సూపర్‌వీక్స్‌ ఆఫర్లు విడుదల చేసిన వొడాఫోన్‌, దాని సమాచారం

Posted By: Super

సూపర్‌వీక్స్‌ ఆఫర్లు విడుదల చేసిన వొడాఫోన్‌, దాని సమాచారం

హైదరాబాద్‌: ఐపిఎల్‌లో మనం మ్యాచ్ చూస్తుంటే మధ్యలో వచ్చేటటువంటి వోడాఫోన్ జుజు యాడ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ యాడ్ వచ్చిన తర్వత మీకోసం వొడాఫోన్‌ సూపర్‌వీక్స్‌ ఆఫర్లు అంటూ యాడ్ అయిపోయింది. ఆ యాడ్ చూసినప్పుడల్లా వొడాఫోన్‌ సూపర్‌వీక్స్‌ ఆఫర్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది అనుకుంటు ఉంటారు. వారికోసమే దేశంలో సెల్యులార్‌ సర్వీసులను అందిస్తున్న వొడాఫోన్‌ ఎస్సార్‌ సూపర్‌వీక్స్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

మొబైల్‌లోనే ప్రతి వారం ఉచి తంగా ఇంటర్నెట్‌ వినియోగించే సౌకర్యాన్ని అందిస్తోంది. వొడాఫోన్‌ 2జి, 3జి వినియోగ దారులు కూడా ఈ ఇంటర్నెట్‌ సర్వీసును పొందవచ్చని వొడాఫోన్‌ ఎస్సార్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కుమార్‌ రామనాధన్‌ తెలిపారు. ఏప్రిల్‌ 25 నుంచి గేమింగ్‌ సూపర్‌వీక్‌ను ప్రారంభించామని, మొబైల్స్‌లోకి వినియోగ దారులు ఇష్టమైన గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పా రు. వినియోగదారులు ‘సూపర్‌’ అని టైప్‌ చేసి 111 టోల్‌ ఫ్రీకి పంపి సేవలను పొందవచ్చన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot