కొత్త ఆఫర్లతో దుమ్మురేపుతున్న వొడాఫోన్, మళ్లీ రెండు..
రోజురోజుకి కొత్త ఆఫర్లతో వొడాఫోన్ దూసుకుపోతోంది. టెలికం రంగంలో తిరుగులేని జియోకు పోటీగా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది.
రోజురోజుకి కొత్త ఆఫర్లతో వొడాఫోన్ దూసుకుపోతోంది. టెలికం రంగంలో తిరుగులేని జియోకు పోటీగా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. మొన్నటికి మొన్న ఆరు నెలల అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రకటించిన సంగతి మరచిపోకముందే మళ్లీ రెండు కొడు కొత్త ఆఫర్లతో దూసుకొచ్చింది. వీటిల్లో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. ఇవి కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

రూ. 496 మొదటి రీచార్జ్‌పై
కొత్త వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో రూ. 496 మొదటి రీచార్జ్‌పై ఉచిత కాలింగ్ సదుపాయాన్ని రోజుకు 1 జీబీ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.

రూ .177 రీచార్జ్‌పై ..
ఇక రెండవ ప్లాన్‌లో కొత్త వినియోగదారుడు రూ .177 రీచార్జ్‌పై అపరిమిత కాలింగ్ సదుపాయంతోపాటు, రోజుకు 1 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

గత వారమే వీక్లీ సూపర్ ప్లాన్..
కాగా గత వారమే వీక్లీ సూపర్ ప్లాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వారం రోజుల ప్లాన్‌లో రూ.69 రీచార్జ్‌పై 500 ఎంబీ, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఆఫర్ చేస్తోంది.

జియో దీపావళి సందర్భంగా..
ఇన్నాళ్లూ చౌకగా అందించిన ప్లాన్స్‌ను పెంచుకుంటూ పోతున్న జియో దీపావళి సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన 491 రూపాయల ప్లాన్‌ను 499 రూపాయలకు పెంచేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








