వొడాఫోన్ అన్‌‌లిమిటెడ్ 3జీ ఆఫర్లు!

Posted By: Prashanth

వొడాఫోన్ అన్‌‌లిమిటెడ్ 3జీ ఆఫర్లు!

 

ప్రముఖ టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా కర్ణాటక సర్కిల్ పరిధిలో అన్‌లిమిటెడ్ 3జీ డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తుంది. వివరాల్లోకి వెళితే....... రూ.650, 850, 1250,1599 మంత్లీ రెంటల్స్‌లో ఈ ఆఫర్ల లభ్యమవుతున్నాయి. వీటిలో రూ.650ప్యాకేజ్‌ను ఎంచుకున్న వినియోగదారు 3జీబి డాటా వరకు హైస్పీడ్ 3జీని అందుకోవచ్చు. ఆ తరువాత నుంచి 3జీ వేగం 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. రూ.750ప్యాకేజ్‌ను ఎంచుకున్న యూజర్ 4జీబి డాటా వరకు హైస్పీడ్ 3జీ ఇంటర్నెట్‌ను ఆస్వాదించగలుగుతాడు.

అలాగే రూ.750ప్యాకేజ్‌ను ఎంపిక చేసుకున్న చందాదారు 5జీబి డాటా వరకు కు హైస్పీడ్ 3జీ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. రూ.850 ప్యాకేజ్‌‍లో 8జీబి వరకు హైస్పీడ్ 3జీ ఇంటర్నెట్ సాధ్యం. రూ.1599 ప్యాకేజ్‌ను ఎంచుకున్న యూజర్ 12జీబి వరకు హైస్పీడ్ 3జీ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. దేశీయంగా 3జీ వినియోగాన్ని మరింత విస్తరింపజేసే క్రమంలో ఆపరేటర్లు ఇటీవల కాలంలో అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నారు. తమ తమ వినియోగదారులను 2జీ నుంచి 3జీకి మార్చేందకు అనేక ప్రచార కార్యక్రమాలకు టెలికం ఆపరేటర్లు పూనుకుంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot