రూ.499కే నెలంతా కాల్స్, 3జీబి 4జీ డేటా..!
రిలయన్స్ జియోకు పోటీగా వొడాఫోన్ తన రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను మరో సారి సవరించింది. తాజా సవరణలో భాగంగా వొడాఫోన్ యూజర్లు అన్ లిమిటెడ్ కాల్స్‌తో పాటు 4జీ డేటాను పొందే వీలుంటుంది.

రూ.499 వొడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో భాగంగా నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 3జీబి 4జీ/3జీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్‌తో వొడాఫోన్ ఆఫర్ చేస్తోంది. రూ.699 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు 5జీబి వరకు 4జీ/3జీ డేటాను యూజర్ పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్లాన్ కొన్ని సర్కిళ్లలో మాత్రమే రన్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్‌టెల్ ఆఫర్ ఇప్పటికే..
తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్లమర్‌ల కోసం భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ స్కీమ్‌లకు మైగ్రేట్ అవటం ద్వారా తమ ఖాతాదారులకు డిసెంబర్ 31, 2017 వరకు ప్రతినెలా 3జీబి 4జీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

4జీ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు..
4జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్ పాత కస్టమర్‌లతో పాటు కొత్త కస్టమర్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ నెల 4న ప్రారంభం కాబోతున్న ఈ ఆఫర్ ఫిబ్రవరి 28, 2017 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రీపెయిడ్ కస్టమర్‌లు నెలకు రూ.345 చెల్లించటం ద్వారా అన్‌లిమిటెడ్ (లోకల్ + ఎస్టీడీ) కాలింగ్‌తో పాటు 1జీబి 4జీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 3జీబి 4జీ డేటా తోడవుతుంది.

మొదటి సారి మాత్రం..
రీఛార్చ్ చేయించుకున్న మొదటి సారి మాత్రం మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా 3జీబి డేటాను పొందాల్సి ఉంటుంది. తదుపరి నెలల నుంచి రూ.345 రీఛార్జ్ పూర్తవ్వగానే 3జీబి డేటా యాడ్ అయిపోతుంటుంది. ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 28 రోజులు. సంవత్సరంలో 13 సార్లు ఈ రీఛార్జ్‌ను పొందే వీలుంటుంది.

MyPlan Infinity
MyPlan Infinity ప్లాన్స్‌లో ఏదో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవట్ ద్వారా ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు ఉచిత 4జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఉదాహరణకు రూ.549 ప్లాన్‌లో ఉన్నట్లయితే అన్‌లిమిటెడ్ (లోకల్ + ఎస్ టీడీ) కాలింగ్‌తో పాటు 3జీబి + 3జీబి 4జీబి డేటా మీకు లభిస్తుంది. అదే రూ.799 ప్లాన్‌లో ఉన్నట్లయితే నెలకు 5జీబి + 3జీబి 4జీబి డేటా మీకు లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.9,000 విలువ చేసే ఎయిర్‌టెల్ 4జీ ఇంటర్నెట్‌ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








