రూ.244కే 70 జీబి 4జీ డేటా అన్‌లిమిటెడ్ కాల్స్
రూ.346 ప్లాన్ కూడా...
భారతదేశపు రెండువ అతిపెద్ద టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా (Vodafone India) సరికొత్త రూ.244 ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా వొడాఫోన్ టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య 70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబి చొప్పున 3G లేదా 4G డేటా లభిస్తుంది.

రూ.244 ప్లాన్ పై మొదటి రీఛార్జ్‌కు మాత్రమే 70 రోజుల వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. రెండువ రీఛార్జ్ పై కేవలం 35 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ.244 ప్లాన్‌తో పాటు రూ.346 ప్లాన్‌ను కూడా వొడాఫోన్ లాంచ్ చేసింది. 56 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి 3G/4G డేటాతో పాటు రూ.300 నిమిషాల వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. My Vodafone యాప్ ద్వారా ఈ ప్లాన్‌లను తీసుకునే వారికి 5% ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ను వొడాఫోన్ కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications








