ఏడాది పాటు ఉచిత సేవలు, జియోకి ఝలక్ ఇచ్చిన వొడాఫోన్

వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. వొడాఫోన్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఇకపై ఏడాదిపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కోస

|

వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. వొడాఫోన్ సిమ్ వాడుతున్న కస్టమర్లు ఇకపై ఏడాదిపాటు ఉచిత సేవలు పొందవచ్చు. ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కోసం వొడాఫోన్ ఇండియా సిటీబ్యాంక్‌తో జతకట్టింది. వొడాఫోన్ సిటీబ్యాంక్ ఆఫర్‌లో భాగంగా యూజర్లు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా పొందొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ఏడాదిపాటు ఈ సేవలను ఇలానే ఉచితంగా పొందొచ్చు.

 
ఏడాది పాటు ఉచిత సేవలు, జియోకి ఝలక్ ఇచ్చిన  వొడాఫోన్

ఆఫర్ సొంతం చేసుకోవాలంటే

యూజర్ ఈ ఆఫర్ సొంతం చేసుకోవాలంటే వొడాఫోన్ ప్రస్తుత ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్ అయ్యి ఉండాలి. వొడాఫోన్ వెబ్‌సైట్‌కు వెళ్లి సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్‌స్క్రైబర్‌కు క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత తొలి నెలలో కనీసం రూ.4,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఏ వస్తువు మీద అయినా ఖర్చు చేయవచ్చు. దానికి ఎటువంటి పరిమితి లేదు.

ఏడాదిపాటు ఉచితం

ఏడాదిపాటు ఉచితం

ఈ విధంగా చేసిన వొడాఫోన్ యూజర్లు ఏడాదిపాటు ఉచితంగా రోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందొచ్చు. ఈ ఆఫర్ కేవలం కొన్ని సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో హైదరాబాద్ సర్కిల్ కూడా ఉంది.ఇంకా ఢిల్లీ, నోయిడా, గుర్ గామ్, జైపూర్, చండీఘర్, అహమ్మదాబాద్, ముంబై, బెంగుళూరు, పుణె, హైదరాబాద్, కలకత్తా, సికింద్రాబాద్, చెన్నై,బరోడా, కోయంబత్తూర్ వంటి నగరాల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

ఇంటికే 4జీ సిమ్‌కార్డు

ఇంటికే 4జీ సిమ్‌కార్డు

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.249తో రీచార్జ్ చేసుకునే కొత్త ఖాతాదారుల ఇంటికే 4జీ సిమ్‌కార్డును తెచ్చి ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం వినియోగదారులు వొడాఫోన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ.249 ప్రీపెయిడ్ ప్యాక్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్‌లో భాగంగా రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 28 రోజులు.

ప్రాసెస్ ఇదే
 

ప్రాసెస్ ఇదే

వొడాఫోన్ 4జీ సిమ్ డోర్‌స్టెప్ ఆఫర్ కోసం యూజర్లు తొలుత ఆ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అనంతరం ‘బై నౌ' బటన్‌ను ప్రెస్ చేయాలి. ఆ వెంటనే యూజర్‌కు సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం అడిగి, కొత్త నంబరు కావాలా? లేక ఉన్న నంబరునే ఎంఎన్‌పీ చేయాలా? అని అడుగుతుంది. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే కొన్ని నంబర్లు చూపిస్తుంది. అందులోంచి ఓ నంబరును ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండో ఆప్షన్‌లో మీరు ఎంఎన్‌పీ చేయించుకోవాలనుకుంటున్న నంబరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

రూ.249

రూ.249

సిమ్‌కార్డును డెలివరీ చేయాల్సిన అడ్రస్‌ను పూర్తి చేసిన తర్వాత ప్రీపెయిడ్ ప్యాక్ ధర అయిన రూ.249ను చెల్లించాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక సిమ్‌కార్డును ఉచితంగా మీ ఇంటికి పంపిస్తుంది.

Best Mobiles in India

English summary
vodafone offering unlimited calling 1 5gb daily data for 365 days

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X