4జీ ఫోన్లపై వొడాఫోన్ బంపరాఫర్..
దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ తో టెలికం దిగ్గజం వొడాఫోన్ జత కట్టింది. మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ తో టెలికం దిగ్గజం వొడాఫోన్ జత కట్టింది. మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. మైక్రోమ్యాక్స్‌తో కొత్త భాగస్వామ్యం ఏర్పరుచుకుంటున్నట్టు ప్రకటించిన వొడాఫోన్ వెంటనే క్యాష్‌బ్యాక్ వివరాలను వెల్లడించింది.

భారత్ సీరిస్ స్మార్ట్‌ఫోన్లు
ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్, మైక్రోమ్యాక్స్ భారత్ 3, మైక్రోమ్యాక్స్ భారత్ 4, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 1 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వీటి కొన్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

36 నెలల పాటు..
వొడాఫోన్ కొత్త, పాత కస్టమర్లు పైన పేర్కొన్న ఆ నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఒకదాన్ని కొనుగోలు చేయడంతో పాటు 36 నెలల పాటు నెలకు కనీసం రూ.150 వరకు వొడాఫోన్ రీఛార్జ్‌లు చేయించుకోవాలి.

తొలి 18 నెలలు ముగియగానే..
ఇలా చేసిన కస్టమర్లకు తొలి 18 నెలలు ముగియగానే, రూ.900 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత 18 నెలలు ముగియగానే రూ.1300 క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంటే మొత్తంగా రూ.2,200 వరకు క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందనున్నారు.

ఎం-పెసా వాలెట్‌లో..
సబ్‌స్క్రైబర్ వొడాఫోన్ ఎం-పెసా వాలెట్‌లో ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేయనున్నారు.

వొడాఫోన్, మైక్రోమ్యాక్స్‌లు భాగస్వామ్యం ..
గత నెలలో కూడా వొడాఫోన్, మైక్రోమ్యాక్స్‌లు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. అప్పుడు మైక్రోమ్యాక్స్ భారత్ 2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ రూ.999కే అందుబాటులోకి వచ్చింది.

వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ వివరాల లిస్ట్
వొడాఫోన్ క్యాష్‌బ్యాక్ వివరాల లిస్ట్ ఈ పోన్ల మీదనే..


Click it and Unblock the Notifications








