట్లు వొడాఫోన్ ఆధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దీనికింద అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 సందేశాలు పంపుకొనే సదుపాయం కూడా ఉంది.

ఎయిర్టెల్ రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగా....
వోడాఫోన్ యొక్క కొత్త రూ 569 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇంచు మించు ఎయిర్టెల్ రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగా ఉంటుంది, ఇది రోజుకు 3GB డేటాను అందిస్తుంది. డేటా ప్రయోజనం పరంగా, వొడాఫోన్ రూ .569 ప్లాన్ తో మొత్తం 252 జిబి 4G / 3G డేటాను 84 రోజుల పాటు అందిస్తుంది అలాగే ఈ ప్రణాళికి కింద ఇతర ప్రయోజనాలు, ట్రాయ్ యొక్క నియంత్రణలో అపరిమిత కాల్స్ మరియు మెసేజిలు అందిస్తుందని టెలికాం నివేదికలు వెల్లడించాయి.

రిలయన్స్ జీయో రూ. 509 ప్లాన్...
ఈ కొత్త వొడాఫోన్ ప్లాన్స్ మాదిరిగానే రిలయన్స్ జీయో కూడా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ. 509 ప్లాన్ లో రోజుకి 4GB డేటా అందించనుంది అలాగే, రూ .799 ప్లాన్లో 5GB డేటా అందించనుంది కానీ ఈ ప్లాన్ కేవలం 28 రోజులు మాత్రమే వర్తిస్తుంది.

వోడాఫోన్ రూ. 511 ప్లాన్...
వోడాఫోన్ నుంచి వస్తున్న కొత్త రూ. 511 ప్లాన్ తో ప్రతిరోజు 2GB 3G మరియు 4G డాటాను 84 రోజులపాటు అందించనుంది. ఇది మొత్తం ప్రణాళిక కాలంలో 168GB డాటా అలాగే అపరిమిత కాల్స్ మరియు మెసేజిల ప్రయోజనం అందించనుంది .

వోడాఫోన్ రూ. 549 ప్లాన్...
ప్రస్తుతం, టెలికాం వోడాఫోన్ రూ .549 ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది . రూ .549 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 3.5 జిబి డేటాను అందిస్తోంది, కానీ ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే .


Click it and Unblock the Notifications








