Home
News

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను సగం ధరకే ఆఫర్ చేస్తున్న వోడాఫోన్

టెలికాం రంగానికి చెందిన మార్కెట్ వాటా విషయంలో వొడాఫోన్ ఇటీవల కఠినమైన పాచ్ ద్వారా వెళుతోంది.వోడాఫోన్ సంస్థ ఐడియా తో విలీనం అయినప్పటికీ వేగంగా చందాదారులని కోల్పోతోంది.

టెలికాం రంగానికి చెందిన మార్కెట్ వాటా విషయంలో వొడాఫోన్ ఇటీవల కఠినమైన పాచ్ ద్వారా వెళుతోంది.వోడాఫోన్ సంస్థ ఐడియా తో విలీనం అయినప్పటికీ వేగంగా చందాదారులని కోల్పోతోంది. అయితే వొడాఫోన్ ఇప్పటికీ మార్కెట్లో మెజారిటీ వినియోగదారులను కలిగి ఉంది.చందాదారులను కోల్పోకుండా ఉండడానికి వోడాఫోన్ పోస్ట్పెయిడ్ మరియు ప్రీపెయిడ్ చందాదారులకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.

vodafone offers amazon prime membership for half price to prepaid users

పోస్ట్ పెయిడ్ చందాదారులకు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లిక్ లకు ఉచిత సభ్యత్వం వంటి ఉచిత ప్రయోజనాలను అందించింది, అయితే ఇప్పుడు ప్రీపెయిడ్ చందాదారులను కాపాడుకోవడానికి వోడాఫోన్ ప్రయత్తిస్తోంది.

యూత్ ఆఫర్:

యూత్ ఆఫర్:

వొడాఫోన్ ఇప్పటి వరకు వేరొకరికి (థర్డ్ పార్టీ ) సంబందించిన సేవకు ఉచిత చందాను అందించడం లేదు. అయితే అది అమెజాన్ ప్రైమ్ లో యూత్ ఆఫర్ను తిరిగి తెచ్చిపెట్టింది. అంటే యువ వోడాఫోన్ చందాదారులు వార్షిక అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను కేవలం రూ. 499 ల ధరకు పొందవచ్చు. ఇది రూ.999 ల వార్షిక చందా మొత్తంలో దాదాపు 50 శాతం ధర కట్ అవుతుంది.

కండిషన్స్ :

కండిషన్స్ :

అయితే మీరు ఊహించినట్లుగా ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ కేవలం 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయస్సు ఉన్న యువ వినియోగదారులకు మాత్రమే చెల్లుతుంది. అందువలన 24 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న చందాదారుల కోసం ఈ ఆఫర్ చెల్లదు.అంతే కాకుండా ఈ ఆఫర్ జూన్ 30, 2019 వరకు మాత్రమే వర్తించబడుతుంది.మరియు ఈ ఆఫర్ వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐడియా ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ అద్భుతమైన అవకాసం లేదు.

పోస్ట్పెయిడ్ ప్లాన్స్:

పోస్ట్పెయిడ్ ప్లాన్స్:

వోడాఫోన్ తన పోస్ట్పెయిడ్ ప్లాన్స్ రూ .399మరియు ఆ పైన ప్లాన్ లకు ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను ఫ్రీగా అందిస్తుంది. అందువల్ల పోస్ట్పెయిడ్ చందాదారులు ఏ ధర లేకుండా ఉచితంగా పొందుతున్నారు. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ దాని వార్షిక చందాలో చాలా ప్రయోజనాలను అందిస్తుంది. చందాదార్లు అమెజాన్ ప్రైమ్ సర్వీస్,కిండ్ లి, ప్రైమ్ వీడియో మరియు ప్రైమ్ మ్యూజిక్లకు ఎటువంటి ప్రకటనలూ లేకుండా యాక్సిస్ పొందుతారు. ప్రత్యేకమైన షోస్ మరియు మూవీస్ లను చాలా అందిస్తుంది.

ప్రత్యర్థి:

ప్రత్యర్థి:

ఈ ఆఫర్ తో వొడాఫోన్ యువ చందాదారులను ట్యాప్ చేయాలని భావిస్తుంది మరియు దీర్ఘకాలం వాటిని కలిగి ఉంటుంది. అయితే దాదాపు ఇటువంటి ప్లాన్ లను తక్కువ ధరలకు లేదా ఉచితంగా ప్రత్యర్థి రిలయన్స్ జీయో అందిస్తోంది. జీయో ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ ప్లాన్ తో సబ్స్క్రైబర్లు Jio యాప్ లకు యాక్సిస్ పొందుతారు ఇందులో ప్రముఖ JioTV యాప్, JioCinema, AJio, JioSaavn ప్రీమియం సబ్ స్క్రిప్షన్ 90 రోజులు మరియు ఇతర జీయో యాప్ లు ఉన్నాయి. ఎయిర్టెల్ కూడా దీని ముందు వెనుకబడి లేదు దీని ధర రూ .299లు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్ కు నెలవారీ ఉచిత చందాను కూడా అందిస్తోంది. అందువల్ల వొడాఫోన్ ఆఫర్ ఇతర ఆపరేటర్ల కంటే చందాదారులను ఆకర్షించటానికి చాలా ఎక్కువ ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vodafone offers amazon prime membership for half price to prepaid users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X