90 రోజుల సరికొత్త ప్లాన్‌తో దూసుకొచ్చిన వొడాఫోన్
ఏదైనా పండగ వస్తే టెలికాం కంపెనీలకు ముందుగా పండగే.ఎందుకంటే యూజర్లను కొత్త కొత్త ఆఫర్లతో ముంచేస్తుంటాయి.
ఏదైనా పండగ వస్తే టెలికాం కంపెనీలకు ముందుగా పండగే..ఎందుకంటే యూజర్లను కొత్త కొత్త ఆఫర్లతో ముంచేస్తుంటాయి. ఇందులో భాగంగా అన్నింటికంటే ముందుగా వొడాఫోన్ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. తాజాగా రంజాన్ పవిత్ర మాసాన్ని పురష్కరించుకుని టెలికాం దిగ్గజం వొడాఫోన్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 509 రూపాయలతో 'రంజాన్ సే ఈద్ ఉల్ జుహా తక్' అనే రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.4జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ను 90 రోజుల పాటు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం కర్ణాటకకు మాత్రమే అందుబాటులో ఉంది.

2018 మే 16 నుంచి ఆగస్టులో..
రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి అంటే 2018 మే 16 నుంచి ఆగస్టులో ఈద్ ఉల్ జుహా వరకు కర్ణాటకలోని వొడాఫోన్ కస్టమర్లు అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.4జీబీ డేటాను పొందవచ్చని వొడాఫోన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా కస్టమర్లు వొడాఫోన్ ప్లే యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, మక్కా అండ్ మదీనా లైవ్‌లను వీక్షించవచ్చని తెలిపింది.

మరో రెండు ప్లాన్లను
509 రూపాయల ప్లాన్‌తో పాటు, వొడాఫోన్ 569 రూపాయలతో, 511 రూపాయలతో మరో రెండు ప్లాన్లను కూడా లాంచ్ చేసింది. 569 రూపాయల ప్లాన్ కింద రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ను 84 రోజుల పాటు పొందవచ్చని వొడాఫోన్ పేర్కొంది.

511 రూపాయల ప్లాన్ కింద
అదేవిధంగా 511 రూపాయల ప్లాన్ కింద రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ను 84 రోజుల పాటు అందించనున్నామని చెప్పింది. జియో కూడా కొత్తగా రెండు ప్లాన్లను లాంచ్ చేసిన సంగతి విదితమే.

రూ. 101 ప్లాన్
జియో కొత్తగా రోజుకో 2జిబి డేటా చొప్పున 4 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ లాంచ్ చేసింది. మొత్తం 8జిబి డేటాను 4 రోజుల పాటు యూజర్లు అందుకుంటారు. దీని ధర రూ. 101. ఈ డేటా అయిపోయిన తరువాత యూజర్లు 4 రోజుల పాటు 64Kbpsతో అన్ లిమిటెడ్ డేటాను అందుకోవచ్చు. అయితే ఇది ఖచ్చింతగా ఉందా లేదా అనేది ప్లాన్ లో చెప్పలేదు.

రూ.251 ప్యాక్
కాగా జియో కంపెనీ ఐపీఎల్ అభిమానుల కోసం రూ.251 ప్యాక్ ప్రవేశపెట్టిన సంగతి విదితమే.దీని ద్వారా యూజర్లు రోజుకు 2జిబి డేటా చొప్పున 51 రోజులు పాటు పొందుతారు. క్రికెట్ ప్యాక్ కింద దీన్ని యూజర్లు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ.149 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో 149 రూపాయల ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.149 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ లో రోజులు 1 జీబీ డేటా చొప్పున 28 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తున్నారు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. వాలిడిటీ 28రోజులు. అయితే 28 రోజుల వాలిడిటీ ఉన్న జియో 149 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








