వోడాఫోన్ యొక్క కొత్త రూ.69ల ప్రీపెయిడ్ రీఛార్జ్ వివరాలు

|

టెలికామ్ రంగంలో గొప్ప గొప్ప ఆఫర్లను ఇస్తున్న వోడాఫోన్ ఇప్పుడు తన వినియోగదారులకు మరిన్ని రీఛార్జ్ ఎంపికలను అందించడానికి వోడాఫోన్ తన ఆల్ రౌండర్ ప్రీపెయిడ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను మరింత దూకుడుగా విస్తరిస్తోంది. వోడాఫోన్ రూ.45 ఆల్ రౌండర్ ప్యాక్‌ను విడుదల చేసిన తరువాత ఇప్పుడు అదే పోర్ట్‌ఫోలియో కింద కొత్తగా రూ.69 రీఛార్జ్‌ను తిరిగి తీసుకువస్తోంది.

వోడాఫోన్

వోడాఫోన్ గత సంవత్సరం రూ.35, రూ.65, రూ.95, రూ.145, రూ.245 ఆల్ రౌండర్ రీఛార్జి ప్యాక్ లను ప్రవేశపెట్టింది. అయితే కొన్ని సర్కిల్‌లలో కంపెనీ రూ.65 ఆల్ రౌండర్ ప్లాన్‌లను నిలిపివేసింది. ఇప్పుడు ఇది కొత్తగా రూ .69 ఆల్ రౌండర్ ప్లాన్‌గా మార్పు చేసి విడుదల చేసింది. ఈ ప్లాన్ రూ.65 ఆల్ రౌండర్ ప్యాక్‌తో పోలిస్తే విభిన్న ప్రయోజనాలతో వస్తున్నది.

 

వోడాఫోన్ ఆల్-రౌండర్ ప్యాక్‌ల పూర్తి వివరాలువోడాఫోన్ ఆల్-రౌండర్ ప్యాక్‌ల పూర్తి వివరాలు

వొడాఫోన్

ఈ కొత్త ప్లాన్‌తో వొడాఫోన్ టాక్ టైమ్ ప్రయోజనాన్ని అందించడం లేదు కానీ దానికి బదులుగా టెల్కో వినియోగదారులకు ఉచిత వాయిస్ కాలింగ్ నిమిషాలను అందిస్తోంది. వోడాఫోన్ యొక్క ఇతర ఆల్ రౌండర్ ప్లాన్‌ల మాదిరిగానే రూ.69 ప్యాక్ కూడా సర్వీస్ కాలంను 28 రోజులుగా అందిస్తోంది. ఈ ప్యాక్ యొక్క అన్ని ప్రయోజనాలు రీఛార్జ్ చేసిన తేదీ నుండి 28 రోజులు వరకు చెల్లుతాయి.

వోడాఫోన్ రూ .69 రీఛార్జ్ ఆఫర్స్
 

వోడాఫోన్ రూ .69 రీఛార్జ్ ఆఫర్స్

వోడాఫోన్ ఇప్పుడు రూ.69 ప్రీపెయిడ్ రీఛార్జిని 17 సర్కిల్‌లలో ప్రవేశపెట్టింది. వాటిలో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ & ఎన్‌సిఆర్, గుజరాత్, కర్ణాటక మొదలైనవి ఉన్నాయి. ఇది అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది వినియోగదారుకు 150 నిమిషాల పాటు లోకల్ / ఎస్టీడీ / రోమింగ్ కాల్స్ ను, 250MB 4G/ 2G డేటాను మరియు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం 28 రోజులు. సంస్థ నుండి వచ్చిన ఇతర ఆల్ రౌండర్ ప్లాన్‌లతో పోలిస్తే రూ.69 ఆల్ రౌండర్ ప్లాన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

అల్ రౌండర్ ప్యాక్‌లు

వొడాఫోన్ ఐడియా నుండి వచ్చిన అల్ రౌండర్ ప్యాక్‌లు లేదా యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌లు వినియోగదారుడు వారి అకౌంట్ యొక్క సర్వీస్ వాలిడిటీని మరి కొంత సమయం వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. వోడాఫోన్ మరియు ఐడియా రెండూ కలిపి రూ .35, రూ .65, రూ .95, రూ.145 మరియు రూ. 245 ఐదు ప్యాక్‌లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌ల యొక్క గరిష్ట వాలిడిటీ 84 రోజులు మరియు కనిష్ట వాలిడిటీ 28 రోజులు.

 

జియో నుంచి ఇతరులకు అవుట్ గోయింగ్ ఇకమీద ఉచితం కాదు

ప్రయోజనం

ఆల్ రౌండర్ ప్యాక్‌లు ప్రముఖంగా టాక్ టైమ్, డేటా, ఎస్ఎంఎస్ మరియు రేట్ కట్టర్ ప్రయోజనాలతో అందించబడతాయి. అయితే రూ .69 ప్లాన్ ఉచిత వాయిస్ కాలింగ్ నిమిషాల ప్రయోజనంతో వస్తుంది. అలాగే పైన చెప్పినట్లుగా వోడాఫోన్ కొన్ని సర్కిల్‌లలోని రూ.65 ప్యాక్‌ను తొలగించడానికి కారణం ప్రస్తుతానికి తెలియదు. ముఖ్యంగా ఐడియా కొన్ని సర్కిల్‌లలో ఇలాంటి రూ .69 యాక్టివ్ రీఛార్జ్ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. కాబట్టి వోడాఫోన్ ఐడియా ఆల్ రౌండర్ లేదా యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోందని మేము ఖచ్చితంగా చెప్పగలం.

 

డబుల్ టాక్ టైమ్‌ బెనిఫిట్ తో ఎయిర్‌టెల్ Rs.65 ప్రీపెయిడ్ ప్లాన్డబుల్ టాక్ టైమ్‌ బెనిఫిట్ తో ఎయిర్‌టెల్ Rs.65 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా ఇతర నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌లను అందించడం కొనసాగిస్తున్నది

వోడాఫోన్ ఐడియా ఇతర నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌లను అందించడం కొనసాగిస్తున్నది

భారతదేశంలో టెలికాం ఆపరేటర్లు ఇప్పుడు మరొక కొత్త యుద్ధంలోకి ప్రవేశిస్తున్నారు. దీనిని కూడా మొదటిగా జియో ప్రారంభించింది. 2016 లో రిలయన్స్ జియో మొత్తం జీవితకాలం కోసం వాయిస్ కాల్స్ కోసం ఛార్జీ విధించబోమని ప్రకటించింది. అయితే కొన్ని రోజుల క్రితం కంపెనీ యు-టర్న్ తీసుకొని జియో నంబర్ నుండి ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్‌లను చేయడనికి నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు తెలిపింది.

రిలయన్స్ జియో

ప్రముఖ ఆపరేటర్ రిలయన్స్ జియో ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే వొడాఫోన్ ఐడియా ఒక పత్రికా ప్రకటనతో బయటకు వచ్చింది. గత సంవత్సరం అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని ఇప్పటికే అమలు చేసినందున వాయిస్ కాల్స్ కోసం ఎక్కువ మొత్తం వసూలు చేయరు అని దృవీకరించారు. వొడాఫోన్ ఐడియా ఈ సమయంలో రిలయన్స్ జియో అడుగుజాడలను అనుసరించడం లేదని తెలిపారు. అంతేకాకుండా ఆఫ్-నెట్ వాయిస్ కాల్స్ కోసం కూడా వసూలు చేయకూడదనే నిర్ణయం చందాదారులకు ఉపశమనం కలిగించడం ఆనందంగా ఉంది. భారతి ఎయిర్‌టెల్ కూడా ఆఫ్-నెట్ వాయిస్ కాల్‌లకు ఛార్జీ విధించదని ధృవీకరించింది. అన్‌లిమిటెడ్ అంటే దాని నెట్‌వర్క్‌లో అపరిమితమని చెప్పారు. జియో విషయానికొస్తే ఇది కొన్ని ప్రత్యేక ఐయుసి టాప్-యుపి వోచర్‌లను వినియోగదారులకు ఉచిత ఆఫ్-నెట్ వాయిస్ కాలింగ్ నిమిషాలతో పరిచయం చేసింది.

Best Mobiles in India

English summary
Vodafone New Prepaid Recharge Plan Rs. 69 details in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X