అపరిమిత డేటాతో వొడాఫోన్ సరికొత్త ప్లాన్లు !

Written By:

టెలికాం రంగంలో జియోతో పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టెల్కోలు జియో కన్నా మెరుగైన ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఇందులో భాగంగా వొడాఫోన్ సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఎంపిక చేసిన సర్కిళ్లు మధ్యప్రదేశ్‌, చత్తీష్‌గఢ్‌‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌ అండ్‌ జార్ఖాండ్‌, జమ్ము, కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ యూజర్లకు కొత్తగా ఈ రూ.409, రూ.459 ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి.

Airtelకు యూఐడీఏఐ నుంచి భారీ షాక్ , విచారణకు ఆదేశాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అపరిమిత వాయిస్‌ కాల్స్‌

ఈ రీఛార్జ్‌ ప్యాక్స్‌ కింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత 2జీ డేటాను ఆఫర్‌ చేయనుంది.

ప్యాక్‌లకు మధ్య ఉన్న తేడా

కొత్తగా తీసుకొచ్చిన ఈ రెండు ప్యాక్‌లకు మధ్య ఉన్న తేడా వాలిడిటీ మాత్రమే. రూ.409 ప్లాన్‌ను 70 రోజుల వ్యవధిలో అందిస్తుండగా.. రూ.459 ప్లాన్‌ను 84 రోజుల కాలానికి గాను అందిస్తోంది.

వొడాఫోన్‌ స్టోర్‌ల ద్వారా..

ఆసక్తి గల వినియోగదారులు ఈ ప్యాక్‌లను మైవొడాఫోన్‌ యాప్‌, ఇతర ఆఫ్‌లైన్‌ వొడాఫోన్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.

అందుబాటులో ఉన్న సర్కిల్స్‌లో..

ప్రస్తుతం ఈ ప్యాక్‌లు అందుబాటులో ఉన్న సర్కిల్స్‌లో వొడాఫోన్‌ 3జీ కవరేజ్‌ లేదు. జమ్ము, కశ్మీర్‌ సర్కిల్‌లో ఈ రెండు ప్యాక్‌లు ఇంకా తక్కువ ధరలకే లభించనున్నాయి. రూ.409 ప్లాన్‌ రూ.359కు, రూ.459 ప్లాన్‌ కేవలం రూ.409కే అందుబాటులో ఉంది.

మధ్య ప్రదేశ్‌, చత్తీష్‌గఢ్‌ సర్కిల్‌ వినియోగదారులకు..

వొడాఫోన్‌ ఇటీవలే మధ్య ప్రదేశ్‌, చత్తీష్‌గఢ్‌ సర్కిల్‌ వినియోగదారులకు రూ.176 ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద అపరమిత రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ను అందిస్తోంది.అంతేకాక రోజుకు 1జీబీ డేటాను 28 రోజుల పాటు ఆపర్‌ చేస్తోంది.

రూ.79 నుంచి రూ.509 మధ్యలో..

కాగా రూ.79 నుంచి రూ.509 మధ్యలో కూడా ఐదు సూపర్‌ ప్లాన్లను వొడాఫోన్‌ ఈ నెల మొదట్లో లాంచ్‌ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone New Rs. 409, Rs. 459 Prepaid Packs Offer Unlimited 2G Data More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot