వోడాఫోన్ యొక్క కొత్త లాంగ్ టర్మ్ ప్లాన్‌లు

|

ఈ నెల ప్రారంభంలో వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను 42 శాతం పెంచిన సంగతి అందరికి తెలుసు. టెల్కో సాచెట్ మరియు కాంబో వోచర్‌లతో పాటు 9 అపరిమిత ప్లాన్‌లను ప్రారంభించింది. వాటితో పాటుగా ఇప్పుడు వోడాఫోన్ ఐడియా సంస్థ మరొక 3 అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌లను మరియు ఒక ప్లాన్ వోచర్‌ను ప్రవేశపెట్టింది.

కొత్త ధరలు
 

కొత్తగా ప్రవేశపెట్టిన ధరలు రూ.24 నుండి ప్రారంభమవుతాయి. వీటి యొక్క చెల్లుబాటు కాలం,ధరల వివరాలు వంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కనీస రీఛార్జ్ విధానాన్ని కొనసాగిస్తున్న టెల్కోలు

వోడాఫోన్ రూ.24 వోచర్ వివరాలు

వోడాఫోన్ రూ.24 వోచర్ వివరాలు

వోడాఫోన్ యొక్క వోచర్ ప్లాన్ 14 రోజుల సర్వీస్ యాక్సిస్ తో అందిస్తుంది. ఈ వోచర్ తో వినియోగదారులు 100 లోకల్ ఆన్-నెట్ నైట్ నిమిషాలను కూడా పొందుతారు. ఈ కాలింగ్ నిమిషాలు 11PM మరియు 6AM మధ్య ఉపయోగించవచ్చు. 14 రోజుల తరువాత కస్టమర్ అకౌంట్ లో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కనుక రూ.24 అకౌంట్ నుండి ఆటో డెబిట్ అవుతుంది. దీనితో పాటుగా దీని సర్వీసును మరోక 14 రోజుల పాటుగా పొడిగిస్తారు.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం MNP 10 కొత్త నిబంధనలు

రూ.129 లాంగ్ టర్మ్ ప్లాన్

రూ.129 లాంగ్ టర్మ్ ప్లాన్

రూ .129 ప్లాన్ ముందు 2 జీబీ డేటాతో 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందించేది. కానీ ఈ ప్లాన్ ఇప్పుడు 2GB రోజువారీ డేటా, స్థానిక మరియు జాతీయ అపరిమిత కాలింగ్ మరియు 300 స్థానిక మరియు నేషనల్ SMS ప్రయోజనాలను అందిస్తుంది. అయితే చెల్లుబాటును మాత్రం 14 రోజులకు తగ్గించారు.

ఇంటర్నెట్ లేనప్పుడు ట్వీట్ చేయడం ఎలా?

రూ.199 లాంగ్ టర్మ్ ప్లాన్
 

రూ.199 లాంగ్ టర్మ్ ప్లాన్

ధరల పెరుగుదలకు ముందు వోడాఫోన్ యొక్క రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా ప్రయోజనంతో 28 రోజుల చెల్లుబాటు కాలంతో అందించేది. ఈ ప్లాన్‌ను ఇప్పుడు కొన్ని ప్రయోజనాల సర్దుబాటుతో మళ్ళి తిరిగి ప్రారంభించింది. ఇప్పుడు ఇది మీకు కేవలం 21 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అంటే మునుపటి యాక్సిస్ కాలంతో పోలిస్తే 7 రోజులు తక్కువ.

హ్యాకర్‌వన్‌ తో బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ ను ప్రకటించిన వన్‌ప్లస్...రివార్డ్స్ 00

ప్రయోజనాలను

ఈ ప్లాన్ రోజువారీ 100 స్థానిక మరియు జాతీయ SMSలను మరియు అపరిమిత కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. డేటా ప్రయోజనం విషయానికి వస్తే ఈ ప్లాన్ ఇప్పుడు రోజుకు 1GB డేటాను అందిస్తుంది. అంటే మీరు మొత్తం చెల్లుబాటు కాలంలో 21GB డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వోడాఫోన్ ప్లే మరియు ZEE5 లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

రూ.269 లాంగ్ టర్మ్ ప్లాన్

రూ.269 లాంగ్ టర్మ్ ప్లాన్

చివరగా వోడాఫోన్ పరిచయం చేసిన మరొక ప్లాన్ రూ.269 ప్లాన్. ఇది 56 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. వినియోగదారులు దీని మొత్తం చెల్లుబాటు కాలంలో 600 స్థానిక మరియు నేషనల్ SMS లను కూడా పొందుతారు. డేటా ప్రయోజనం విషయానికి వస్తే వినియోగదారులు 4GB రోజువారీ డేటా ప్రయోజనంను పొందుతారు. అంటే మీరు మొత్తం చెల్లుబాటు కాలంలో 224GB డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనాలలో ఈ ప్లాన్ వోడాఫోన్ ప్లే మరియు ZEE5 లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone Launched 3 New Long Term Plans and 1 Voucher Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X