రూ. 69కే అన్‌లిమిటెడ్ కాల్స్, వొడాఫోన్ మరో షాక్ !
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ దిగ్గజాలతో సై అంటోంది. జియో, Airtelకి ధీటుగా బంఫరాపర్లను ప్రకటిస్తూ పోతోంది.
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ దిగ్గజాలతో సై అంటోంది. జియో, Airtelకి ధీటుగా బంఫరాపర్లను ప్రకటిస్తూ పోతోంది. మొన్నటికీ మొన్న రూ. 399కే 90 జిబి డేటాను ఆరునెలల పాటు అందించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్‌ని వినియోగదారుల మరచిపోకముందే మరో సరికొత్త వీక్లీ ఆఫర్ ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.69 అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది.

అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, 500 ఎంబీ డేటాను..
వొడాఫోన్ సరికొత్త సూపర్‌వీక్ ప్లాన్ లో భాగంగా రూ.69కే యూజర్లకి అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, 500 ఎంబీ డేటాను వారం పాటు అందించనుంది.

వొడాఫోన్ సూపర్‌నెట్ 4జీ అనుభవాన్ని..
ఇది ఒక్కసారి ప్యాక్ కాదని, ప్రతి ఏడు రోజులకు ఒకసారి దీన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎలాంటి ఆందోళన లేకుండా ఉచితంగా వొడాఫోన్ సూపర్‌నెట్ 4జీ అనుభవాన్ని కస్టమర్లు ఎంజాయ్ చేయవచ్చని వొడాఫోన్ ఇండియా కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అవనీష్ ఖోస్లా తెలిపారు.

ఈ ప్యాక్‌ను..
ఈ ప్యాక్‌ను రిటైల్ అవుట్‌లెట్లు, యూఎస్‌ఎస్‌డీ, వెబ్‌సైట్, మైవొడాఫోన్ యాప్ ద్వారా కొనుగోలుచేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఏడాదే కంపెనీ సూపర్‌డే, సూపర్‌వీక్ ప్లాన్‌ను వొడాఫోన్ లాంచ్ చేసింది.

ఇప్పటికే రూ.399 ప్లాన్‌తో..
ఇప్పటికే రూ.399 ప్లాన్‌తో 90 జీబీ 4జీ డేటాను ఆరు నెలల పాటు అందిస్తోంది. దీన్ని మీరు ఒకరోజులో కూడా వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ కూడా ఉంటాయి.

రూ.52తో మరో సూపర్‌వీక్ ప్లాన్
ఇక ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రూ.52తో మరో సూపర్‌వీక్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనికింద అపరిమితంగా వొడాఫోన్ టూ వొడాఫోన్ కాల్స్‌ను, 250ఎంబీ 3జీ, 4జీ డేటాను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








